విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఫోరమ్ ఆఫ్ రెగ్యులేటర్‌తో సమావేశమైన కేంద్ర విద్యుత్ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన మంత్రి సింగ్


- ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్లు విద్యుత్ (వినియోగదారుల హక్కులు) నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడాలి: కేంద్ర విద్యుత్ మరియు ఎన్ఆర్ఈ మంత్రి ఆర్.కె. సింగ్

- "రెగ్యులేటర్లు AT&C నష్టాలను తగ్గించడానికి వాస్తవిక పథాన్ని నిర్దేశించాలి మరియు ఖర్చు-ప్రతిబింబించే టారిఫ్‌లను నిర్ణయించాలి": మంత్రి

Posted On: 04 OCT 2023 7:27PM by PIB Hyderabad

ఆచరణీయమైన,  శక్తివంతమైన విద్యుత్ రంగం కోసం రెగ్యులేటరీ కమీషన్లు చేయాల్సిన ప్రయత్నాలను చర్చించడానికి కేంద్రరాష్ట్ర మరియు జాయింట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ రెగ్యులేటర్లతో కేంద్ర విద్యుత్ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కెసింగ్ సంభాషించారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన చట్టం, విధానాలు మరియు నిబంధనలకు అనుగుణంగా నియంత్రణ యంత్రాంగాల ఏర్పాటులో సాధించిన పురోగతిని ఆయన సమీక్షించారు. అక్టోబర్ 3, 2023న న్యూ ఢిల్లీలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. 2022 అక్టోబర్‌లో జరిగిన చివరి సమావేశం నుండి, టారిఫ్ ఆర్డర్‌లను సకాలంలో జారీ చేయడం మరియు పంపిణీ కంపెనీలు, ట్రాన్స్‌మిషన్ లైసెన్సీలు, ఉత్పాదక యుటిలిటీల యొక్క ట్రూ-అప్ ఆర్డర్‌లతో సహా అనేక రంగాలలో భారీ అభివృద్ధి జరిగిందని విద్యుత్ మంత్రి గమనించారు. ఖర్చు-ప్రతిబింబించే టారిఫ్‌కు చాలా కీలకమని, ఇది విద్యుత్ రంగం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దారితీస్తుందని మంత్రి అన్నారు. విద్యుత్ వ్యవస్థ యొక్క మెరుగైన పనితీరు కోసం రెగ్యులేటర్ల కృషిని శ్రీ సింగ్ ప్రశంసించారు. అయితే, కొన్ని కమీషన్లలో కేసుల పెండింగ్‌లు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యతపై పరిష్కరించాలని కమిషన్‌లకు సూచించారు. డిస్కమ్‌ల మొత్తం సర్వీస్ ఖర్చును కవర్ చేస్తూ, టారిఫ్ ఖర్చు-ప్రతిబింబించేలా  చూడాలని రెగ్యులేటర్లను మంత్రి కోరారు. భారత ప్రభుత్వం ఎనర్జీ ఆడిట్‌ను తప్పనిసరి చేసిందని ఆయన సూచించారు. ఇది పర్యవేక్షించబడాలి, ఎందుకంటే ఇది లీకేజీ / విద్యుత్ చౌర్యం ఉన్న ప్రాంతాలను గుర్తించడంలో సహాయపడుతుంది మరియు ఏటీ&సీ నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఏటీ&సీ నష్టాలను తగ్గించే పథాలు వాస్తవికంగా ఉండాలని ఆయన సూచించారు. దేశంలో ప్రీ-పెయిడ్ మీటర్ల రోల్ అవుట్‌ అంశంపై కూడా శ్రీ ఆర్.కె. సింగ్ ఉద్ఘాటించారు, ఇది డిస్కమ్‌ల బిల్లింగ్ మరియు కలెక్షన్ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. ఫలితంగా వారి ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా, వినియోగదారులు ముందస్తు చెల్లింపు కారణంగా డిస్కమ్‌ల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను కూడా ఇది తగ్గిస్తుందని తెలిపారు.  ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వినియోగదారులకు సబ్సిడీని అందించాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక హక్కు అయితే.. నియంత్రకాలుగా, డిస్కమ్‌లు రాష్ట్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ మొత్తాన్ని పొందేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర కమీషన్‌లపై ఉందని విద్యుత్ మంత్రి నొక్కి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ప్రకటించే స్వేచ్ఛను కలిగి ఉన్నాయని, అయితే వాటికి వెంటనే చెల్లించాల్సి ఉంటుందని శ్రీ సింగ్ అన్నారు. విద్యుత్ ఉచితం కాదని, దానికి డబ్బు చెల్లించాల్సిందేనని పునరుద్ఘాటించారు. విద్యుత్ అందుబాటులో లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదని మంత్రి అన్నారు. విద్యుత్ సరఫరా 24x7 ఉండాలి. అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న/అభివృద్ధి చెందని దేశానికి మధ్య వ్యత్యాసం లోడ్ షెడ్డింగ్/బ్లాక్‌అవుట్‌లు అని శ్రీ సింగ్ హైలైట్ చేశారు. విద్యుత్ (వినియోగదారుల హక్కులు) నిబంధనల ప్రకారం ఉచిత లోడ్ షెడ్డింగ్‌కు జరిమానాలు విధిస్తున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన నొక్కి చెప్పారు. ఆర్థికంగా లాభదాయకమైన మరియు పర్యావరణపరంగా స్థిరమైన విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనుకూలమైన నియంత్రణ పర్యావరణ వ్యవస్థను నిర్వహించడానికి మంత్రి చేసిన సూచనలను అనుసరిస్తామని రెగ్యులేటర్లు హామీ ఇచ్చారు.

***



(Release ID: 1964519) Visitor Counter : 102


Read this release in: English , Urdu , Hindi