పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

దేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సు ప్రారంభం


జెండా ఊపి న్యూ ఢిల్లీలోని కర్తవ్య పాత్ నుంచి 1వ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి హర్దీప్ ఎస్ పూరి

హైడ్రోజన్‌తో క్లీన్, గ్రీన్ ఎనర్జీ రంగంలో విప్లవం సృష్టించనున్న భారతదేశం... శ్రీ హర్దీప్ సింగ్ పూరి

త్వరలో హైడ్రోజన్ ఉత్పత్తి ఎగుమతి కేంద్రంగా భారతదేశంమారుతుంది... : శ్రీ హర్దీప్ సింగ్ పూరి

Posted On: 25 SEP 2023 4:35PM by PIB Hyderabad

న్యూ ఢిల్లీలోని కర్తవ్య పాత్ నుంచి 1వ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సును జెండా ఊపి  కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెట్రోలియం,  సహజ వాయువు, కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి, పెట్రోలియం,  సహజ వాయువు, కార్మిక మరియు ఉపాధి శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ జైన్,  ఇండియన్ ఆయిల్ చైర్మన్ శ్రీ ఎస్.ఎం.  వైద్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రసంగించిన శ్రీ పూరి  గ్రీన్‌ హైడ్రోజన్‌ హరిత వృద్ధికి తోడ్పడడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు అందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా హైడ్రోజన్ అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు.  స్వచ్ఛ ఇంధన పరివర్తన దిశగా ప్రపంచానికి భారతదేశం  ఒక ఉదాహరణగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్న అంశాన్ని శ్రీ పూరి ప్రస్తావించారు.  “ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాకారాల నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, గ్రీన్ హైడ్రోజన్‌ వినియోగాన్ని పోర్త్సహించడం ద్వారా భారతదేశం  ఇంధన ఉత్పత్తిలో స్వావలంబన సాధిస్తుంది" అంటూ  ప్రధాని ప్రకటించారు” అని శ్రీ పూరి తెలిపారు. .

 హైడ్రోజన్ వినియోగం, భవిష్యత్తులో ఇంధనంగా ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను శ్రీ పూరి  వివరించారు, “హైడ్రోజన్, గాలి ఉపయోగించి ఇంధన సెల్   బస్సు నడవడానికి అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.  బస్సు నుంచి వెలువడే  ఏకైక ఉప ఉత్పత్తి నీరు. దీనివల్ల  డీజిల్,పెట్రోల్‌తో నడిచే సాంప్రదాయ బస్సులతో పోలిస్తే హైడ్రోజన్ బస్సు  అత్యంత పర్యావరణ అనుకూలమైన రవాణా విధానంగా ఉంటుంది. మూడు రెట్లు ఎక్కువ  శక్తి సాంద్రత కలిగే హైడ్రోజన్ బస్సు నుంచి  హానికరమైన ఉద్గారాలు వెలువడవు. ఇంధన  అవసరాలను తీర్చడానికి హైడ్రోజన్ ఒక  సమర్థవంతమైన ఎంపికగాఉంటుంది.  హైడ్రోజన్ తో నడిచే బస్సులు పూర్తిగా ఛార్జ్ కావడానికి కొన్ని నిమిషాలు పడుతుంది" అని  శ్రీ పూరివివరించారు. 

క్లీన్,గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రభుత్వం అమలు చేయనున్నప్రతిష్టాత్మక ప్రణాళికల వివరాలను శ్రీ హర్దీప్ సింగ్ పూరి వివరించారు. , హైడ్రోజన్, బయో-ఇంధనాల వంటి ఉద్భవిస్తున్న ఇంధనాలు రాబోయే రెండు దశాబ్దాలలో ప్రపంచ పెరుగుతున్న ఇంధన అవసరాల్లో  25% అవసరాలు తీరుస్తాయని  చెప్పారు. "అనుసంధానించిన గ్రిడ్లలో అతి పెద్ద గ్రిడ్ భారతదేశంలో ఉంది. 'వన్ నేషన్-వన్ గ్రిడ్-వన్ ఫ్రీక్వెన్సీ' భారతదేశంలో అందుబాటులో ఉంది.  హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతులలో త్వరలో భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటుంది. ప్రపంచ  గ్రీన్ హైడ్రోజన్‌ కేంద్రంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది" అని శ్రీ పూరి పేర్కొన్నారు. 

భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడానికి  పరిశ్రమ, ప్రభుత్వం కృషి చేస్తున్నాయని శ్రీ పూరి తెలిపారు. పరిశుద్ధ ఇంధన సాంకేతిక రంగంలో భారతదేశం ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఇంధన రంగంలో   త్వరలో  స్వావలంబన సాధించే దిశగా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు.  “ప్రపంచంలోని మొట్టమొదటి BS 6 (స్టేజ్ II) ఎలక్ట్రిఫైడ్‌ను ప్రారంభించడంలో భారతదేశం ముందు ఉంది. . ప్రోటోటైప్, ఇది ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ రెండింటినీ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ కలిగి ఉంటుంది.  ఇథనాల్ తో కలిపిన ఇంధనాన్ని ఉపయోగించే ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్  మెరుగైన ఇంధన సామర్థ్యాలతోఅధిక వినియోగాన్ని అందిస్తుంది. ఇప్పుడు మొదటి రెండు హైడ్రోజన్ సెల్ బస్సులను ప్రారంభించి ఈ దిశలో భారతదేశం  ప్రయత్నాలు ముమ్మరం చేసింది..  ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీ ఎన్‌సిఆర్ రోడ్లపై మరో 15 బస్సులు తిరుగుతాయని ఆశిస్తున్నాము” అని  మంత్రి తెలిపారు.

దేశంలోని నగర రవాణా వ్యవస్థలో  గ్రీన్ హైడ్రోజన్ తో నడిచే  బస్సులు ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపిన శ్రీ పూరి , దేశంలో ఇంధన సెల్ , హైడ్రోజన్ మౌలిక సదుపాయాలకు సంబంధించిన స్వదేశీ పరిష్కారాల అభివృద్ధి కోసం టాటా మోటార్స్‌తో కలిసి కార్యక్రమాలు అమలు చేస్తున్న ఇండియన్ ఆయిల్‌ని   శ్రీ హర్దీప్ సింగ్ పూరి  అభినందించారు. "ఈ ప్రాజెక్టు  విజయం అయితే భారతదేశం  శిలాజ ఇంధన వనరులను దిగుమతి చేసుకుంటున్న దేశంగా కాకుండా  స్వచ్ఛమైన హైడ్రోజన్ ఇంధన  ఎగుమతిదారుగా మారుతుంది " అని శ్రీ పూరి తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీ రామేశ్వర్‌ తేలి మాట్లాడుతూ భారతదేశంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో చేపట్టిన గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ అభివృద్ధి, ప్రగతి పథంలో పయనిస్తోంది అని అన్నారు. . కార్బన్ రహిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో  హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తుందని,  వాతావరణ మార్పులు తగ్గించడంలో సహాయ పడుతుందన్నారు. 

 కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ   కార్యదర్శి శ్రీ పంకజ్ జైన్  మాట్లాడుతూ సాంకేతికత, చలనశీలతకు సంబంధించి భారతదేశం కీలక దశలో ఉందన్నారు.ఈ రోజు ప్రారంభమైన హైడ్రోజన్ బస్సు  బస్సు చలనశీలత ఎలా రూపాంతరం చెందుతుంది మరియు భారతదేశం సాంప్రదాయ ఇంధనాల నుంచి ఎలా దూరం అవుతుంది అనేదానికి నిదర్శనమని అన్నారు.  విప్లవాత్మక ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన  ఇండియన్‌ఆయిల్‌ ను ఆయన అభినందించారు.  

అంతకుముందు ప్రముఖులకు స్వాగతం పలికిన  ఇండియన్ ఆయిల్ చైర్మన్ శ్రీ ఎస్.ఎం   వైద్య  2070 నాటికి నికర-జీరో ఉద్గారాలను సాధించాలనే భారతదేశ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడంలో  హైడ్రోజన్ కీలకంగా ఉంటుందన్నారు.  నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేస్తున్న కృషి వల్ల దేశంలో హైడ్రోజన్ బస్సులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఇండియన్ ఆయిల్  ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో     పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ  సున్నా ఉద్గార స్థాయి చేరుకోవడానికి కార్యక్రమాలు అమలు చేస్తోంది. లక్ష్య సాధనలో భాగంగా దేశ రాజధాని ప్రాంతంలో ఎంపిక చేసిన 15 మార్గాలలో హైడ్రోజన్ బస్సులు నడుస్తాయి.   ఈ 15 బస్సులు   సమర్థత, సామర్థ్యం, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి  3 లక్షల కిలోమీటర్ల దూరం  ప్రయాణిస్తాయి.

***(Release ID: 1960762) Visitor Counter : 114