సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు అయిన ‘ ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్సాథ్’ మేరకు కేంద్ర ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ,
Posted On:
01 OCT 2023 1:56PM by PIB Hyderabad
పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా 2023 అక్టోబర్ 1 ఆదివారం నాడు న్యూడిల్లీ లోని ఓక్లా ఫేజ్ 1
డవలప్మెంట్ ఫెసిలిటేషన్ సెంటర్లో , చెత్త రహిత భారతావని ఇతివృత్తంతో శ్రమదాన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
పరిశుభ్ర భారతావనిని నిర్మించేందుకు చేపట్టిన పటిష్ట కార్యక్రమం ఇది. ఎం.ఎస్.ఎం. ఇ మంత్రిత్వశాఖ, దేశవ్యాప్తంగాగల తమ సంస్థ కార్యాలయాల
తో కలిసి మెగా స్వచ్ఛతా కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టింది.
స్వచ్ఛతా హి సేవ, శ్రమదాన్ కు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లను , జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఏర్పాటు చేశారు.
ప్రాంతాల వారీగా నోడల్ ఆఫీసర్లకు స్వచ్ఛతా కార్యక్రమాలకు సంబంధించి బాధ్యతలు అప్పచెప్పారు. పారిశుధ్యం, తోటలు శుభ్రంగా ఉంచడం,
ఇతర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రప్రభుత్వ పారిశుధ్య విభాగాలతో కలసి ఎంపిక చేసిన ప్రాంతాలలో పరిశుభ్రతా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
రోడ్లను శుభ్రపరచడం, కాలనీ పార్కులను అందంగా తీర్చిదిద్దడం. మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టడం,వంటి వాటిని ఈ సందర్భంగా చేపట్టారు.
ఎం.ఎస్.ఎం.ఇ అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎం.ఎస్.ఎం. ఇ కార్యదర్శి ఈ శ్రమదాన్ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. స్వచ్ఛతా కార్యక్రమంలో సుమారు 200 మందికిపైగా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
స్థానిక కమ్యూనిటీలనుంచి పౌరులు, ఓక్లాలో వివిధ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లలోని ఆఫీస్ బేరర్లు, ఈ కార్యక్రమంలో పాల్గొని సుమారు 25 వేల చదరపు అడుగుల ప్రాతంలో పరిశుభ్రతా కార్యక్రమాన్ని చేపట్టి, చెత్త రహిత ప్రదేశంగా తీర్చిదిద్దారు.
సమీపంలోని మెట్రో స్టేషన్, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాలలో పరిశుభ్రతా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఎం.ఎస్.ఎం.ఇ కార్యదర్శి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది, ప్రజల చేత స్వచ్ఛతా ప్రమాణం చేయించారు. తమ పొరుగున ఉన్న ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సూచించారు.
తద్వారా స్వచ్ఛత సాకారమవుతుందన్నారు.
***
(Release ID: 1963084)
Visitor Counter : 95