పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

సిఏక్యూఎంకి సమర్పించిన వరి పొట్టు దహనంపై నిర్వహణలో భాగంగా రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక ప్రకారం వరిపొట్టు దహనాన్ని గణనీయంగా తగ్గించడానికి మరియు ఈ సంవత్సరం దాదాపు నివారించేందుకు హర్యానా ప్రయత్నం


ప్రస్తుత హార్వెస్టింగ్ సీజన్‌లో బయో డికంపోజర్ అప్లికేషన్ ద్వారా 5 లక్షల ఎకరాల్లో వరి గడ్డిని నిర్వహించాలని భావిస్తోన్న రాష్ట్రం

వరి పొట్టును దహనం చేసే కేసులను గణనీయంగా తగ్గించడానికి పలు ఆర్థిక ప్రోత్సాహకాలు మరియు పథకాలను అమలు చేస్తోన్న హర్యానా ప్రభుత్వం

Posted On: 22 SEP 2023 4:36PM by PIB Hyderabad

గత సమీక్షా సమావేశంలో కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సిఏక్యూఎం) రాష్ట్రంలో వరిపొట్టు గుట్టలను కాల్చే పద్దతిని తొలగించడానికి రోజువారీ ప్రాతిపదికన హాట్‌స్పాట్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రణాళికలు మరియు రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా, తీవ్రతరం చేసి మరియు కఠినంగా అమలు చేయాలని సంబంధిత డీసీలతో సహా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

2022 డేటా ప్రకారం హర్యానాలోని 22 జిల్లాలకు గాను 09 జిల్లాల్లోని పొలాల్లో పొట్టు దహనం ఘటనలు శూన్యం లేదా చాలా తక్కువగా ఉన్నాయి. పల్వాల్, పానిపట్, రోహ్‌తక్ మరియు సోనిపట్ అనే 04 జిల్లాలకు సంబంధించి వ్యవసాయ దహనాలు గత సంవత్సరం 100 కంటే తక్కువకు తగ్గించబడ్డాయి. హాట్‌స్పాట్ జిల్లాలైన ఫతేహాబాద్, కైతాల్ మరియు జింద్‌లో 500 కంటే ఎక్కువ ఉన్నాయి. ఆందోళన కలిగించే ఇతర జిల్లాలు సిర్సా, కురుక్షేత్ర, కర్నాల్, అంబాలా, యమునా నగర్ మరియు హిసార్‌గా ఉన్నాయి.

రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా హర్యానాలో  చెత్తను కాల్చే సంఘటనలను భారీగా తగ్గించాలని భావించిన కమిషన్, ఎన్‌సీఆర్ & పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సిఎక్యూఎం) ప్రస్తుత సంవత్సరం వరి కోత సీజన్‌లో హర్యానా ప్రభుత్వం యొక్క సన్నద్ధతను పరిశీలించింది.

సమావేశంలో వ్యవసాయ శాఖ మరియు పర్యావరణ శాఖ, హర్యానా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (హెచ్‌ఎస్‌పిసిబి) మరియు సంబంధిత జిల్లా కలెక్టర్లు (డిసిలు) సహా సంబంధిత శాఖల రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కమిషన్‌కు హామీ ఇచ్చారు. ప్రస్తుత వరి కోత సీజన్‌లో పొట్ట దగ్ధం కావడంలో తీవ్ర తగ్గింపును సాధించేందుకు రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయడానికి సరైన శ్రద్ధ వహిస్తామని తెలిపారు.

రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక ప్రకారం మొత్తం వరి సాగు విస్తీర్ణం 14.82 లక్షల హెక్టార్లుగా అంచనా వేయబడింది మరియు బాస్మతియేతర వరి  గడ్డి ఉత్పత్తి 7.3 మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.

ప్రస్తుత వరికోత సీజన్‌కు సంబంధించి రాష్ట్ర మరియు జిల్లా కార్యాచరణ ప్రణాళికల సంసిద్ధత మరియు అమలును సమీక్షించడానికి మరియు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడానికి సిఎక్యూఎం ఇప్పటికే నాలుగు (04) సమావేశాలను నిర్వహించింది. ఈ సంవత్సరం సిఎక్యూఎం రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికతో పాటు జిల్లా వారీగా కార్యాచరణ ప్రణాళికలను కూడా కోరింది. సిఎక్యూఎం కూడా యాక్షన్ ప్లాన్  ఖచ్చితమైన అమలు కోసం చట్టబద్ధమైన ఆదేశాలను జారీ చేసింది.

తాజా సమీక్షా సమావేశంలో సంబంధిత జిల్లాల డీసీలు తమ జిల్లాల్లో గడ్డిని ఇన్‌సిటు మరియు ఎక్స్‌సిటూ మేనేజ్‌మెంట్ ద్వారా నిర్వహించేందుకు యంత్రాంగాలు సిద్ధంగా ఉన్నాయని హామీ ఇచ్చారు.

గడ్డిని మేతగా ఉపయోగించడం మరియు బయో-డికంపోజర్ అప్లికేషన్ ద్వారా గడ్డిని నిర్వహించడంతోపాటు, యంత్రాల లభ్యత స్థితిని కూడా చర్చించారు. హర్యానాలో ప్రస్తుతం 80,000 కంటే ఎక్కువ పంట అవశేషాల నిర్వహణ యంత్రాలు ఉన్నాయి. యంత్రాల మొత్తం లభ్యత మరియు కొత్త యంత్రాల సేకరణను కూడా సమీక్షించారు. డిమాండ్ మరియు సరఫరా మ్యాపింగ్ ద్వారా యంత్రాల యొక్క సరైన వినియోగాన్ని సమీక్షా సమావేశంలో పునరుద్ఘాటించారు.

ఖరీఫ్ సీజన్ 2022కి సంబంధించిన శాటిలైట్ డేటా ఆధారంగా, యాక్టివ్ ఫైర్ లొకేషన్ (ఏఎఫ్‌ఎల్) ఆధారంగా మైక్రో ప్లానింగ్‌లో భాగంగా ప్రస్తుత సంవత్సరానికి హాట్ స్పాట్ గ్రామాలు మరియు జిల్లాలు గుర్తించబడ్డాయి:

 

జోన్

గ్రామాల సంఖ్య

ఎరుపు (6 & అంతకంటే ఎక్కువ ఏఎఫ్‌ఎల్)

147

పసుపు (2-5 ఏఎఫ్‌ఎల్)

582

ఆకుపచ్చ (0-1 ఏఎఫ్‌ఎల్)

6175

 

రెడ్ జోన్ గ్రామాలు అధికంగా ఫతేహాబాద్ (49), కైతాల్ (36), జింద్ (24), సిర్సా (11) మరియు కర్నాల్ (10) జిల్లాల్లో ఉన్నాయి.

ప్రస్తుత కోత సీజన్‌లో వరి అవశేషాల దహనాన్ని గణనీయంగా తగ్గించడానికి హర్యానా రాష్ట్రంలో వివిధ ఆర్థిక ప్రోత్సాహకాలు మరియు పథకాలు అమలు చేయబడుతున్నాయి. వాటిలో ఉన్నవి:

ప్రోత్సాహకం ఎకరాకు @ రూ.1000/- వరి పంట అవశేషాల ఇన్-సిటు / ఎక్స్-సిటు నిర్వహణకు.

ప్రోత్సాహకం ఎకరాకు @రూ.7000/-  మేరా పానీ మేరీ విరాసత్ పథకం కింద ప్రత్యామ్నాయ పంటలతో వరి ప్రాంతాన్ని వైవిధ్యపరచడానికి

ప్రోత్సాహకం ఎకరానికి @ రూ. 4000/ - వరిని నేరుగా విత్తనం స్వీకరించడానికి గ్రాంట్ రెడ్ జోన్ పంచాయతీలకు జీరో బర్నింగ్ సాధించడానికి 1,00,000/;

గ్రాంట్ రూ.50,000/- పసుపు మండల పంచాయతీలకు జీరో బర్నింగ్ సాధించడానికి; ఎకరానికి రూ. 500/- బేల్స్ రవాణా ఛార్జీలు గరిష్టంగా పరిమితం రూ. 15,000/- గౌశలకు;

2జీ ఇథనాల్ ప్లాంట్ కోసం గుర్తించబడిన క్లస్టర్లకు సబ్సిడీని అందించే ప్రత్యేక నిబంధనలు;

వరి పంట అవశేషాల సేకరణకు ధరల నిర్ణయం @ టన్నుకు రూ.2,500.

రాష్ట్ర ప్రభుత్వం పూసా బయో డీకంపోజర్ ద్వారా 5 లక్షల ఎకరాల వరి విస్తీర్ణాన్ని నిర్వహించడానికి చొరవ తీసుకుంది మరియు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూసా బయో డికంపోజర్ కిట్‌లను ఉచితంగా అందిస్తుంది.

వరి పొట్టు దహనంపై నియంత్రణ కోసం రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికతో, హర్యానాలో వరి కంకులు గణనీయంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

హర్యానా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మరియు డీసీలతో సహా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పరిస్థితిని నియంత్రించడానికి అన్ని సన్నాహాలు సిద్ధంగా ఉన్నారని హామీ ఇచ్చారు.

ముఖ్యంగా ఫతేహాబాద్, జింద్, కైతాల్, కర్నాల్, కురుక్షేత్ర మరియు సిర్సాలలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా నమోదైన జిల్లాల్లో రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా మరియు కఠినంగా అమలు చేయాలని డిప్యూటీ కమిషనర్లు మరియు హెచ్‌ఎస్‌పిసిబితో సహా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సిఎక్యూఎం పలుమార్లు ఆదేశించింది.

 
***


(Release ID: 1959843) Visitor Counter : 85


Read this release in: English , Urdu , Hindi