పర్యటక మంత్రిత్వ శాఖ
పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ప్రారంభమైన PATA ట్రావెల్ మార్ట్ 2023
Posted On:
04 OCT 2023 8:48PM by PIB Hyderabad
పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ( PATA) ట్రావెల్ మార్ట్ 2023 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమయింది. న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని అద్భుతమైన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ లో పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ( PATA) ట్రావెల్ మార్ట్ 2023 ప్రారంభ వేడుక నిర్వహించారు. మూడు సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ( PATA) ట్రావెల్ మార్ట్ అక్టోబర్ 4 నుంచి 6 వరకు జరుగుతుంది. కోవిడ్ కారణంగా మూడు సంవత్సరాల పాటు సదస్సు జరగలేదు. కార్యక్రమంలో ప్రపంచం వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటక నిపుణులు, పర్యాటక రంగంతో సంబంధం ఉన్న వివిధ వర్గాలు పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ( PATA) ట్రావెల్ మార్ట్ 2023 కు హాజరవుతారు.
కార్యక్రమానికి ఆతిధ్యం ఇస్తున్న పర్యాటక మంత్రిత్వ శాఖకు పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ చైర్మన్ పీటర్ సెమోన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచం వివిధ ప్రాంతాల్లో ఉన్న పర్యాటక కేంద్రాలకు ప్రాచుర్యం కల్పించి, వ్యాపార విస్తరణ కోసం సభ్యులకు అవగాహన కల్పించి, అభివృద్ధి సాధించడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ కృషి చేస్తుందని అన్నారు. పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ట్రావెల్ మార్ట్ 2023 అవసరమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. జీవితంలో యాత్రలు చేయడం ఒక అబ్దుత ఘట్టంగా ఉంటుందని పీటర్ సెమోన్ అన్నారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ట్రావెల్ మార్ట్ 2023 ఉపయోగపడుతుందని ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి.విద్యావతి అన్నారు.ఐక్యత సాధించడానికి పర్యాటక రంగం సహకరిస్తుందని ఆమె అన్నారు. అనుభవాలు పంచుకోవడం ద్వారా ఐక్యత సాధించడానికి వీలవుతుందని అన్నారు. యాత్ర అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలకంగా ఉంటుంది అని విద్యావతి అన్నారు. లైఫ్ మిషన్ యాత్రలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అన్ని పర్యాటక ప్రాంతాలు సమగ్రంగా సంపూర్ణంగా పచ్చదనం, శుభ్రత తో అభివృద్ధి సాధించడానికి చర్యలు అమలు జరగాలన్నారు.
పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ట్రావెల్ మార్ట్ 2023 లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతిష్టాత్మక PATA గోల్డ్ అవార్డు ప్రదానోత్సవం తో సహా యువజన సమ్మేళనం, సుస్థిర అభివృద్ధి సాధన, ముఖాముఖి చర్చలు నిర్వహిస్తారు.
ట్రావెల్ మార్ట్‌లో భారతదేశం కూడా పాల్గొంటోంది. మార్ట్ వద్ద భారతదేశం ఏర్పాటు చేసిన పెవిలియన్ లో భారతదేశంలో గుర్తింపు పొందిన, గుర్తింపు పొందని పర్యాటక కేంద్రాల వివరాలతో ప్రదర్శన ఏర్పాటు అయ్యింది. . రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, హ్యాండ్లూమ్స్ డెవలప్‌మెంట్ కమీషనర్ వంటి ఇతర సంస్థలు ఉత్పత్తులను ప్రదర్శించడానికి స్టాండ్‌లు, స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. మార్ట్ ప్రత్యేకంగా B2B మార్ట్ అయినప్పటికీ దీని ద్వారా ప్రపంచ దేశాలకు వివిధ రాష్ట్రాలకు చెందిన వెల్నెస్, అడ్వెంచర్, హెరిటేజ్, పాకశాస్త్రం, కళ, హస్త కళలు వంటి విభిన్న అంశాలను పరిచయం చేయడానికి అవకాశం కలుగుతుంది.
బ్యాంకాక్ ప్రధాన కార్యాలయంగా 1951లో పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ (PATA) ప్రారంభమయ్యింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రయాణ, పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థగా పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ గుర్తింపు పొందింది. లాభాపేక్షలేని సంఘంగా పనిచేస్తున్న పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ట్రావెల్ మార్ట్ పేరుతో పర్యాటక రంగం అభివృద్ధికి అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ప్రపంచం వివిధ ప్రాంతాలు ముఖ్యంగా పసిఫిక్ ఆసియా ప్రాంతానికి చెందిన కొనుగోలుదారులు, విక్రేతలు ట్రావెల్ మార్ట్ లో పాల్గొంటారు. వాణిజ్య పరస్పర చర్యలకు వేదికగా ట్రావెల్ మార్ట్ పనిచేస్తుంది. మార్ట్ డబ్ల్యు వివిధ రంగాలకు చెందిన ఎగ్జిబిటర్లు ,ప్రతినిధులను ఒకచోట చేర్చి నెట్‌వర్కింగ్,అనుభవం, సహకారం కోసం, ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ఒక వేదికను పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ట్రావెల్ మార్ట్ 2023 అందిస్తుంది.
***
(Release ID: 1964504)
Visitor Counter : 129