పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించిన కేంద్ర మంత్రి హర్దీప్ ఎస్ పురి
Posted On:
02 OCT 2023 2:27PM by PIB Hyderabad
జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం & సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి ఆయనకు నివాళులర్పించారు. గాంధీ జయంతి ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ పురి, అతని సతీమణి శ్రీమతి లక్ష్మి ఎం పురి ఖాదీ ఇండియా నుండి ఖాదీ బట్టలను కొనుగోలు చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' లో ఒక పోస్ట్ చేశారు. "భారత స్వాతంత్ర్య పోరాటానికి ఆత్మగా ప్రారంభమైన ఖాదీ, #AmritKaal ద్వారా భారతదేశం ప్రయాణిస్తున్నప్పుడు పౌరుల ఊహలను సంగ్రహించడం కొనసాగిస్తుంది" అని మంత్రి అన్నారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు మంత్రి నివాళులర్పించారు. సోషల్ మీడియా పోస్ట్‌లో.. "స్వాతంత్ర్య సమరయోధుడు & భారత మాజీ ప్రధాని, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా నేను ఆయనకు నివాళులర్పిస్తున్నాను. ఒక ఆదర్శప్రాయమైన దృఢమైన వ్యక్తి, అతని సరళమైన & కఠిన జీవితం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. " అన్నారు.
(Release ID: 1963545)
Visitor Counter : 80