కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ల్యాంకో అమర్‌కంటక్ పవర్ లిమిటెడ్ యొక్క 100% వాటాలను పీ ఎఫ్ సీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఆర్ ఈ సీ లిమిటెడ్, ఎస్ జే వీ ఎన్ లిమిటెడ్ మరియు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కొనుగోలును సీ సీ ఐ ఆమోదించింది
Posted On:
03 OCT 2023 8:28PM by PIB Hyderabad
పీ ఎఫ్ సీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఆర్ ఈ సీ లిమిటెడ్, ఎస్ జే వీ ఎన్ లిమిటెడ్ మరియు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ల ల్యాంకో అమర్‌కంటక్ పవర్ లిమిటెడ్ యొక్క 100% వాటాల ప్రతిపాదిత కొనుగోలును కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీ సీ ఐ) ఆమోదించింది.
ప్రతిపాదిత కలయిక పీ ఎఫ్ సీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (పీ పీ ఎల్ ), ఆర్ ఈ సీ లిమిటెడ్ (ఆర్ ఈ సీ), ఎస్ జే వీ ఎన్ లిమిటెడ్ ( ఎస్ జే వీ ఎన్) మరియు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డి వీ సి ) ద్వారా ల్యాంకో అమర్‌కంటక్ పవర్ లిమిటెడ్ (ఎల్ ఏ పీ ఎల్) యొక్క 100% వాటాను కొనుగోలు చేయడానికి సంబంధించినది.
కొనుగోలుదారులు
పీ పీ ఎల్ భారత ప్రభుత్వ సంస్థ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీ ఎఫ్ సీ) యొక్క పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. విద్యుదుత్పత్తి మరియు పంపిణీ వ్యాపారాన్ని నిర్వహించేందుకు (పీ పీ ఎల్ ఏర్పాటు చేయబడింది.
ఆర్ ఈ సీ , పీ ఎఫ్ సీ యొక్క అనుబంధ సంస్థ. ఇది ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీగా వర్గీకరించబడిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ.
ఎస్ జే వీ ఎన్ అనేది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మరియు వాటాదారుల లిస్టెడ్ కంపెనీ. ప్రస్తుతం, ఎస్ జే వీ ఎన్ భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఇతర రాష్ట్రాలలో ప్రాజెక్ట్‌లను అమలు చేస్తోంది మరియు నిర్వహిస్తోంది.
డి వీ సి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ చట్టం, 1948 ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన కార్పొరేషన్. ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం మరియు జల నిర్వహణ వంటి వ్యాపారాలలో నిమగ్నమై ఉంది.
లక్ష్యం
ఎల్ ఏ పీ ఎల్ భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న లిస్టెడ్ చేయని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ.
సీ సీ ఐ యొక్క వివరణాత్మక ఆర్డర్ అనుసరించబడుతుంది.
****
(Release ID: 1963926)
Visitor Counter : 100