శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయమంత్రి (స్వతంత్ర) ను కలిసిన,


ప్రపంచ ప్రఖ్యాత పురాతన , న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఎడిటర్‌ ఇన్‌ ఛీఫ్‌, ప్రముఖ అమెరికన్‌ మైక్రోబయాలజీ, సాంక్రమిక వ్యాధుల ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎరిక్‌.జె.రూబిన్‌.

డాక్టర్‌ రూబిన్‌, ప్రముఖ డయాబెటాలజిస్ట్‌ డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఇరువురూ , భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించి క్షయవ్యాధి, డయాబిటిస్‌ ల విషయంలో భవిష్యత్‌ వైద్య పరిశోధనల గురించి చర్చించారు.

అంతర్జాతీయంగా ఎక్కువ మరణాలకు కారణమౌతున్న వ్యాధికి సంబంధించిన కొత్త పరిశోధన ఫలితాలు సంతోషం కలిగిస్తున్నాయి : డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

Posted On: 02 OCT 2023 4:58PM by PIB Hyderabad

పపంచ ప్రఖ్యాతి గాంచిన , ప్రాచీన పత్రిక ‘న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ’ పత్రిక ఎడిటర్‌ ఇన్‌  ఛీఫ్‌, ప్రముఖ అమెరికన్‌ మైక్రోబయాలజీ, సాంక్రమిక వ్యాధుల ప్రొషెసర్‌, డాక్టర్‌ ఎరిక్‌.జె.రూబిన్‌ ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ(స్వతంత్ర) మంత్రి,ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్‌, అణుఇంధనం, అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ను కలుసుకున్నారు. డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ స్వయంగా డయాబెటాలజిస్ట్‌ మాత్రమే కాక మెడిసిన్‌ ప్రొఫెసర్‌ కూడా.
ఈ ఇరువురు వైద్యరంగ ప్రముఖులు, వైద్య రంగ భవిష్యత్‌ పరిశోధనలపై చర్చించారు.ప్రత్యేకించి భారత ఆరోగ్య రంగానికి సంబంధించిన డయాబిటిస్‌, క్షయ వ్యాధుల విషయంలో పరిశోధనలపై వారు దృష్టిపెట్టారు. డయాబిటిస్‌ పై పరిశోధనల గురించి ప్రస్తావిస్తూ డాక్టర్‌జితేంద్ర సింగ్‌, అమెరికా, యూరోపియన్‌ దేశాలలో పలు తరాలుగా నివసిస్తూన్న భారత సంతతికి చెందిన వారు, ఇండియాలో నివసించకపోయినప్పటికీ, వారు ప్రస్తుతం ఉన్న వాతావరణం భారత వాతావరణ పరిస్థితులకు భిన్నమైనవైనప్పటికీ, వారిలో ఇప్పటికీ టైప్‌ 2 డయాబిటీస్‌మెలిటస్‌ కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తేలిందని తెలిపారు.

భారతీయులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన రిస్క్‌ అంశాల గురించి ప్రస్తావిస్తూ ఆయన, మన దేశంలో  ఊబకాయానికి సంబంధించిన ప్రొఫైల్‌ కూడా ఇతరులతో పోలిస్తే భిన్నమైనదని అన్నారు. ఉదాహరణకు
భారతదేశంలో సెంట్రల్‌ ఒబేసిటీ ఎక్కువ అని, ఇది పురుషులు, స్త్రీలలో సమానమని తెలిపారు. అదే, పశ్చిమదేశాల జనాభాలో వారుచూడడానికి ఊబకాయంతో ఉన్నప్పటికీ తక్కువ స్థాయిలో శరీర అంతర భాగాలలో కొవ్వు (విసిరల్‌ ఫాట్‌ ) కలిగి ఉంటారని అన్నారు.
అంతర్జాతీయంగా మన కాలంలో కిల్లర్‌ నెంబర్‌ 1గా తయారైన వ్యాధి నిర్ధారణ, చికిత్సకు వీలు కల్పించే ఫలితాలు రావడం సంతోషదాయకమని డాక్టర్‌జితేంద్ర అన్నారు. జపాన్‌ లోని రికెన్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రేటివ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఐఎంఎస్‌)కు చెందిన హిరోషి ఒహనో నాయకత్వంలోని పరిశోధకులు కనిపెట్టిన పరిశొధన ఫలితాల గురించి డాక్టర్‌ జితేంద్ర ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ్‌ఒక రకం గట్‌ బాక్టీరియా,ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను మెరుగుపరిచేందుకు ఉపయోగపడగలదని, ఇది ఊబకాయం నిరోధానికి, టైప్‌ 2 డయాబిటిస్‌ నియంత్రణకు ఉపయోగపడగలదని పరిశోధకులు తేల్చినట్టు తెలిపారు.
ఆగస్టు 30న ఈ అధ్యయనం ప్రచురితమైందని చెప్పారు. ఇది సైంటిఫిక్‌ జర్నల్‌ నేచర్‌లో ప్రచురితమైందని, తెలిపారు.
ప్రొఫెసర్‌ రూబిన్‌ , నేషనల్‌ ఇన్‌స్టిట్యూటÊ ఆఫ్‌ ఇమ్యునాలజీ లోడిపార్టమెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ విభాగం ఏర్పాటుచేసిన ఒక ఉపన్యాసంలో సెప్టెంబర్‌ 29న, ‘సేఫ్‌ బట్‌ నాట్‌ టూ సేఫ్‌` హ్యూమన్‌ ఛాలెంజ్‌ ఇన్‌ టి.బి ’ అనే అంశంపై మాట్లాడారు. డాక్టర్‌ ఎరిక్‌. జె.రాబిన్‌ అమెరికన్‌ మైక్రో బయాలజిస్టు. అలాగే సాంక్రమిక వ్యాధుల నిపుణుడు. ప్రస్తుతం ఆయన న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ కు ఎడిటర్‌ ఇన్‌ ఛీఫ్‌ గా ఉన్నారు. రోగనిరోధక శాస్త్రం (ఇమ్యుఆనాలజీ ), సాంక్రమిక వ్యాధుల శాస్త్రాలకు అడ్జంక్ట్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. వీరి రిసెర్చ్‌ లేబరెటరీ మైక్రో బాక్టీరియం ట్యూబర్‌కులోసిస్‌, నాన్‌ ట్యూబర్‌ కులోసిస్‌ మైకోబాక్టీరియా (ఎన్‌.టి.ఎం.ఎస్‌), వంటి అంశాలపై పరిశోధన చేస్తుంది. స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ నుంచి వీరు ఎం.డి పట్టా పొందారు. అలాగే టఫ్ట్స్‌ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ సైన్సెస్‌ నుంచి పిహెచ్‌డి చేశారు. వారి పరిశోధన ప్రధానంగా మూడు అంశాలపై దృష్టిపెడుతోంది. అవి మౌలిక సెల్‌ బయాలజీ, సెల్‌ వృద్ధి, ట్రాన్స్‌లేషన్‌. అలాగే యాంటీ బయాటిక్స్‌పై పరిశోధన లో ఇవి ఎలా పనిచేస్తున్నాయి, కొత్త వాటిని రూపొందించడం ఎలా అనే అంశాలను పరిశీలిస్తారు. ఇందుకు సంబంధించి మైకోబాక్టీరియాను అధ్యయనం చేసేందుకు ఉపకరణాలను అభివృద్ధి చేయడం వంటివి వీరి పరిశోధనల్లో ఉన్నాయి.

 

***


(Release ID: 1963723) Visitor Counter : 89


Read this release in: English , Urdu , Hindi