వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
'ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్' (డొమెస్టిక్) కింద 15వ ఇ-వేలంలో 1.89 ఎల్‌ఎంటీ గోధుమలు, 0.05 ఎల్‌ఎంటీ బియ్యం 2,255 మంది బిడ్డర్లకు విక్రయం
Posted On:
05 OCT 2023 11:14AM by PIB Hyderabad
'ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్' (డొమెస్టిక్) (ఓఎంఎస్‌ఎస్[డి]) కింద ఈ నెల 04న జరిగిన 15వ ఇ-వేలంలో, మొత్తం 1.89 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 0.05 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 2,255 మంది బిడ్డర్లకు విక్రయించారు.
దేశవ్యాప్తంగా 481 డిపోల నుంచి 2.01 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 264 డిపోల నుంచి 4.87 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులోకి తెచ్చారు.
బియ్యం, గోధుమలు, గోధుమ పిండి ధరలను నియంత్రించడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా... గోధుమలు, బియ్యం రెండింటికీ వారానికి ఒకసారి ఇ-వేలం నిర్వహిస్తారు. 2,447 మంది నమోదిత కొనుగోలుదార్లు ఇ-వేలంలో పాల్గొన్నారు.
ఎఫ్‌ఏక్యూ గోధుమల రిజర్వ్ ధర క్వింటాలుకు రూ.2150 కాగా, సగటు అమ్మకం ధర క్వింటాలుకు రూ.2185.05గా ఉంది. యూఆర్‌ఎస్ గోధుమల రిజర్వ్ ధర క్వింటాలుకు రూ.2125 కాగా, సగటు అమ్మకం ధర క్వింటాలుకు రూ.2193.12గా ఉంది.
బియ్యం విషయానికి వస్తే, రిజర్వ్ ధర క్వింటాలుకు రూ.2932.83 కాగా, సగటు అమ్మకం ధర క్వింటాలుకు రూ.2932.91గా ఉంది.
ప్రస్తుత విడత ఇ-వేలంలో, కొనుగోలుదార్లకు గరిష్టంగా 10 నుంచి 100 టన్నుల గోధుమలు, 10 నుంచి 1000 టన్నుల బియ్యం అందించడం ద్వారా చిల్లర ధరను తగ్గించడం ప్రభుత్వం లక్ష్యం.
సరకు అక్రమ నిల్వలను నివారించడానికి, (ఓఎంఎస్‌ఎస్[డి]) కింద గోధుమ విక్రయాల్లో వ్యాపారులు పాల్గొనకుండా నిషేధించారు. (ఓఎంఎస్‌ఎస్[డి]) కింద గోధుమలు కొన్న పిండి మిల్లుల్లో తరచూ తనిఖీలు చేస్తున్నారు. ఈ నెల 04 వరకు దేశవ్యాప్తంగా 1,229 తనిఖీలు జరిగాయి.
***
(Release ID: 1964558)
Visitor Counter : 109