కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

“భవనాలు లేదా ప్రాంతాలలో డిజిటల్ కనెక్టివిటీ (సంధాయకత) కోసం రేటింగ్ ఫ్రేమ్‌వర్క్‌ నియంత్రణ”పై సంప్రదింపులు/సమాలోచన పత్రాన్ని విడుదల చేసిన ట్రాయ్

Posted On: 27 SEP 2023 8:15PM by PIB Hyderabad

       “భవనాలు లేదా ప్రాంతాలలో డిజిటల్ కనెక్టివిటీ (సంధాయకత) కోసం రేటింగ్ ఫ్రేమ్‌వర్క్‌ నియంత్రణ”పై సంప్రదింపులు/
  సమాలోచన పత్రాన్ని ట్రాయ్ (భారత టెలికాం నియంత్రణ సాధికార సంస్థ)  విడుదల చేసింది

   ఇప్పుడు వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు సామాజిక జీవితంలో డిజిటల్ కనెక్టివిటీ అంతర్భాగంగా మారింది.  సేవలు, ఉత్పాదక రంగాల డిజిటలైజేషన్‌లో జరిగిన విశేషమైన వృద్ధి ఆర్థిక వ్యవస్థ, వినూత్నత, విజ్ఞాన శాస్త్రం, విద్య నుంచి ఆరోగ్యం, నిరంతరత, పాలన మరియు జీవనశైలి వరకు ప్రతిదానిపై ప్రభావం చూపుతూ ప్రపంచ గమనాన్ని విప్లవాత్మకంగా మార్చింది.  ఇటీవలి సంవత్సరాలలో డిజిటల్ సంధాయకతకు డిమాండ్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది.  కరోనా మహమ్మారి కాలంలో  డిజిటల్ కనెక్టివిటీకి గల  కీలకపాత్ర గుర్తింపు పొందింది. ప్రదేశంతో సంబంధం లేకుండా వినియోగ క్షేత్రంలోని అన్ని రంగాలలో  డిమాండ్ పెరుగుదల కనిపించింది.

      దేశవ్యాప్తంగా టెలికాం సేవల నాణ్యతను పర్యవేక్షిస్తూ, సేవల నాణ్యతను మెరుగుపరచడం కోసం భారత టెలికాం నియంత్రణ సాధికార సంస్థ  (TRAI) వివరణాత్మక అధ్యయనాలు నిర్వహించడంతో పాటు సంబంధితులందరికీ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నది.
క్షేత్ర స్థాయిలో చూసినప్పుడు టెలికాం సేవల వ్యాప్తిలో గణనీయమైన మెరుగుదల ఉన్నప్పటికీ, సేవల కోసం వినియోగదారులు చేస్తున్న  డిమాండ్లు తీర్చడంలో  ప్రత్యేకించి భవనాలు/ నివాస లేదా వాణిజ్య ప్రాంతాలలో ఇప్పటికీ లోపాలు  ఉన్నట్లు గుర్తిందారు.

       వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ భవనాల లోపల టెలికమ్యూనికేషన్ సేవల నాణ్యత కాపాడటంలో  అంతర్భాగం.  "డిజిటల్ కనెక్టివిటీ కోసం భవనాలు లేదా ప్రాంతాల రేటింగ్"పై ట్రాయ్ ఇప్పటికే  2023 ఫిబ్రవరి 20న చేసిన  సిఫార్సుతో సహా పలు విధాన కార్యక్రమాలను చేపట్టింది.  ఈ సిఫార్సులు సహకార మరియు స్వీయ- నిర్వహణీయ  విధానం ద్వారా వినియోగదారులకు మంచి డిజిటల్ కనెక్టివిటీ అనుభవాన్ని అందించడానికి భవనాల రేటింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను పరిచయం చేయడానికి తోడ్పడుతాయి.

          రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి సంబంధించి "... భవనాల రేటింగ్ కోసం TRAI తగిన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌తో పురోగమిస్తుంది ." అని  ట్రాయ్  తన పరిశీలనలు మరియు విశ్లేషణలలో పేర్కొంది.

     భవనాలు లేదా ప్రాంతాలలో డిజిటల్ కనెక్టివిటీ కోసం రేటింగ్ ఫ్రేమ్‌వర్క్‌ నియంత్రణపై సంప్రదింపుల పత్రం భవనాలు మరియు భవనాల లోపల QoSని మెరుగుపరచడానికి మరియు వినియోగదారులకు అంతరాయం లేని డిజిటల్ కనెక్టివిటీని అనుభవంలోకి తేవడం  కోసం ప్రాంతాలకు రేటింగ్ ఫ్రేమ్‌వర్క్ అమలు కోసం ఉద్దేశపూర్వకంగా విడుదల చేయడం జరిగింది.

    డిజిటల్ కనెక్టివిటీ కోసం భవనాలు లేదా ప్రాంతాలకు  రేటింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకతను పత్రం నొక్కి చెప్తుంది.  ఇది వినియోగదారుల ప్రస్తుత అంచనాలను మాత్రమే కాకుండా భవిష్యత్ విస్తరణ లేదా సాంకేతికతల అభివృద్ధి లేదా వినియోగదారుల డిమాండ్‌లో మార్పులకు అనుగుణంగా  స్థాయి పెంపునకు సంసిద్ధంగా ఉంది.  తుది వినియోగదారులకు, సేవా ప్రదాతలకు మరియు పర్యావరణ వ్యవస్థకు రేటింగ్ ఫ్రేమ్‌వర్క్ యొక్క ప్రయోజనాలను కూడా  ఈ సంప్రదింపుల పత్రం చర్చిస్తుంది.

      అంతర్జాతీయంగా అనుసరిస్తున్న పద్ధతులు మరియు భారతదేశంలో GRIHA లేదా క్రెడిట్ రేటింగ్ వంటి ప్రమాణాలు నిర్ణయించే సంస్థలు  అనుసరిస్తున్న పద్ధతుల ఆధారంగా 'డిజిటల్ కనెక్టివిటీ కోసం రేటింగ్ ఫ్రేమ్‌వర్క్'  స్థూలదృష్టిని సంప్రదింపుల పత్రం  వివరిస్తుంది.

      డిజిటల్ కనెక్టివిటీ కోసం రేటింగ్ ఫ్రేమ్‌వర్క్ అమలు కోసం పై విశ్లేషణ ఆధారంగా సంప్రదింపుల పత్రం ముసాయిదా రెగ్యులేషన్‌ను సమకూరుస్తుంది.

       "భవనాలు లేదా ప్రాంతాలలో డిజిటల్ కనెక్టివిటీ కోసం రేటింగ్ ఫ్రేమ్‌వర్క్‌పై నియంత్రణ"పై కన్సల్టేషన్ పేపర్, ముసాయిదా నిబంధనలతో పాటు TRAI తమ వెబ్‌సైట్ www.trai.gov.in ద్వారా భాగస్వామ్యపక్షాలు, టెలికాం వినియోగదారుల అభిప్రాయాలు/సూచనలు  కోరింది. సంప్రదింపుల  పత్రంలో లేవనెత్తిన సమస్యలపై వ్రాతపూర్వక వ్యాఖ్యలు 10 నవంబర్ 2023లోపు సంబంధితులందరి నుండి ఆహ్వానించడం జరుగుతుంది. మరియు ఏవైనా ప్రతివ్యాఖ్యలు ఉంటేనవంబర్ 24, 2023 లోపు పంపవచ్చు.

      ఎలక్ట్రానిక్ రూపంలో వ్యాఖ్యలు మరియు ప్రతి వ్యాఖ్యలు,  టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సలహాదారు (QoS-I)
కు పంపవచ్చు: adv-qos1@trai.gov.in. ఏదైనా వివరణ/సమాచారం కోసం, శ్రీ తేజ్‌పాల్ సింగ్, సలహాదారు (QoS-I)ని టెలిఫోన్‌లో సంప్రదించవచ్చు. సంప్రదించవలసిన నెంబరు  +91-11-2323-6516.

 

***


(Release ID: 1962550) Visitor Counter : 99


Read this release in: English , Urdu , Hindi