ఆయుష్
ప్రపంచవ్యాప్తంగా భారత సంప్రదాయ వైద్య విధానానికి గుర్తింపు
ఆయుర్వేద వైద్య విధానం ప్రయోజనాలను స్వయంగా పరిశీలించడానికి ఏఐఐఏ ను సందర్శించిన ఆఫ్రికా దేశాల రాయబారులు, హై కమీషనర్లు
సంప్రదాయ వైద్య విధానాలను ప్రధాన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో చేర్చి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవచ్చు.. శ్రీ సర్బానంద సోనోవాల్
ఆయుర్వేద వైద్య విధానం ద్వారా ఏఐఐఏ అందిస్తున్న సంపూర్ణ వైద్య సేవలను పరిశీలించిన ఆఫ్రికా బృందం :
Posted On:
26 SEP 2023 4:29PM by PIB Hyderabad
భారతదేశం అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో జీ-20 సభ్యత్వం పొందిన ఆఫ్రికా దేశాలు భారత సంప్రదాయ వైద్య విధానాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడానికి భారతదేశం అమలు చేస్తున్న సంప్రదాయ వైద్య విధానాలు ఏ మేరకు ప్రభావం చూపిస్తున్నాయి అన్న అంశాన్ని అధ్యయనం చేయడానికి ఆఫ్రికా దేశాలు అధ్యయనం చేస్తున్నాయి. అధ్యయనంలో భాగంగా తూర్పు, దక్షిణ ఆఫ్రికా దేశాల హై కమీషనర్లు, రాయబారులు మంగళవారం న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) ని సందర్శించారు. 15 మంది సభ్యులతో కూడిన ఆఫ్రికా ప్రతినిధి బృందం ఆయుర్వేద వైద్య విధానం ద్వారా ఏఐఐఏ అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించింది. ఆఫ్రికా ప్రతినిధి బృందానికి ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్,జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ వీడియో సందేశం ద్వారా స్వాగతం పలికారు. ఆఫ్రికా దేశాల్లో ప్రజలందరికి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భారత సంప్రదాయ వైద్య విధానాలు సహకరిస్తాయని అన్నారు.
భారతదేశంలో ఆయుర్వేదం ఇతర సంప్రదాయ వైద్య విధానాల ప్రాముఖ్యతను ప్రతినిధి బృందానికి మంత్రి వివరించారు. , "ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అవసరాలు తీర్చడంలో సంప్రదాయ వైద్యం ఎల్లప్పుడూ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సంప్రదాయ వైద్య విధానం సామర్థ్యాన్ని గుర్తించింది. . ప్రధాన ఆరోగ్య వైద్య రంగంలో సంప్రదాయ వైద్య విధానాలు అమలు చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలకు ఆరోగ్య సేవలు పూర్తిగా అందుబాటులోకి తీసుకు రావడానికి అవకాశం కలుగుతుంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రీకృత, సంపూర్ణ విధానాలు అమలు చేయడానికి వీలవుతుంది " అని శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు.
ఏఐఐఏ ఆసుపత్రి, ఓపిడి మొదలైన వాటిని సందర్శించిన ఆఫ్రికా ప్రతినిధి బృందం సభ్యులు ఆయుర్వేదం ద్వారా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, సహాయక చికిత్స మొదలైన వాటిలో సాధించిన పురోగతి అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు.
సంప్రదాయ ఆయుర్వేదం,ఆధునిక వైద్య విధానాల మధ్య సమన్వయం సాధించడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అపెక్స్ ఇన్‌స్టిట్యూట్‌గా ఏర్పాటు చేసింది. దేశంలో A++ NAAC గుర్తింపు పొందిన మొట్టమొదటి ఆయుర్వేద సంస్థగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గుర్తింపు పొందింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అందిస్తున్న సేవలు ఎన్ఏబిహెచ్ గుర్తింపు పొందాయి. ఓపిడి,30 సాధారణ ఓపిడి,క్యాన్సర్ లాంటి వ్యాధులకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో చికిత్స అందిస్తున్నారు.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అందిస్తున్న సేవలు, సంస్థలో కల్పించిన సౌకర్యాల వివరాలను ఆఫ్రికా ప్రతినిధుల బృందం తెలుసుకుంది.సౌకర్యాలు, సేవల పట్ల ప్రతినిధి బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థ అందిస్తున్న సేవలను ప్రతినిధి బృందానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డైరెక్టర్ డాక్టర్ తనూజా నేసరి వివరించారు. " ఆయుర్వేదాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు రావడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కృషి చేస్తోంది. దీని కోసం సంస్థ పరిశోధనలు చేపట్టడానికి 50 కి పైగా సంస్థలు/ప్రఖ్యాత సంస్థలు/విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన 17 సంస్థలు ఉన్నాయి.:' అని ఆయన వివరించారు.
ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశం తర్వాత ఆఫ్రికా దేశాల ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం ఇక్కడ గమనార్హం. "వసుధైక కుటుంబం" స్ఫూర్తితో భారతదేశం జీ-20 అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదేపదే చెబుతున్న "ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు" విధానాలకు అనుగుణంగా జీ-20 సమావేశాలు జరిగాయి. యుగయుగాల నుంచి భారతదేశం ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తోంది. భారతీయ సంప్రదాయ వైద్య వ్యవస్థల ప్రాముఖ్యతను జీ-20 గుర్తించడమే కాకుండా, ఆరోగ్య రంగంలో సాక్ష్యం-ఆధారిత సంప్రదాయ వైద్యం పాత్రను కూడా గుర్తించాయి. . అంతకుముందు, సంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆగస్టు 17-18 తేదీలలోనిర్వహించింది. జీ-20 దేశాల ఆరోగ్య మంత్రుల సమావేశం కూడా సంప్రదాయ వైద్య విధానం ప్రాధాన్యత గుర్తించింది. దీనికి కొనసాగింపుగా ఆఫ్రికా ప్రతినిధి బృందం ఏఐఐఏ ను సందర్శించింది.
ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో బురుండి రాయబారి జనరల్ అలోయ్స్ బిజిడవి, . ఇథియోపియా రాయబారి డెమెకే అట్నాఫు అంబులో, జింబాబ్వే రాయబారి డాక్టర్ గాడ్‌ఫ్రే మజోని చిపారే, లెసోతో శ్రీమతి తబాంగ్ లైనస్ ఖో లుమో సిడిఎ, హెచ్.ఇ. మిస్టర్ లియోనార్డ్ మెంగేజీ, మలావి హై కమీషనర్, గాబ్రియేల్ సినింబో, నమీబియా హై కమిషనర్ శ్రీమతి జాక్వెలిన్ ముకంగిరా, రువాండా హై కమిషనర్ సిబుసిసో న్డెబెలే, దక్షిణాఫ్రికా హై కకమిషనర్ ప్రొఫెసర్ శ్రీమతి జాయ్స్ కకురమట్సీ కికాసుంఫుండా, ఉగాండా హై కమిషనర్ శ్రీమతి డెలివే ముంబి, జాంబియా యాక్టింగ్ హై కమిషనర్ సభ్యులుగా ఉన్నారు.
***
(Release ID: 1961093)
Visitor Counter : 121