సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

వార్షిక నివేదిక 2020-21 & 2021-22ను రాష్ట్రపతికి సమర్పించిన షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్

Posted On: 26 SEP 2023 8:54PM by PIB Hyderabad

రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 కింద షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్‌కు ఇచ్చిన ఆదేశం ప్రకారం, షెడ్యూల్డ్ కులాల రాజ్యాంగపరమైన భద్రతలపై నివేదికను ప్రతి సంవత్సరం, ఇతర సమయాల్లో రాష్ట్రపతికి సమర్పించడం కమిషన్ విధి.
షెడ్యూల్డ్ కులాల ప్రజల రక్షణ, సంక్షేమం, సామాజిక-ఆర్థిక అభివృద్ధి కోసం అవసరమైన చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలకు సంబంధించిన సిఫార్సులు కూడా ఆ నివేదికల్లో ఉండవచ్చు.

A group of people holding certificatesDescription automatically generated

షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ అధ్యక్షుడు శ్రీ అరుణ్ హల్దార్, ఉపాధ్యక్షుడు శ్రీ సుభాష్ రామ్‌నాథ్ పార్ధి, సభ్యురాలు డా.అంజు బాల కలిసి కమిషన్‌ వార్షిక నివేదిక 2020-21 & 2021-22ను రాష్ట్రపతికి సమర్పించారు. 26.09.2023న రాష్ట్రపతి భవన్‌లో నివేదికను సమర్పించారు. షెడ్యూల్డ్‌ కులాల ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించిన భద్రతలకు సంబంధించి కమిషన్‌కు అప్పగించిన అంశాలపై వివిధ సిఫార్సులు ఈ నివేదికల్లో ఉన్నాయి.

***



(Release ID: 1961157) Visitor Counter : 152


Read this release in: English , Urdu , Hindi , Hindi