రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

'స్వావలంబన్ 2.0' ప్లీనరీ సమావేశంలో రక్షణ మంత్రి కీలక ప్రకటనలు


డి ఎం ఎ కు చెందిన 98 అంశాలతో కూడిన 5వ పాజిటివ్ ఇండిజెనైజేషన్ జాబితా విడుదల: జాబితాలో అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థలు, సెన్సర్లు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి చేర్పు

డిస్క్ 10, డిస్క్ 10 ప్రైమ్ కింద 76 ఛాలెంజ్ లు , ఇండస్ ఎక్స్ కింద రెండు ఛాలెంజ్ లు కూడా ప్రారంభం
డ్యూయల్ చిప్ డెబిట్ కార్డు 'ఎస్ బి ఐ ఎన్ ఎ వి క్యాష్ కార్డ్' ఆవిష్కరణ: సముద్రంలో ఉన్నప్పుడు ఆన్ లైన్ మోడ్ లోనూ, ఆఫ్ లైన్ లోనూ కూడా ఉపయోగం

భారత రక్షణ రంగం ఆవిష్కరణల పడవలో పయనిస్తోంది: రాజ్ నాథ్ సింగ్

Posted On: 04 OCT 2023 6:22PM by PIB Hyderabad

రక్షణ, ఆవిష్కరణలలో 'ఆత్మనిర్భరతను' ప్రోత్సహించడానికి, 2023 అక్టోబర్ 04 న్యూఢిల్లీలో ప్రారంభమైన నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజెనైజేషన్ ఆర్గనైజేషన్ (ఎన్ఐఐఒ) రెండు రోజుల సెమినార్ 'స్వావలంబన్ 2.0' ప్లీనరీ సెషన్ లో రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ అనేక ముఖ్యమైన  ప్రకటనలు చేశారు. 98 అంశాలతో కూడిన సైనిక వ్యవహారాల విభాగం (డీఎంఏ) ఐదో పాజిటివ్ స్వదేశీకరణ జాబితాను విడుదల చేయడం ప్రధాన అంశం. అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థలు, సెన్సర్లు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని జాబితాలో చేర్చారు. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ (డి పి)  2020లో ఇచ్చిన నిబంధనల ప్రకారం వస్తువులన్నింటినీ నిర్ణీత గడువులోగా స్వదేశీ వనరుల నుంచి కొనుగోలు చేయనున్నారు.

10 డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజెస్ (డిస్క్ 10), డిస్క్ 10 ప్రైమ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడీఇఎక్స్) కింద పరిశ్రమ కోసం 76 సవాళ్లను, ఫౌజీ కోసం ఐడెక్స్ కింద ఐదు ప్రాబ్లమ్ స్టేట్ మెంట్లను రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఐడీఇఎక్స్ , యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ (యుఎస్ డి డి ) సంయుక్తంగా ఖరారు చేసిన 'ఇండస్-ఎక్స్ మ్యూచువల్ ప్రమోషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ కొలాబరేటివ్ టెక్నాలజీస్' (ఇంపాక్ట్) ఛాలెంజ్ కింద రెండు ఇండస్ ఎక్స్ సవాళ్లను రక్షణ మంత్రి ప్రారంభించారు. భారత నౌకాదళం రూపొందించిన అప్ డేటెడ్ ఇండిజెనైజేషన్ రోడ్ మ్యాప్ 'స్వావలంబన్ 2.0'ను ఆయన విడుదల చేశారు. సెమినార్ రెండవ రోజున రోడ్ మ్యాప్ సూక్ష్మాంశాలను వివరించడానికి పరిశ్రమ కోసం ఒక ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించనున్నారు.

శ్రీ రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, నావికాదళంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2022లో జరిగిన తొలి స్వావలంబన్ సెమినార్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన స్ప్రింట్ ఇన్నోవేటివ్ ఛాలెంజ్ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో దోహదపడిందని ప్రశంసించారు. ప్రధాని దార్శనిక నాయకత్వం దేశాన్ని ఎలాంటి సందేహం లేకుండా, ఆత్మవిశ్వాసంతో మిషన్ మోడ్ లో ముందుకు నడిపించిందని కొనియాడారు. భారత రక్షణ రంగం ప్రస్తుతం ఆవిష్కరణల పడవలో పయనిస్తోందని చెబుతూ, యువతకు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడానికి, అభివృద్ధి చేయడానికి ఒక వేదికను అందించినందుకు ఐడెక్స్ ను ఆయన ప్రశంసించారు, ఇది స్టార్టప్ పురోగతిని నిర్ధారించడమే కాకుండా, దేశ రక్షణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

విజ్ఞానం, ఆవిష్కరణల రంగంలో భారతదేశం ఎల్లప్పుడూ స్వయం సమృద్ధిగా ఉందని, 2014లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి రంగంలోనూ 'ఆత్మనిర్భర్' అనే భావనను పునరుజ్జీవింపజేసిందని రక్షణ మంత్రి అన్నారు. “విదేశీ దురాక్రమణల కారణంగా మన వినూత్న విధానాన్ని మర్చిపోయాం. ‘ స్థానిక‘('లోకల్' )అనే పదం తక్కువ నాణ్యతకు పర్యాయపదంగా మారింది. ఇప్పుడు మనస్తత్వం నుంచి విముక్తి పొందుతున్నాం. మన ప్రధాన మంత్రి 'వోకల్ ఫర్ లోకల్' ప్రచారాన్ని ప్రారంభించి స్థానిక వస్తువుల పట్ల గౌరవాన్ని పునరుద్ధరించారు. మన యువత ఇప్పుడు తమ అంతర్గత బలాన్ని గుర్తించి అంతర్గత సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. రాబోయే కాలంలో తమ వినూత్న విధానం, పరిజ్ఞానంతో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారుఅని అన్నారు.

ఐడెక్స్, ఎన్ ఐఐఓ, టెక్నాలజీ డెవలప్ మెంట్ యాక్సిలరేషన్ సెల్ (టి-డాక్) వంటి కార్యక్రమాల ద్వారా స్వావలంబన భారత్ ను నిర్మించడంలో రక్షణ ఉత్పత్తుల విభాగం l కీలక పాత్ర పోషించిందని శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రశంసిస్తూ, యువతను రక్షణ రంగంతో, ముఖ్యంగా ఆర్ అండ్ డి , తయారీ రంగంతో అనుసంధానించడానికి మరింత కృషి అవసరమని ఆయన పేర్కొన్నారు. ఐడెక్స్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఆయన పలు సూచనలు చేశారు.

సాంకేతిక సవాళ్లను జాగ్రత్తగా అంచనా వేయాలని రక్షా మంత్రి పిలుపునిచ్చారు - అవి నేటి కాలానికి అనుగుణంగా అత్యాధునికంగా ఉన్నాయా , సమీప భవిష్యత్తులో మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఆశించబడుతుందా. ఇప్పటికే మార్కెట్లో ఎక్కడైనా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందా లేక మళ్లీ చక్రం కనుగొంటున్నామా అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా సాంకేతిక పరిజ్ఞానం సాధ్యాసాధ్యాలను అంచనా వేయడం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది  ఆర్ అండ్ డి పై ఖర్చుకు మంచి విలువను అందిస్తుంది అని ఆయన అన్నారు. ఏదైనా సాంకేతిక పరిజ్ఞానం లేదా సవాలును ప్రవేశపెట్టడానికి ముందు విశ్లేషణను నిర్వహించే బలమైన యంత్రాంగాన్ని రూపొందించాలని ఆయన సూచించారు. ఇందుకోసం డి డి పి, డి ఆర్ డి   సాయుధ బలగాలు కలిసి నిపుణులతో కూడిన స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చని, ఇది విశ్లేషణ యంత్రాంగాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు. గత సవాళ్ల సమయంలో అభివృద్ధి చేసిన ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్కెట్ లో ఎక్కడ ఉంచారో అంచనా వేయాలని రాజ్ నాథ్ సింగ్ సూచించారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే దిశగా సంస్కరణలు చేపట్టాలని సూచించారు. 50 సవాళ్లు ఉన్నాయని, వాటన్నింటినీ సాధిస్తున్నామంటే సవాలు స్థాయిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఆవిష్కరణలకు ఊతమిస్తుందని చెప్పారు.

ముందుకు సాగడానికి పనిని నిరంతరం మదింపు చేయాలని రక్షణ మంత్రి నొక్కి చెప్పారు. ఛాలెంజ్ కు స్ప్రింట్ అని పేరు పెట్టవచ్చునని, అయితే మారథాన్ రేస్ లాగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. "మనం కొన్ని మీటర్లు మాత్రమే కవర్ చేయాల్సిన అవసరం లేదు. మైళ్ల దూరం ప్రయాణించాలి. ఇది స్ప్రింట్, మారథాన్ రెండూ' అని తెలిపారు.

సందర్భంగా నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరి కుమార్ మాట్లాడుతూ, గత ఏడాది నౌకాదళం 75 సవాళ్లకు పరిష్కారాలను కోరిందని, 1,000 కంటే ఎక్కువ ప్రతిస్పందనలను పొందిందని, డిస్క్ 7 స్ప్రింట్ , స్ప్రింట్-ప్రైమ్ కింద 118 విజేతలను ప్రకటించిందని, ఐడెక్స్ ,పరిశ్రమ మధ్య 100 కి పైగా సాంకేతిక అభివృద్ధి ఒప్పందాలను కుదుర్చుకుందని తెలిపారు.   వీటిని గ్లోబల్ ఫస్ట్స్, గేమ్ ఛేంజర్స్, ఫోర్స్ గుణకాలుగా ఆయన అభివర్ణించారు. రేఖీయ వృద్ధిని దాటి కాంపౌండింగ్ అంటే ఒక సాంకేతికతను అవలంబించడమే నౌకాదళ లక్ష్యమని నౌకాదళాధిపతి చెప్పారు. విజన్ డ్రీమ్ మొదలు అయిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన రక్షణ పరిశ్రమ, ఎంఎస్ఎంఇ లు, స్టార్టప్లు,, విద్యారంగాన్ని ఆయన అభినందించారు.

ఐదవ పాజిటివ్ స్వదేశీకరణ జాబితా

 భాగస్వాములందరితో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపిన తర్వాత ఐదో పాజిటివ్ స్వదేశీకరణ జాబితాను డి ఎం   రూపొందించింది. ముఖ్యమైన ప్లాట్ ఫామ్ లు, వెపన్ సిస్టమ్ అండ్ సెన్సార్లు ,యుద్ధ సామగ్రితో పాటు ప్రధాన వ్యవస్థల భాగాల దిగుమతి ప్రత్యామ్నాయంపై ఇది ప్రత్యేక దృష్టి పెడుతుంది, ఇవి అభివృద్ధి చేయబడుతున్నాయి .రాబోయే ఐదు నుండి పది సంవత్సరాలలో దృఢమైన ఆర్డర్లుగా మారతాయి.

ప్రముఖమైన వాటిలో -ఫ్యూచరిస్టిక్ ఇన్ ఫాంట్రీ కాంబాట్ వెహికల్, ఆల్-టెరైన్ వెహికల్స్, ఆర్మీ కోసం 2 కిలోల పేలోడ్ తో రిమోట్లీ పైలట్ ఎయిర్ బోర్న్ వెహికల్స్, నేవల్ షిప్ బోర్న్ మానవరహిత వైమానిక వ్యవస్థ, మీడియం అప్ గ్రేడ్ లో ఎండ్యూరెన్స్ క్లాస్ వ్యూహాత్మక డ్రోన్, ఆర్మీ కోసం ఎలక్ట్రిక్ లైట్ వెహికల్, ఆర్టిలరీ కోసం మీడియం రేంజ్ ప్రెసిషన్ కిల్ సిస్టమ్, ఆర్మీ కోసం నెక్ట్స్ జనరేషన్ లో లెవల్ లైట్ రాడార్, ఆటోమేటిక్ కెమికల్ ఏజెంట్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్ (ఎఎఫ్ వి) ప్రొటెక్షన్ అండ్ కౌంటర్ మెజర్స్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ మొబైల్ కామోఫ్లేజ్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత శాటిలైట్ ఇమేజ్ అనాలిసిస్, ట్యాంక్ టి - 90 ఎస్ / ఎస్కె కోసం గైడెడ్ వెపన్ సిస్టమ్ కోసం టెస్ట్ ఎక్విప్మెంట్, ఆప్టిక్ ఫైబర్ ఆధారిత నెట్వర్క్ల కోసం క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (200 కిలోమీటర్ల పరిధి వరకు), వెరీ హై ఫ్రీక్వెన్సీ రాడార్, నావల్ ప్లాట్ఫామ్స్ కోసం ఎలక్ట్రో ఆప్టిక్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్, ఎంఐ-17 హెలికాప్టర్ కోసం క్యాబిన్ నోస్ సెక్షన్ కోసం ఆర్మర్ ప్లేట్లు, OSA-AK-M క్షిపణి సిస్టమ్ కోసం ఆటోమేటెడ్ మొబైల్ టెస్ట్ సిస్టమ్; వైమానిక దళానికి మల్టీఫంక్షనల్ ఏవియేషన్ గ్రౌండ్ ఎక్విప్ మెంట్, ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ కు గ్రావిటీ రోలర్లు, పీ-8, మిగ్ 29-కే విమానాల ఫ్లేర్స్ మొదలైనవి ఉన్నాయి.

జాబితాలోని అంశాలు సాయుధ దళాల ధోరణి , భవిష్యత్తు అవసరాలను అర్థం చేసుకోవడానికి , దేశంలో అవసరమైన పరిశోధన , అభివృద్ధి, తయారీ సామర్థ్యాన్ని సృష్టించడానికి దేశీయ పరిశ్రమకు పుష్కలమైన విజిబిలిటీని, అవకాశాన్ని అందిస్తాయి.

రక్షణ రంగంలో స్వావలంబన కోసం రక్షణ మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుంది. స్వదేశీకరణ సాధనలో సానుకూల స్వదేశీకరణ జాబితాలు అత్యంత ముఖ్యమైన పరివర్తనాత్మక సంస్కరణలలో ఒకటి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల క్రియాశీలక భాగస్వామ్యంతో రక్షణ రంగ స్వయం సమృద్ధి సాధించడానికి, ఎగుమతులను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్'లో ఇది కీలక భాగం. 411 మిలిటరీ వస్తువులతో కూడిన నాలుగు పాజిటివ్ స్వదేశీకరణ జాబితాలను డీఎంఏ గతంలో ప్రకటించింది. డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ (డీపీఎస్ యూ) కోసం లైన్ రీప్లేస్ మెంట్ యూనిట్లు/సబ్ సిస్టమ్స్/స్పేర్స్ అండ్ కాంపోనెంట్స్ సహా మొత్తం 4,666 అంశాలతో కూడిన నాలుగు పాజిటివ్ స్వదేశీకరణ జాబితాలను డీడీపీ నోటిఫై చేసింది.

ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలతో పరిశ్రమ, ముఖ్యంగా ప్రైవేటు రంగం అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థలు, సెన్సార్లు, సిమ్యులేటర్లు, ఆయుధాలుమందుగుండు సామగ్రి మొదలైన వాటిని తయారు చేయడానికి / సమీకృతం చేయడానికి విశ్వాసాన్ని ,సామర్థ్యాన్ని పెంచుకుంటోందని గమనించడం ప్రోత్సాహకరంగా ఉంది. టెక్నాలజీ, మాన్యుఫాక్చరింగ్ సామర్థ్యాల్లోకి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దేశీయ ఆర్ అండ్ డీ సామర్థ్యాన్ని ప్రేరేపించే అవకాశం ఉంది. డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ లో పెరుగుతున్న దేశీయ పరిశ్రమ సామర్థ్యాన్ని గుర్తించడంతో పాటు, బలమైన , స్వావలంబన రక్షణ పరిశ్రమను ప్రోత్సహించడానికి, దిగుమతులను తగ్గించడానికి సానుకూల స్వదేశీకరణ జాబితాలు బలమైన సంకల్పాన్ని సూచించాయి. వచ్చే 5 నుంచి 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థకు, వృద్ధికి రక్షణ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్న వాస్తవాన్ని గుర్తించింది.

ఐడెక్స్ డిస్క్ 10 అండ్ డిస్క్ 10 ప్రైమ్ సవాళ్లు

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిస్క్ 10 అండ్ డిస్క్ 10 ప్రైమ్ కింద రక్షణ మంత్రి పరిశ్రమ కోసం 76 ఛాలెంజ్ లను ప్రారంభించారు. త్రివిధ దళాలు, ఇండియన్ కోస్ట్ గార్డ్, డీపీఎస్ యూలు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, మిషన్ డెఫ్ స్పేస్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్ స్టేట్ మెంట్లు సవాళ్లలో ఉన్నాయి. వీటితో పాటు ఐడెక్స్ ఫర్ ఫౌజీ (4ఎఫ్) పథకం కింద ఐదు సమస్యలను కూడా ప్రారంభించారు.

ఇండస్ ఎక్స్ సవాళ్లు

భారతదేశంయుఎస్ లోని స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలు, వ్యాపారాలు , విద్యా సంస్థల మధ్య వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యం , రక్షణ పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడానికి ఐడిఎక్స్ ఇటీవల వాషింగ్టన్ డిసిలో ఇండియా-యుఎస్ డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్ (ఇండస్ ఎక్స్) కార్యక్రమాన్ని నిర్వహించింది. సెమినార్ సందర్భంగా రక్షణ మంత్రి ప్రారంభించిన ఇంపాక్ట్ కింద మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే ఐడెక్స్, యూఎస్ డీవోడీ రెండు సంయుక్త ఇండస్ ఎక్స్ ఛాలెంజ్ లను ఖరారు చేశాయి. భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో ఐడెక్స్ విజేతలను, ముఖ్యంగా ఇప్పటికే కొనుగోలు కాంట్రాక్టులు పొందిన వారిని సన్మానించారు.

ఇన్వెంట్

ఐడెక్స్ ఇన్నోవేటర్స్ హబ్ (ఐఐహెచ్) ద్వారా డిఫెన్స్ ఎకోసిస్టమ్ లోకి nవెంచర్ క్యాపిటల్ ను ప్రవేశపెట్టేందుకు ఎన్ఐఐవో, డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ (డీఐఓ) సంయుక్తంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. సదస్సులో 'ఇన్వెంట్' (ఐడెక్స్-నేవీ వెంచర్ ఫర్ టెక్నాలజీ)ను ప్రారంభించారు. వీటితో పాటు మరికొన్ని ఎంవోయూలు కూడా కుదుర్చుకున్నారు. వీటిలో విద్యారంగం, పరిశ్రమతో ఎన్ఐఐఒ ఎంవోయూలు ఉన్నాయి.

ఎస్ బి ఎన్ వి ఇక్యాష్ కార్డు

రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) , భారత నౌకాదళం అభివృద్ధి చేసిన ఒక డ్యూయల్ చిప్ డెబిట్ కార్డు అయిన ఎస్ బి ఎన్ వి ఇక్యాష్ కార్డును కూడా ప్రారంభించారు. సముద్రంలో ఉండగా , బ్యాంకుతో డైరెక్ట్ కనెక్టివిటీ లేనప్పుడు ఆన్ లైన్ మోడ్ (రెగ్యులర్ డెబిట్ కార్డుగా) అలాగే ఆఫ్ లైన్ మోడ్ లో కార్డును ఉపయోగించుకోవచ్చు. వివిధ భారత నావికాదళ నౌకల్లో కార్డును అభివృద్ధి చేసి పరీక్షించగా, ఇప్పుడు పాన్ నేవీ ప్రయోగానికి సిద్ధమైంది. నగదు రహిత ఆర్థిక లావాదేవీలతో ప్రధాని కలలుగన్న డిజిటల్ ఇండియాకు కార్డు ఒక సానుకూల అడుగు, ఎందుకంటే ఇది ఎత్తైన సముద్రాలలో కూడా నౌకలలో నగదు వాడకాన్ని నిరోధిస్తుంది.

ఎగ్జిబిషన్

 

స్ప్రింట్ (ఐడెక్స్, ఎన్ఐఐవో, టీడీఏసీ ద్వారా ఆర్ అండ్ డీ లో సపోర్టింగ్ పోల్ వాల్టింగ్) కింద అభివృద్ధి చేసిన ఉత్పత్తులను సెమినార్ సందర్భంగా ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా 75 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కనీసం 75 టెక్నాలజీలు/ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని భారత నౌకాదళం లక్ష్యంగా పెట్టుకుంది. అనుకున్న లక్ష్యాన్ని అధిగమించారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. భారత సైన్యం , భారత వైమానిక దళం వైస్ చీఫ్ లు; సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫాక్చరర్స్ (ఎస్ఐడీఎం) అధ్యక్షుడు ఎస్పీ శుక్లా, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.

   

***


(Release ID: 1964515) Visitor Counter : 171


Read this release in: English , Urdu , Hindi , Tamil