ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్థిక సమ్మిళితం, అధిక ఉత్పాదకత కోసం డిజిటల్ పౌర మౌలిక సదపాయాలపై న్యూఢిల్లీలోఅంతర్జాతీయ సదస్సు జరిగింది


డిజిటల్ పౌర మౌలిక సదపాయాల రంగంలో భారతదేశ నాయకత్వాన్ని మరియు సమ్మిళిత ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో దాని నిబద్ధతను సెమినార్ ప్రదర్శించింది.

Posted On: 22 SEP 2023 8:23PM by PIB Hyderabad

ఆర్థిక వ్యవహారాల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఆసియా మరియు పసిఫిక్ విభాగం సహకారంతో  దక్షిణాసియా ప్రాంతీయ శిక్షణ మరియు సాంకేతిక సహాయ కేంద్రం మద్దతుతో ఆర్థిక సమ్మిళితం అధిక ఉత్పాదకత కోసం డిజిటల్ పౌర మౌలిక సదపాయాలపై అంతర్జాతీయ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. ఈ  హైబ్రిడ్ మోడ్ లో జరిగిన ఈ ఈవెంట్ లో సెక్రటరీ (ఆర్థిక వ్యవహారాలు), ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, ప్రధాన ఆర్థిక సలహాదారు, భారత ప్రభుత్వం; ఐ ఎం ఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకు నుండి సీనియర్ నిపుణులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆసియా, ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్యంలోని 100 దేశాలకు చెందిన ప్రతినిధులు పరీక్ష ఆన్లైన్ లో చేరారు. ఈ సెమినార్ సహాభ్యాసాన్ని  పెంపొందించడానికి, ప్రపంచ ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి మరియు ఆర్థిక సమ్మిళితం మరియు ఉత్పాదకతను అభివృద్ధి చేయడంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం లో సహకారాన్ని ప్రోత్సహించడానికి ఒక వేదికగా పనిచేసింది.

 

ఇండియా స్టాక్‌ను ప్రపంచ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా అభివృద్ధి చేయడంలో భారతదేశం యొక్క అద్భుతమైన ప్రయాణం యొక్క సమగ్ర అవలోకనాన్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అందించింది. ఇది భారతదేశంలో డిజిటల్ ఆవరణాన్ని మార్చడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పరివర్తనకు శక్తివంతమైన పాఠాలను అందిస్తుంది. ఐ ఎం ఎఫ్ యొక్క పేపర్ “భారతదేశం యొక్క డిజిటల్ ప్రస్థానం నుండి ప్రయోజన పాఠాలు - స్టాకింగ్ అప్ ది బెనిఫిట్స్: లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ డిజిటల్ జర్నీ” ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో 87% పైగా పేద కుటుంబాలను సమర్థవంతంగా చేరుకోవడానికి భారతదేశం యొక్క ప్రత్యక్ష ప్రయోజన బదిలీ యంత్రాంగాన్ని ప్రశంసించింది, డిజిటల్ మార్గాల ద్వారా అవసరమైన సేవలను అందించగల భారతదేశ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది.

 

సెమినార్‌లో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఆర్థిక సమ్మిళితం అధిక ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం ప్రపంచ బ్యాంక్ జీ 20 విధాన సిఫార్సులను సమర్పించింది. ఈ సిఫార్సులను ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జీ 20 నాయకుల సదస్సు ఆమోదించింది. ఈ సిఫార్సులు ఆర్థిక సమ్మిళితం సాధించడంలో మరియు ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో డి పీ ఐ ల సామర్థ్యాన్ని పెంచడానికి దేశాలకు కార్యాచరణ అంతర్దృష్టులు మరియు అనుకూలీకరించదగిన వ్యూహాలను అందిస్తాయి.

 

భారతదేశం యొక్క డిజిటల్ ప్రయాణం నుండి అంతర్దృష్టులను కార్యదర్శి (ఆర్థిక వ్యవహారాలు) పంచుకున్నారు. డిజిటల్ మరియు ఆర్థిక సమ్మిళితాల అంతరాలను తొలగించడంలో సాధారణ, ఉన్నతీకరణ మరియు స్థిరమైన పరిష్కారాలుగా  డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క కీలక పాత్రను నొక్కిచెప్పారు.  విజ్ఞాన పంపిణీ, సామర్ధ్య నిర్మాణం, అంతర్జాతీయ డిపిఐల అనుసంధానాలను  ద్వారా డిపిఐని అభివృద్ధి చేయడానికి ముందున్న మార్గాన్ని ముఖ్య ఆర్థిక సలహాదారు చర్చించారు.

 

సెమినార్‌లో పరిశ్రమ నిపుణులు, జెరోధా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ నితిన్ కామత్ మరియు ఎక్‌స్టెప్ ఫౌండేషన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ ప్రమోద్ వర్మ మధ్య చర్చలు జరిగాయి.  డిపిఐల స్వీకరణ ద్వారా ఆవిష్కరణ, పోటీ మరియు ఆర్థిక చేరికల మార్గంపై వారి అంతర్దృష్టులు వెలుగునిస్తాయి. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై అంతర్జాతీయ సెమినార్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో భారతదేశ నాయకత్వాన్ని మరియు సమ్మిళిత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో దాని నిబద్ధతను ప్రదర్శించింది. ఈ కార్యక్రమం అంతర్జాతీయ సహకారం మరియు విజ్ఞాన భాగస్వామ్యానికి వేదికగా పనిచేసింది. సుస్థిరమైన అభివృద్ధి కోసం డిపిఐలను ఉపయోగించుకునే ప్రపంచ ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లింది. 

 

***



(Release ID: 1959830) Visitor Counter : 123


Read this release in: Hindi , English , Urdu