కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
స్వచ్ఛతా హీ సేవా (SHS) 2023 కింద దేశవ్యాప్తంగా చేపట్టిన "ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా" ఉపక్రమణలో పాలు పంచుకున్న కార్మిక మంత్రిత్వ శాఖ
Posted On:
01 OCT 2023 5:44PM by PIB Hyderabad
జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శాల నుండి ప్రేరణతో పరిశుభ్రత, సమాజసేవ ప్రోత్సహించడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమం ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్" పిలుపు మేరకు కేంద్ర కార్మిక,ఉపాధి మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది , మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అన్ని సంస్థలకు చెందినవారు శ్రమదానం చేయడానికి తరలివచ్చారు.
న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో ‘ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’ కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమానికి కార్మిక ,ఉపాధి కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజా అధ్యక్షత వహించారు. ఈ ఉపక్రమణలో మంత్రిత్వ శాఖకు చెందిన దాదాపు 90 మంది అధికారులు,సిబ్బంది, సాధారణ పౌరులు చురుకుగా పాల్గొన్నారు.
శ్రమదానం చేయడానికి ముందు ‘స్వచ్ఛతా శపథం’ చేశారు. చెత్త రహిత భారతావని ఏర్పాటు చేయాలన్న మంత్రిత్వ శాఖ నిబద్ధతకు నిదర్శనంగా కార్మిక & ఉపాధి శాఖ అదనపు కార్యదర్శి శ్రీ రమేష్ కృష్ణమూర్తి అందరిచేత ‘స్వచ్ఛతా శపథం’ చేయించారు.
1 అక్టోబర్ 2023న జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకొని కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ, దాని అనుబంధ, సహాయక మరియు క్షేత్ర కార్యాలయాల ద్వారా ముందురోజు ఉదయం 10:00 గంటలకు దేశవ్యాప్తంగా 600కి పైగా పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమాలలో స్థానిక సమాజాలు, సాధారణ ప్రజలు గణనీయ సంఖ్యలో పాల్గొన్నారు.
కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ దాని సహాయ అనుబంధ సంస్థల ద్వారా 2023 సెప్టెంబరు 15 నుండి అక్టోబర్ 2 వరకు జరుపుతున్న 'స్వచ్ఛత హి సేవా' (SHS) పక్షంలో దాదాపు 656 కార్యకలాపాలు/కార్యక్రమాలను చేపట్టింది. వాటిలో దాదాపు 19,224 మంది పాల్గొన్నారు. శ్రమదానంలో 5042 మంది మరియు సామూహిక సమీకరణలో 7582 మంది పాల్గొని 27,829 పని గంటల పాటు సేవ చేశారు.
****
(Release ID: 1963544)
Visitor Counter : 70