కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

“అసైన్‌మెంట్‌ ఆఫ్‌ స్పెక్ట్రమ్ ఇన్‌ ఇ & వి బ్యాండ్స్‌, అండ్‌ స్పెక్ట్రమ్ ఫర్‌ మైక్రోవేవ్ యాక్సెస్ (ఎండబ్ల్యూఏ) & మైక్రోవేవ్ బ్యాక్‌బోన్ (ఎండబ్ల్యూబీ)"పై సంప్రదింపుల పత్రం విడుదల చేసిన ట్రాయ్‌

Posted On: 27 SEP 2023 7:41PM by PIB Hyderabad

'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (ట్రాయ్‌), “అసైన్‌మెంట్‌ ఆఫ్‌ స్పెక్ట్రమ్ ఇన్‌ ఇ & వి బ్యాండ్స్‌, అండ్‌ స్పెక్ట్రమ్ ఫర్‌ మైక్రోవేవ్ యాక్సెస్ (ఎండబ్ల్యూఏ) & మైక్రోవేవ్ బ్యాక్‌బోన్ (ఎండబ్ల్యూబీ)"పై సంప్రదింపుల పత్రాన్ని ఈ రోజు విడుదల చేసింది.

టెలీకమ్యూనికేషన్స్ విభాగం (డాట్‌), 12.08.2022న ట్రాయ్‌కి ఒక లేఖ పంపింది. ట్రాయ్‌ చట్టం, 2000 ద్వారా సవరించిన ట్రాయ్‌ చట్టం 1997లోని 11(1)(a) నిబంధనల ప్రకారం సిఫార్సులు అందించాలని ఆ లేఖలో ట్రాయ్‌కి సూచించింది:

  1. భౌగోళిక లేదా ఉపగ్రహ ఆధారిత టెలికాం నెట్‌వర్కుల ఏర్పాటు కోసం ఇ బ్యాండ్ స్పెక్ట్రమ్ వేలం కోసం వర్తించే రిజర్వ్ ధర, బ్యాండ్ ప్రణాళిక, బ్లాక్ పరిమాణం, స్పెక్ట్రమ్ పరిమాణం, కేటాయింపు వ్యవధి, సేవలు/వినియోగాల పరిధి, స్పెక్ట్రమ్ విలువ, చెల్లింపు నిబంధనలు, అర్హత స్థితి, వేలం వేసే పద్ధతి, ఇతర అనుబంధ పరిస్థితులు
  2. భౌగోళిక లేదా ఉపగ్రహ ఆధారిత టెలికాం నెట్‌వర్కుల ఏర్పాటు కోసం వి బ్యాండ్ స్పెక్ట్రమ్ వేలం కోసం వర్తించే రిజర్వ్ ధర, బ్యాండ్ ప్రణాళిక, బ్లాక్ పరిమాణం, స్పెక్ట్రమ్ పరిమాణం, అసైన్‌మెంట్ వ్యవధి, సేవలు/వినియోగాల పరిధి, స్పెక్ట్రమ్ విలువ, చెల్లింపు నిబంధనలు, అర్హత స్థితి, వేలం వేసే పద్ధతి, ఇతర అనుబంధ పరిస్థితులు
  3. ఇ &వి బ్యాండ్లలో వాణిజ్యేతర/సొంత/పరిమిత పరిధి వినియోగం కోసం కేటాయించాల్సిన స్పెక్ట్రమ్ పరిమాణం; వేలం సాధ్యపడని చోట కేటాయింపు పద్ధతి, ధర నిర్ణయం
  4. పాక్షికంగా లేదా పూర్తి వి-బ్యాండ్‌లో భౌగోళిక లేదా ఉపగ్రహ ఆధారిత టెలికాం నెట్‌వర్కు ఏర్పాటు కోసం సాంకేతిక ప్రమాణాలు సహా, టెలికాం సేవల ప్రదాతల ద్వారా వేలం-పొందిన స్పెక్ట్రమ్ వినియోగానికి సమాంతరంగా అనుమతి మినహాయింపు ప్రాతిపదికన తక్కువ శక్తి, అంతర్గత, 'వినియోగదారు పరికరం నుంచి వినియోగదారు పరికరం' వినియోగాన్ని అనుమతించే సాధ్యత
  5. భౌగోళిక లేదా ఉపగ్రహ ఆధారిత టెలికాం నెట్‌వర్కుల స్థాపన కోసం, అలాగే వాణిజ్యేతర/సొంత/పరిమిత పరిధి వినియోగం కోసం 6/ 7/ 13/ 15/ 18/ 21 గిగాహెడ్జ్‌ బ్యాండ్లలో ఎండబ్ల్యూఏ, ఎండబ్ల్యూబీ ఆర్‌ఎఫ్‌ క్యారియర్ల కేటాయింపు పద్ధతి, పరిమాణం, ధరలపై తాజా సిఫార్సు;
  6. తాజా ఐటీయూ-ఆర్‌ రేడియో నిబంధనల్లోని సంబంధిత నిబంధనల్లో పేర్కొన్న నియంత్రణ/సాంకేతికత అవసరాలు సహా ఈ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో (ఎ) నుంచి (ఇ) వరకు పేర్కొన్న విధంగా అవసరమైన ఇతర సిఫార్సులు అందించండి.

“అసైన్‌మెంట్‌ ఆఫ్‌ స్పెక్ట్రమ్ ఇన్‌ ఇ & వి బ్యాండ్స్‌, అండ్‌ స్పెక్ట్రమ్ ఫర్‌ మైక్రోవేవ్ యాక్సెస్ (ఎండబ్ల్యూఏ) & మైక్రోవేవ్ బ్యాక్‌బోన్ (ఎండబ్ల్యూబీ)"పై సంప్రదింపుల పత్రాన్ని తన వెబ్‌సైట్‌లో (www.trai.gov.in) ఉంచిన ట్రాయ్‌,
దీనికి సంబంధించి వాటాదార్ల నుంచి అభిప్రాయాలు కోరింది. ఈ సంప్రదింపు పత్రంలో, వాటాదార్ల నుంచి అభిప్రాయాలు/సూచనల కోసం నిర్దిష్ట అంశాలను పేర్కొన్నారు. సంప్రదింపు పత్రంలో పేర్కొన్న అంశాలపై రాతపూర్వక వ్యాఖ్యలను 25 అక్టోబర్ 2023 లోపు, ప్రతివ్యాఖ్యలను 8 నవంబర్ 2023 నాటికి పంపాలి.

వ్యాఖ్యలు/ప్రతివ్యాఖ్యలను ఎలక్ట్రానిక్ రూపంలో advmn@trai.gov.in ఈ-మెయిల్ ఐడీకి పంపవచ్చు. మరింత స్పష్టత/సమాచారం కోసం శ్రీ అఖిలేష్ కుమార్ త్రివేది, సలహాదారు (నెట్‌వర్కులు, స్పెక్ట్రమ్ & లైసెన్సింగ్), ట్రాయ్‌ని +91-11-23210481 టెలిఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు.

 

***



(Release ID: 1961684) Visitor Counter : 86


Read this release in: English , Urdu , Hindi