సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
పింఛనులు, పింఛనుదారుల సంక్షేమ శాఖలో పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమం 3.0 పై సమీక్ష
పింఛనుదారుల "సులభమైన జీవనాన్ని" పెంపొందించడానికి "సులభమైన నిబంధనల" పై ప్రత్యేక దృష్టి.
Posted On:
22 SEP 2023 6:17PM by PIB Hyderabad
పెండింగులో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమం 2.0 (ఎస్.సి.డి.పి.ఎం. 2.0) లో భాగంగా, పింఛనులు, పింఛనుదారుల సంక్షేమ శాఖ 2022 డిసెంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు పింఛనుదారులకు జీవన సౌలభ్యం ఉండేలా అనేక చర్యలు తీసుకుంది:
* స్వీకరించిన పి.జి. పిర్యాదులు, పరిష్కారాలు : 91.40 శాతం ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడం జరిగింది (52,668 ఫిర్యాదులలో 48,142 పరిష్కారమయ్యాయి).
* పార్లమెంటు సభ్యులద్వారా అందుకున్న పిర్యాదులు : పార్లమెంటు సభ్యుల నుంచి అందుకున్న పిర్యాదులు 100 శాతం పరిష్కారమయ్యాయి.
* పార్లమెంటు హామీలు : పార్లమెంటు హామీలు 100 శాతం అమలయ్యాయి.
* తొలగించిన మొత్తం దస్త్రాలు : తొలగించడం కోసం గుర్తించిన మొత్తం దస్త్రాల్లో 75 శాతం దస్త్రాలను భౌతికంగా తొలగించడం జరిగింది.
* "సులభమైన నిబంధనల" విభాగం కింద, పింఛన్లు, పింఛనుదారుల సంక్షేమ శాఖ పింఛనుదారులకు జీవన సౌలభ్యం కోసం 62 ఓ.ఎం. లను - జారీ చేసింది.
* ఈ సందర్భంగా 27 ప్రదేశాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
* దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ పింఛనుదారుల సంఘాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి.
"సులభమైన నిబంధన" ల ద్వారా జీవన సౌలభ్యాన్ని నిర్ధారించడానికి, నిరంతర ప్రాతిపదికన దాని ప్రాంగణంలో స్వచ్ఛతను నిర్ధారించడానికి ఈ విభాగం కట్టుబడి ఉంది. పెండింగ్‌ను మరింత తగ్గించడానికి, స్వచ్ఛతను సంస్థాగతీకరించడానికి, అంతర్గత పర్యవేక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయడానికి, రికార్డుల నిర్వహణను మెరుగుపరచడానికి 2023 అక్టోబర్, 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమం 3.0 నిర్వహించడానికి ఈ విభాగం సిద్ధమవుతోంది.
పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమం 3.0 (ఎస్.సి.డి.పి.ఎం. 3.0) లక్ష్యాలను ఈ విభాగం గుర్తించింది:-
* ప్రజా ఫిర్యాదుల స్వీకరణ : 5,000
* సమీక్ష కోసం భౌతిక దస్త్రాలు : 1,358
* సమీక్ష కోసం ఎలక్ట్రానిక్ దస్త్రాలు : 883
* నిర్వహించాల్సిన స్వచ్ఛత కార్యక్రామాల సంఖ్య : 50
* సరళీకరణ కోసం గుర్తించబడిన నియమాల సంఖ్య : 50
కేంద్ర ప్రభుత్వ పింఛనుదారుల సంఘాలు, వాటి అనుబంధ సంఘాలైనప్పటికీ, ఈ విభాగం, భారతదేశ వ్యాప్తంగా విస్తృతమైన స్వచ్ఛతా కార్యక్రమాలను చేపట్టింది.
****
(Release ID: 1960019)
Visitor Counter : 119