వ్యవసాయ మంత్రిత్వ శాఖ
‘ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’ కార్యక్రమంలో భాగంగా 300 మందికి పైగా వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సిబ్బంది ఎస్ ఎఫ్ ఏ సీ భవనంలో పరిశుభ్రత కార్యక్రమం లో పాల్గొన్నారు.
‘స్వచ్ఛతా హి సేవా ప్రచారం’లో భాగంగా ‘ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’ కార్యక్రమం కోసం పరిశుభ్రత కోసం అక్టోబర్ 1వ తేదీ ఉదయం 10 గంటలకు ఒక గంట స్వచ్ఛందంగా సేవ చేయాలని భారత పౌరులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
డీ ఏ & ఎఫ్ డబ్ల్యూ కార్యదర్శి, శ్రీ మనోజ్ అహుజా ఎస్ ఎఫ్ ఏ సీ భవనంలో పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా ఉన్న సబార్డినేట్ కార్యాలయాలు స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో పాల్గొనేందుకు సిబ్బంది మరియు ప్రజలను విజయవంతంగా నిమగ్నం చేస్తాయి.
అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం 2023 వేడుకలకు అనుగుణంగా, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా పరిశుభ్రమైన మరియు సుస్థిరమైన వాతావరణాన్ని ప్రోత్సహించడంలో మరియు భూకాలుష్యాన్ని నివారించడంలో శ్రీ అన్న యొక్క ముఖ్యమైన పాత్రను నొక్కి చెప్పింది.
Posted On:
01 OCT 2023 3:20PM by PIB Hyderabad
ఈరోజు ‘స్వచ్ఛతా హి సేవా’ ప్రచారంలో భాగంగా వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ, సబార్డినేట్ కార్యాలయాలతో పాటు “ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్” కార్యక్రమంలో పాల్గొన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ “మన్ కీ బాత్” యొక్క 105వ ఎపిసోడ్ లో ప్రత్యేకమైన కార్యాచరణకు పిలుపునిచ్చారు. ‘ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’ కార్యక్రమంలో భాగంగా 2023 అక్టోబర్ 1వ తేదీన ఉదయం 10 గంటలకు ఒక గంట పాటు స్వచ్ఛందంగా పాల్గొనాలని భారత పౌరులకు ఆయన విజ్ఞప్తి చేశారు. పాల్గొనేవారు తమ చిత్రాలను ఈ మహత్తర ప్రయత్నానికి వారి సహకారాన్ని గుర్తు చేస్తూ స్వచ్ఛతా హి సేవా పోర్టల్‌లో ఉంచవలసిందిగా కోరారు. ఈ చొరవను ఆదర్శవంతమైన “స్వచ్ఛాంజలి” లేదా బాపుకి నివాళి అని పేర్కొంటూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 'పరిశుభ్రతకు సంబంధించిన ఈ ప్రచారానికి సమయాన్ని వెచ్చించి సహాయం చేయాలి' 'వీధిలో లేదా పరిసరాల్లో లేదా పార్కులోనది, సరస్సు, లేదా ఏదైనా ఇతర బహిరంగ ప్రదేశం స్వచ్ఛందంగా సేవ చేయాలి' అని వ్యాఖ్యానించారు.
ఈ రోజు చిన్న సన్నకారు రైతుల వ్యవసాయ-వ్యాపార కన్సార్టియం (ఎస్ ఎఫ్ ఏ సీ) భవనంలో డీ ఏ & ఎఫ్ డబ్ల్యూ నిర్వహించిన ‘ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమం లో
డిపార్ట్‌మెంట్ సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు.
హౌజ్ ఖాస్‌లోని సిరి ఇనిస్టిట్యూషనల్ ఏరియాలోని ఎస్ ఎఫ్ ఏ సీ భవనంలో డీ ఏ & ఎఫ్ డబ్ల్యూ సెక్రటరీ శ్రీ మనోజ్ అహుజా పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన డిపార్ట్‌మెంట్ అధికారులతో కలిసి పేపర్ మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థ సంచులను ట్రక్కుల్లోకి ఎక్కించారు. స్వచ్ఛతా హి సేవా ప్రచారాన్ని విజయవంతం చేయడంలో పౌర భాగస్వామ్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
కారిడార్లు, యార్డ్‌లు, కిటికీలు, ఎలివేటర్లు మరియు ఇతర ప్రాంతాలను శుభ్రం చేయడానికి 300 మంది డీ ఏ & ఎఫ్ డబ్ల్యూ సిబ్బంది ఎస్ ఎఫ్ ఏ సీ భవనం వద్ద కలిశారు.
తోట ప్రాంతంలో చెత్త, కలుపు మొక్కలు మరియు పేరుకుపోయిన వ్యర్థాలను పూర్తిగా తొలగించి శుభ్రపరిచారు. తదనంతరం, డిపార్ట్‌మెంట్ అధికారులు పరిశుభ్రత, పచ్చదనం మరియు సుస్థిర పనిఆవరణం పట్ల నిబద్ధత చాటుతూ మొక్కలను కూడా నాటారు.
దేశవ్యాప్తంగా ఉన్న సబార్డినేట్ కార్యాలయాలు సిబ్బందిని మరియు ప్రజలను ఈ చొరవలో పాల్గొనేందుకు విజయవంతంగా నిమగ్నం చేశాయి. మార్కెట్ యార్డులు, ఉద్యానవనాలు, పాఠశాలలు మరియు రహదారుల వద్ద క్రియాశీల పౌరుల ప్రమేయాన్ని ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు వ్యూహాత్మకంగా ప్రణాళిక చేయబడ్డాయి.డీ ఏ & ఎఫ్ డబ్ల్యూ , పలు సబార్డినేట్ కార్యాలయాల సహకారంతో, ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించబడిన 384 కార్యక్రమాలలో మొత్తం 7,262 మంది పాల్గొన్నారు.
డీ ఏ & ఎఫ్ డబ్ల్యూ సోషల్ మీడియా హ్యాండిల్‌లో 'ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్' చొరవ కోసం సోషల్ మీడియా ప్రచారం కూడా ప్రారంభించబడింది.ఎస్ ఎఫ్ ఏ సీ భవనం లో డిపార్ట్‌మెంట్ అధికారులు శుభ్రపరిచే ఫోటో కోల్లెజ్‌లు, వీడియోలు మరియు రీల్స్‌తో రియల్ టైమ్ అప్‌డేట్‌లను సోషల్ మీడియాలో ప్రదర్శించబడ్డాయి .
స్వచ్ఛతా హి సేవా ప్రచారం (సెప్టెంబర్ 15-2 అక్టోబర్) విజయవంతం కావడానికి డీ ఏ & ఎఫ్ డబ్ల్యూ స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లేదా "శ్రమదాన్" అనే విస్తృత లక్ష్యంతో అనేక కార్యకలాపాలను చేపట్టింది. ఇందులో శాఖాపరమైన సౌకర్యాలు, వాహనాలు, ప్రవేశాలు, కారిడార్లు, లాబీలు మరియు క్యాంటీన్లు మొదలైనవి పూర్తిగా శుభ్రపరచడం జరిగింది. డిపార్ట్‌మెంట్ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్‌లో వీటిని ఉంచారు.
శ్రీ మనోజ్ అహూజా నేతృత్వంలో కృషి భవన్ ప్రాంగణంలో ఎప్పటికప్పుడు పరిశుభ్రత సమీక్షలు డిపార్ట్‌మెంట్ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతున్నాయి. డిపార్ట్‌మెంట్ అధికారులు వారి స్వంత వర్క్‌స్టేషన్‌లను శుభ్రం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, అంతేకాకుండా, సాధారణ పరిపాలన విభాగం కూడా కాగితం వినియోగాన్ని తగ్గించడానికి భౌతిక ఫైళ్లను స్కాన్ చేయడం వంటి వ్యర్థాలను తగ్గించే చర్యలను సులభతరం చేసింది.
అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం 2023 వేడుకలకు అనుగుణంగా, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా ఎస్ హెచ్ ఎస్ కోసం వారి నిరంతర సోషల్ మీడియా ప్రచారం ద్వారా పరిశుభ్రత మరియు సుస్థిరమైన వాతావరణాన్ని ప్రోత్సహించడంలో మరియు భూకాలుష్యాన్ని నివారించడంలో మిల్లెట్స్ లేదా శ్రీ అన్న యొక్క ముఖ్యమైన పాత్రను నొక్కి చెప్పింది.
అక్టోబరు 2వ తేదీన ఉద్యోగుల పిల్లలకు నిర్వహించే పెయింటింగ్ పోటీలు, సిబ్బంది నేతృత్వంలో ర్యాలీతో ఎస్‌హెచ్‌ఎస్ ప్రచార సంబరాలు కొనసాగుతాయి. స్వచ్ఛత సందేశం వివిధ తరాలకు వ్యాపించేలా ఇది ఉపకరిస్తుంది.
***
(Release ID: 1963041)
Visitor Counter : 89