రక్షణ మంత్రిత్వ శాఖ
మహవారీ మే స్వచ్ఛత పేరుతో రుతు సంబంధ ఆరోగ్యంపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించిన ఢిల్లీ కాంట్‌కు చెందిన ఆర్మీ ఆసుపత్రి (ఆర్&ఆర్)
Posted On:
01 OCT 2023 3:55PM by PIB Hyderabad
మహిళ ఆరోగ్యాన్నిప్రోత్సహించేందుకు రుతుసంబంధ పరిశుభ్రత అన్న ప్రభుత్వ చొరవకు అనుగుణంగా, రుతు సంబంధ ఆరోగ్యం - మహిళల ఆరోగ్యం దిశగా మరొక అడుగు అన్న ఇతివృత్తంతో ఢిల్లీ కాంట్‌లోని ఆర్మీ ఆసుపత్రి (ఆర్&ఆర్) మహావారీ మే స్వచ్ఛత పేరుతో రుతు సంబంధ ఆరోగ్యం పై అవగాహనా కార్యక్రమాన్ని 1 అక్టోబర్ 2023న నిర్వహించింది. ఆర్మీ ఆసుప్రతి (ఆర్&ఆర్)లో ఉపన్యాసాన్ని, ప్రదర్శనను ఏర్పాటు చేయగా, ఇందులో ఎఎఫ్ఎంఎస్ సీనియర్ అధికారులు, కౌమారంలో ఉన్న బాలికలు సహా అన్ని రంగాల, వయసులకు చెందిన మహిళలు పాల్గొన్నారు.
రుతు సంబంధ కాలానికి సంబంధించిన సామాజిక నిషేధాలు, పుక్కిటి పురాణాలు, మంచి రుతు సంబంధ పరిశుభ్రతను కలిగి ఉండటం వల్ల కలిగే వైద్య పరిణామాలు, రుతుసంబంధ సమస్యలను పరిష్కరించేందుకు సరళమైన, ప్రభావవంతమైన పద్ధతులను ఈ కార్యక్రమంలో పట్టి చూపారు. సరైన రుతు సంబంధ పారిశుద్ధ్యం లేకపోవడం అన్నది జననేంద్రియ వాహికలో ఇన్ఫెక్షన్లకు అంతిమంగా వంధ్యత్వానికి దారి తీసేందుకు కారణం కవచ్చు. రుతు సంబంధ పారిశుద్ధ్యం గురించిన సరళమైన వాస్తవాల గురించి విస్మరించడం అన్నది కౌమారంలో ఉన్న బాలికల సంపూర్ణ పెరుగుదలను ఎలా నిలిపివేయగలదు, మంచి విద్యను అభ్యసించేందుకు ఆటంకం ఎలా కాగలదు, అలాగే, ముఖ్యంగా మానసిక ప్రక్రియ అయిన రుతుసంబంధ వ్యవహారంపై సమాజం మొత్తంగా తన వైఖరిని మార్చుకోవాలన్న అంశాలపై చర్చించారు.
సమాచార, అవగాహన ప్రచారంలో భాగంగా, ఆర్మీ ఆసుపత్రిలోని ప్రసూతి, గైనకాలజీ విభాగం తయారు చేసిన అవగాహనా పత్రాలను పాలుపంచుకున్నవారికి పంచారు. రుతు సంబంధ పారిశుద్ధ్యానికి సంబంధించిన సామాజిక, వైద్య సమస్యలను పట్టి చూపే ఎడ్యుకేషన్ స్టాళ్ళను పెట్టారు. ఇందులో భాగంగా సమాజంలోని పురుషులకు అవగాహన కల్పించడం, ఈ విషయంలో సమాజ మద్దతు అవసరం గురించి వివరించారు. రుతుసంబంధ అసాధారణతలను ఎదుర్కొన్నప్పుడు మహిళలు తక్షణమే గైనకాలజిస్టును సంప్రదించవలసిన అవసరాన్ని గురించి ఆరోగ్యంపై ఉపన్యాసం పట్టి చూపింది.
శానిటరీ పాడ్లకు ప్రత్యామ్నాయంగా మెనస్ట్రువల్ కప్పులను ఉపయోగించడం గురించి ఈ కార్యక్రమంలో చర్చించడమన్నది చెప్పుకోదగిన చొరవ. మెనస్ట్రువల్ కప్ అనేది అందుబాటులో ఉండే ధరలో లభించేదే కాదు పర్యావరణ అనుకూలం, వినియోగం, నిర్వహణ అత్యంత సులువు, అని ఆర్మీ ఆసుపత్రి కమాండెంట్ లెఫ్టనెంట్ జనరల్ అజిత్ నీలకంఠన్ వివరించారు. మెనస్ట్రువల్ కప్ ను తిరిగి ఉపయోగించవచ్చని, ఉద్యోగం చేసే మహిళలు, సాయుధ దళాలలో ఉన్న మహిళలకు ఇది ఎంతో సౌకర్యవంతమైందని తెలిపారు. దీనిని వివాహిత, అవివాహిత మహిళలు అంతే సౌకర్యంతో వినియోగించవచ్చన్నారు. ఇది జీవ వ్యర్ధాల ఉత్పత్తికి దారి తీయదని, కనుక, సాధారణంగా ఉపయోగించే శానిటరీ పాడ్లతో ఉత్పత్తి అయిన టన్నుల కొద్దీ వ్యర్ధం నుంచి పర్యావరణాన్ని కాపాడవచ్చు.
***
(Release ID: 1963324)
Visitor Counter : 89