మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్చతను వ్యవస్థాగతం చేయడం, పెండిగ్‌అంశాలను పరిష్కరించే కార్యక్రమం చేపట్టడానికి కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ్‌ అక్టోబర్‌ 2నుంచి ` అక్టోబర్‌ 31 2023 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0ను చేపట్టనుంది.


2023లో ఈ ఆఫీస్‌ కింద ప్రారంభించిన ఫైళ్ళ శాతం99.78
ప్రత్యేక ప్రచార కార్యక్రమం 2,0 కింద స్వచ్ఛతా ప్రచారాన్ని 8ప్రాంతాలలో నిర్వహించడం జరిగింది.

प्रविष्टि तिथि: 22 SEP 2023 9:23PM by PIB Hyderabad

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎం.ఒ.ఎం.ఎ) అక్టోబర్‌ 2నుంచి అక్టోబర్‌ 31 2023 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 ను చేపట్టడానికి సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించి ముందస్తు ప్రచార ఏర్పాట్లు  2023 సెప్టెంబర్‌ 15న ప్రారంభమయ్యాయి. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, పరిశుభ్రతను ముందుకు తీసుకువెళ్లడం, పెండిగ్‌ అంశాలను గణనీయంగా తగ్గించడం, స్వచ్ఛతను వ్యవస్థాగతం చేయడం, అంతర్గత పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం,రికార్డుల నిర్వహణలోఅధికారులకు తగిన శిక్షణ ఇవ్వడం, భౌతిక రికార్డుల డిజిటలైజేషన్‌ వంటివి ఈ ముందస్తు ప్రచార ఏర్పాట్లలో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ప్రత్యేక ప్రచారంలో అధికారులు, సిబ్బంది 2021 నుంచి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ మంత్రిత్వశాఖ పెండిరగ్‌ఫైళ్లను తగ్గించడంలో నిరంతరం చర్యలు తీసుకుంటోంది. అలాగే స్వచ్ఛతను పెంపొందిస్తోంది. తద్వారా సులభతర జీవనానికి వీలు కల్పిస్తోంది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తోపాటు,ఈ మంత్రిత్వశాఖ కిందగల స్వతంత్ర సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నాయి.

పరిశుభ్రతా ప్రచార కార్యక్రమాన్ని 8 ప్రాంతాలలో నిర్వహించడం జరిగింది. ప్రత్యేక ప్రచారం 2.0 సందర్భంగా వీటిని నిర్వహించారు. ఈ ప్రచారం సందర్భంగా 500 చదరపు అడుగుల స్థలాన్ని చెత్త లేకుండా చేయడం జరిగింది. పనికిరాని వాటిని తొలగించి అమ్మడం వల్ల ప్రభుత్వానికి 3,15,000 రూపాయలు రాబడి వచ్చింది. అదనంగా మంత్రిత్వశాఖకు వచ్చిన 2093 ప్రజాఫిర్యాదులలో 1860 ప్రజాఫిర్యాదులను పరిష్కరించడం జరిగింది. మరోవైపు387 ప్రజాఫిర్యాదుల అప్పీళ్లలో 385 అప్పీళ్లను 2022 డిసెంబర్‌నుంచి 2023ఆగస్టువరకు  పరిష్కరించడం జరిగింది. భౌతికంగా ఫైళ్ల నిర్వహణ పద్ధతిని తొలగించడం జరుగుతోంది. 99.78 శాతం ఫైళ్లను 2023 లో ఈ ఆఫీస్‌ కింద ఓపెన్‌చేయడం జరిగింది.
ప్రస్తుత పరిశుభ్రత, ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రచారాన్ని కొనసాగిస్తూ, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ , ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 కు సన్నద్ధమవుతోంది. ఇది అక్టోబర్‌ 02 ,2023న ప్రారంభమవుతుంది.

 

***

 


(रिलीज़ आईडी: 1960020) आगंतुक पटल : 136
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी