కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
గాంధీ జయంతి సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లోని 1.6 లక్షల పోస్టాఫీసుల్లో పాన్-ఇండియా ప్లాంటేషన్ & క్లీనింగ్ డ్రైవ్‌తో తన ప్రత్యేక స్వచ్ఛతా ఉద్యమం 3.0 ప్రారంభించిన పోస్టల్ డిపార్ట్‌మెంట్
Posted On:
03 OCT 2023 4:39PM by PIB Hyderabad
మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా మరియు ప్రత్యేక ఉద్యమం 3.0 అమలు దశను ప్రారంభించడానికి భారతదేశ పోస్టల్‌శాఖ మొత్తం నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తృతమైన మరియు ప్రత్యేకమైన ప్లాంటేషన్ డ్రైవ్ మరియు పరిశుభ్రత కార్యక్రమానికి చేతులు కలిపింది. హిమాచల్ ప్రదేశ్‌లోని హిక్కిమ్‌లో గల అత్యున్నత పోస్టాఫీసు నుండి జమ్మూ మరియు కాశ్మీర్‌లోని సుందరమైన ప్రకృతి దృశ్యాలలో బ్రాంచి కార్యాలయాల వరకు ఈ కార్యక్రమం విస్తరించింది.
డ్యూటీలో ఉన్నప్పుడు క్రాస్ బోర్డర్ షెల్లింగ్ సంఘటనలో కాలు కోల్పోయిన బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ ఈ గ్రీన్ మిషన్‌లో చురుకుగా పాల్గొన్నారు. తద్వారా అన్ని స్థాయిలలో మరియు పరిస్థితిలో ఉన్న పోస్టాఫీసు సిబ్బందిలో నిబద్ధతను హైలైట్ చేశారు. ఇండియా పోస్ట్ అనేది దేశంలోని అన్ని ప్రాంతాలలో ఉనికిని కలిగి ఉంటుంది. తద్వారా ఈ హరిత కార్యక్రమం పోస్టాఫీసు సిబ్బంది మరియు సామాజిక-పర్యావరణ అనుకూల పద్ధతులు మరియు జీవనశైలి ద్వారా ఆ పోస్టాఫీసు చుట్టు ఉన్న భౌగోళిక సమాజాలకు అవగాహన మరియు చైతన్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.
'ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్' పేరుతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన భారీ జన్ భగీదారి కార్యక్రమానికి ఈ ప్లాంటేషన్ డ్రైవ్ తోడ్పడింది. సుమారు 50,000 మంది పౌరులు భాగస్వామ్యానికి 1200 స్థానాలకు పైగా ఇండియా పోస్ట్ నాయకత్వం వహించింది. ఈ కార్యక్రమాల సందర్భంగా పౌరులు సమిష్టిగా స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. పరిశుభ్రమైన మరియు పచ్చదనంతో కూడిన భారతదేశానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. శ్రమదాన్ కార్యకలాపాలు సమాజ స్ఫూర్తిని జోడించాయి. ఈ చొరవ ఐక్యత మరియు పర్యావరణ స్పృహకు నిజమైన వేడుకగా మారింది.
పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఈ రెండు ప్రధాన సంఘటనలు ఇచ్చిన స్ఫూర్తితో అక్టోబర్ నెలలో మిగిలిన రోజుల్లో డిపార్ట్‌మెంట్ స్వచ్ఛత మరియు హరితహారం కార్యక్రమాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి వేదిక సిద్ధమైంది. ప్రత్యేక ప్రచారం 3.0 మొత్తం ప్రభుత్వంలో పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల శాఖ ఆధ్వర్యంలో అమలు చేయబడుతోంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ గత రెండు ప్రత్యేక ప్రచారాలలో ఉత్సాహభరితంగా సాగాయి. తద్వారా తమ ప్రయత్నానికి కట్టుబడి ఉంది.
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, సెహర్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్, నౌషేరా సబ్ డివిజన్, రాజౌరి డివిజన్, జమ్మూ మరియు కాశ్మీర్
కేరన్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ బారాముల్లా, జమ్మూ మరియు కాశ్మీర్
హిక్కిం పోస్టాఫీసు, హిమాచల్ ప్రదేశ్
(Release ID: 1963787)
Visitor Counter : 127