సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

నషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA) - సామాజిక న్యాయం & సాధికారత శాఖ, ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ మధ్య అవగాహన ఒప్పందం

Posted On: 22 SEP 2023 6:34PM by PIB Hyderabad

    ఏదైనా పదార్థ వినియోగ రుగ్మత / వ్యసనం అనేది దేశంలోని సామాజిక నిర్మాణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్న సమస్య. ఏదైనా పదార్ధంపై ఆధారపడటం అనేది వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, వారి కుటుంబాలు మరియు మొత్తం సమాజాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఎవరైనా మనస్సుకు సంబంధించిన వివిధ  పదార్ధాలను వరుసగా / క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల వాటిపైన పూర్తిగా ఆధారపడే బానిసలుగా మారడానికి  దారితీస్తుంది.

           భారతదేశంలో మత్తు పదార్ధాల వినియోగ వ్యాప్తి, దాని సరళిపై సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని AIIMSలోని నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్ (NDDTC) ద్వారా నిర్వహించిన మొదటి సమగ్ర జాతీయ సర్వే నివేదిక ప్రకారం దేశ ప్రజలు ఉపయోగించే  మత్తు పదార్ధాలలో అత్యంత సాధారణ మానసిక పదార్ధం ఆల్కహాల్ తర్వాత గంజాయి మరియు ఓపియాయిడ్లు ఉన్నాయి.

       మాదక ద్రవ్యాలకు పెరుగుతున్న డిమాండ్ విపత్తును అరికట్టడానికి భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ
ఔషధ డిమాండ్ తగ్గింపు (NAPDDR) కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది.  ఈ ప్రణాళిక  కింద రాష్ట్ర ప్రభుత్వాలకు / కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందించే ఛత్ర  పథకం అమలు చేస్తోంది.   ఈ పథకం కింద దురలవాటును మాన్పించడానికి నిరోధక విద్య,  జాగృతి కలిగించడం, సామర్ధ్యం పెంపు, నైపుణ్య వృద్ధి మరియు మాదకద్రవ్యాల వ్యసనాన్ని మానినవారికి వృత్తిశిక్షణ,  జీవనోపాధి మద్దతుకు చేయూత.  

         మాదకద్రవ్యాలను దుర్వినియోగం చేయడంవల్ల కలిగే దుష్పరిణామాల గురించి యువతకు అవగాహన కల్పించే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని జిల్లాల్లో ప్రతిష్టాత్మకమైన నషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA)ని అమలు చేస్తోంది.  ఇందుకోసం 2020 నుండి ఉన్నత విద్యా సంస్థలు, యూనివర్సిటీ క్యాంపస్‌లు, పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేయడంతో పాటు సామాజిక వర్గాలలో  ప్రచారం చేయడంతో పాటు సమాజం ప్రమేయాన్నిమరియు యాజమాన్యాన్ని పెంపొందించడానికి NMBA కృషిచేస్తోంది.

        ఫేస్‌బుక్, ట్విట్టర్ & ఇన్‌స్టాగ్రామ్‌లలో హ్యాండిల్‌లను సృష్టించడం మరియు వాటిని సమాచారంతో  తాజాపరచి ఇతరులకు షేర్ చేయడం ద్వారా అభియాన్ సందేశాన్ని ఆన్‌లైన్‌లో వ్యాప్తి చేయడానికి టెక్నాలజీ,  సోషల్ మీడియా సమర్థవంతంగా ఉపయోగించడం జరుగుతోంది.   జిల్లాలు మరియు మాస్టర్ వాలంటీర్ల ద్వారా వాస్తవ సమయం ప్రాతిపదికన భూ క్షేత్రంలో జరిగే కార్యకలాపాల డేటాను సంగ్రహించడానికి ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ అనువర్తనం అభివృద్ధి చేశారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతోంది. మాదక ద్రవ్యాల వ్యసనాన్ని మాన్పించే  డి-అడిక్షన్ కేంద్రాలన్నింటిని  ప్రజల సౌలభ్యం కోసం జియో-ట్యాగ్ చేయడం జరిగింది.

          ఈ వ్యసనం నుండి బయటపడేందుకు NMBA కీలక పాత్ర పోషిస్తోంది.  ఇప్పటి వరకు నషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA) తాము కార్యక్షేత్రంలో చేపట్టిన వివిధ కార్యకలాపాల ద్వారా ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా ప్రజలకు చేరువైంది. అభియాన్ గుర్తించిన సమస్యాత్మక జిల్లాల్లో అభియాన్ కార్యకలాపాలకు నాయకత్వం వహించి అమలు చేయడానికి  8,000 మంది మాస్టర్ వాలంటీర్లను ఎంపిక
చేసి శిక్షణ ఇవ్వడం జరిగింది.  3.36 కోట్ల కంటే ఎక్కువ మంది యువత అభియాన్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడమే కాక మాదకద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నారు.  ఎక్కువ మందిని చేరుకోవడానికి అంగన్‌వాడీ & ఆశా కార్యకర్తలు, ఏ ఎన్ ఎం లు, మహిళా మండలులు  & మహిళా స్వయం సహాయక బృందాల పాత్ర కూడా గణనీయమైనది.  వివిధ వర్గాలకు చెందిన 2.24
కోట్ల మందికి పైగా మహిళలు అందిస్తున్న సహకారం కూడా చాలా ముఖ్యమైనది.

                మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేసి వ్యాప్తి చేయడానికి NMBA క్రింద ఒక ప్రత్యేక ఉపక్రమణ చేపట్టడం జరిగింది. ఇందుకు సంబంధించిన వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి మత/ఆధ్యాత్మిక సంస్థల సహకారాన్ని తీసుకుని, వారి పథకం కింద  NMBA సందేశాన్ని వ్యాప్తి చేయడం జరుగుతుంది. ఈ దిశలో ఒక అడుగు వేస్తూ, యువత, మహిళలు, విద్యార్థులు మరియు సమాజంలో NMBA సందేశాన్ని వ్యాప్తి చేయడం కోసం సామాజిక న్యాయం & సాధికారత విభాగం ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్‌తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో శుక్రవారం   సామాజిక న్యాయం & సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ , ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ కు చెందిన డాక్టర్  చిన్మయ్ పాండ్యా సమక్షంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయి.  మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు మరియు ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్‌కు చెందిన 500 కంటే ఎక్కువ మంది సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  


        దేశంలో  మాదకద్రవ్యాల వాడకాన్ని నిర్మూలించడానికి చేపట్టిన  'నషా ముక్త్ భారత్ అభియాన్'  ద్వారా చేపట్టిన ప్రయత్నాలు
ఈ ప్రచారాన్ని  ఒక ప్రజా ఉద్యమంగా మార్చడంలో సహాయపడిందని సామాజిక న్యాయం & సాధికారత శాఖ మంత్రి అన్నారు.  మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జాతీయ ప్రతిజ్ఞ, రక్షా మంత్రి సమక్షంలో ఎన్‌సిసి ఇంటరాక్షన్ వంటి ప్రత్యేక కార్యక్రమాల గురించి మంత్రి సమావేశానికి తెలియజేశారు, ఇవి మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో భాగస్వాములను  చేయడానికి క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది.  ఈ అభియాన్‌లో ఆధ్యాత్మిక సంస్థల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన మంత్రి, గాయత్రీ పరివార్‌తో ఈ సహకారం వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నింపడానికి మరియు వ్యసనాల మార్గంలో  వెళ్లకుండా నిరోధించడానికి మరియు వారిని మానసికంగా, శారీరకంగా బలవంతులుగా తయారుచేసి బలమైన సమాజం ఆవిర్భావానికి సహాయపడుతుందనే  విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు.


             డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఇంత పెద్దఎత్తున ప్రచారాన్ని ప్రారంభించినందుకు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖను  ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ కు చెందిన  డాక్టర్ చిన్మయ్ పాండ్య అభినందించారు. ఈ క్షేత్రంలో  పని చేసిన తన అనుభవాల ద్వారా, మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడానికి మరియు అధిగమించడానికి సహాయపడే అనుకూలమైన కుటుంబ మరియు సామాజిక వాతావరణం యొక్క ప్రాముఖ్యతను ఆయన  నొక్కి చెప్పారు. ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్‌తో సంబంధమున్న  5000 కేంద్రాలు మరియు 16 కోట్ల మందికి పైగా  వ్యక్తుల ద్వారా నషా ముక్త్ భారత్ అభియాన్‌లో పాల్గొనడాన్ని మరియు నషా ముక్త్ భారత్‌కు సహకరిస్తున్నట్లు డాక్టర్ పాండ్యా ధృవీకరించారు.

          ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా మాదక ద్రవ్యాల దుష్ప్రభావాన్ని గురించిన ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్న ఇండియా లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా  ఎన్‌ఎంబిఎ అమలుకు తగిన ప్రోత్సాహం లభిస్తుందని సామాజిక న్యాయం & సాధికారత శాఖ భావిస్తోంది. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయం & సాధికారత శాఖ కార్యదర్శి శ్రీ సౌరభ్ గార్గ్ పాల్గొని ప్రసంగించారు.


 

****



(Release ID: 1960130) Visitor Counter : 95


Read this release in: English , Urdu , Hindi