రక్షణ మంత్రిత్వ శాఖ
ఖమ్రీ మో సిక్కిం కార్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన భారత నౌకాదళం.
Posted On:
25 SEP 2023 3:10PM by PIB Hyderabad
దేశంలోని మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న జాతీయ నాయకత్వ దార్శనికతకు కొనసాగింపుగా భారత నౌకాదళం, దేశంలోని ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు బహుముఖ ఔట్‌రీచ్‌కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇందుకు సంబంధించి మోటార్ కార్ ర్యాలీ, ఖమ్రీ మ సిక్కిం( హలో సిక్కిం) పేరుతో ర్యాలీని, మహారాష్ట్రలోని లోనా వాలా వద్ద గల ఐఎన్‌ఎస్ శివాజీ నుంచి సిక్కిం వరకు నిర్వహిస్తున్నారు. 6500 కిలోమీటర్లు సాగే ఈ ర్యాలీ 2023 సెప్టెంబర్ 24 నుంచి, 2023 అక్టోబర్ 15 వరకు నిర్వహిస్తారు. మార్గ మధ్యంలో ఇది పలు రాష్ట్రాల గుండా పోతుంది.
ఈ ర్యాలీ బృందంలో నౌకాదళానికి చెందిన వారు ఉన్నారు. వీరిలో మహిళా అధికారులు, ఎన్.డబ్ల్యు.డబ్ల్యు.ఎ సభ్యులు ఉన్నారు. నారీ శక్తికి ఇది నిదర్శనం. ఈ ఈవెంట్ సిక్కిం యువత డిఫెన్స్ సర్వీసులలో చేరేలా ప్రోత్సహించడానికి ఉపకరిస్తుంది. అలాగే ఈ ప్రాంతంలో సముద్ర రవాణా కు సంబంధించిన అవగాహన కల్పిస్తుంది. ఇది జాతి నిర్మాణానికి ఉపకరిస్తుంది.
ఈ కార్ ర్యాలీని లోనవాలా నుంచి సిఎండిఇ. మొహిత్ గోయల్, ఎన్.ఎం. కమాండిరగ్ ఆఫీసర్, ఐఎన్ ఎస్ శివాజీ 2023 సెప్టెంబర్ 24న ప్రారంభించారు. ఈ ర్యాలీ మూడు దశలలో సాగుతుంది. తొలిదశలోమహో, రaాన్సీ, లక్నో,వారణాశి. బగడోగ్రా లలో ఆగుతుంది. రెండో దశలో గ్యాంగ్ టక్ నుంచి నేరుగా సిక్కింలోకి వెళుతుంది. మూడోదశలో కోల్‌కతా,భువనేశ్వర్, విశాఖపట్నం, హైదరాబాద్,పూణేలమీదుగా ప్రయాణిస్తుంది. ఈ కార్ ర్యాలీ సందర్భంగా , ఈ ర్యాలీలో పాల్గొంటున్నవారు ఆయా ప్రాంతాలలో వివిధపాఠశాలల విద్యార్థులు,ప్రముఖులతో మాట్లాడతారు. అలాగే ఔట్ రీచ్ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ర్యాలీ 22 రోజులు సాగుతుంది. ఈ కార్యక్రమంలో మెస్సర్స్ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ భాగస్వామిగా ఉంటుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఇంధన పార్టనర్) గా ఉంటుంది.
***
(Release ID: 1960763)
Visitor Counter : 114