శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ వన్ వీక్ వన్ లాలబ్ కార్యక్రమం సమగ్ర చిత్రం
సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ కు చెందిన ఒడబ్ల్యుఓఎల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి
ప్రారంభ సమావేశంలో డాక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులను ప్రకటించిన సిఎస్ఐఆర్ డిజి
Posted On:
20 SEP 2023 8:02PM by PIB Hyderabad
సిఎస్ఐఆర్-నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్) ఇటీవల వన్ వీక్ వన్ లాబ్ (ఒడబ్ల్యుఓఎల్) కార్యక్రమం నిర్వహించింది. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ఐఎస్ సిపిఆర్ తమ సంస్థ లక్ష్యాలు, కార్యక్రమాల విభిన్న కోణాలను ప్రతిబింబించే కార్యక్రమాలను ఎన్ఐఎస్ సిపిఆర్ నిర్వహించింది. శాస్ర్తీయ విధాన పరిశోధన, సైన్స్ కమ్యూనికేషన్ రంగాల్లో సంస్థ సాధించిన విజయాలు, కొత్త చొరవలు తెలియచేయడానికి వీలుగా ఈ కార్యక్రమం రూపొందించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని శాస్ర్తవేత్తలు, విద్యావేత్తలు, సైన్స్ దౌత్యవేత్తలు, సైన్స్ కమ్యూనియేటర్లు, సైన్స్ పబ్లిషర్లు, ఎంటర్ ప్రెన్యూర్లు, పారిశ్రామిక నిపుణులు, రైతులు, స్టార్టప్ లు, విద్యార్థులు, ఇతర భాగస్వాములందరికీ ఉపయోగపడేలా 7 రకాల కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలను కూడా భాగస్వాములను చేసే విధంగా స్టార్టప్ లలోని విభిన్న కోణాలు, సిఎస్ఐఆర్ టెక్నాలజీలు ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కల్పన, సైన్స్ ఔట్ రీచ్, సైన్స్ డిప్లొమసీ, సైన్స్ కమ్యూనికేషన్ వంటి అంశాలతో ఈ కార్యక్రమాలు రూపొందించారు.
ఒడబ్ల్యుఓఎల్ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మానస పుత్రిక. 2023 జనవరి 6వ తేదీన న్యూఢిల్లీలోని హాబిటాట్ సెంటర్ లో దీన్ని మంత్రి ప్రారంభించారు. రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సిబిఆర్ఐ) సహకారంతో ఒడబ్ల్యుఓఎల్ చొరవను సిఎస్ఐఆర్ లాబ్ లు ప్రారంభించాయి. శాస్ర్తవేత్తలను, సమాజం కోసం వారి పరిశోధనలను అనుసంధానం చేయడం ఒడబ్ల్యుఓఎల్ ప్రధాన ధ్యేయం. ఇందులో భాగంగా సిఎస్ఐఆర్ కు చెందిన ప్రతీ ఒక్క లాబ్ ఆర్ అండ్ డిలో తాను సాధించిన విజయాలను భాగస్వామ్య వర్గాలకు ప్రదర్శించి చూపింది.
ఈ సీరీస్ లో భాగంగానే ఢిల్లీలోని సిఎస్ఐఆర్ లాబ్ ఎన్ఐఎస్ సిపిఆర్ 2023 సెప్టెంబరు 11-16 తేదీల మధ్య ఒడబ్ల్యుఓఎల్ కార్యక్రమం నిర్వహించింది. న్యూఢిల్లీలోని పిహెచ్ డి చాంబర్ ఆఫ్ కామర్స్ లో 2023 సెప్టెంబరు 6వ తేదీన కర్టెన్ రైజర్ తో ఈ కార్యక్రమం ప్రారంభమయింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నేషనల్ సైన్స్ చైర్ డాక్టర్ రాకేశ్ భట్నాగర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఒడబ్ల్యుఓఎల్ బ్రోచర్ ను ఎన్ఐఎస్ సిపిఆర్ ఆవిష్కరించింది. ఒడబ్ల్యుఓఎల్, ఎన్ఐఎస్ సిపిఆర్ కార్యకలాపాల గురించి సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజన్న సంక్షిప్త వివరణ ఇచ్చారు. ఎన్ఐఎస్ సిపిఆర్ ఒడబ్ల్యుఓఎల్ కార్యక్రమాల గురించి సీనియర్ ప్రిన్సిపల్ శాస్ర్తవేత్త డాక్టర్ యోగేశ్ సుమన్ వివరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో పత్రికా సమావేశం కూడా నిర్వహించారు. ఒడబ్ల్యుఓఎల్, సిఎస్ఐఆర్- ఒడబ్ల్యుఓఎల్ శాస్ర్తవేత్త, కో ఆర్డినేటర్ డాక్టర్ మనీష్ మోహన్ గోరే దీనికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
కర్టెన్ రైజర్ అనంతరం 2023 సెప్టెంబరు 11వ తేదీన న్యూఢిల్లీలోని సిఎస్ఐఆర్-నేషనల్ ఫిజికల్ లేబరేటరీలో ప్రారంభ కార్యక్రమం జరిగింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డిఎస్ఐఆర్ కార్యదర్శి, సిఎస్ఐఆర్ డిజి డాక్టర్ ఎన్.కలైసెల్వి గౌరవ అతిథిగా; సిఎస్ఐఆర్-ఎన్ పిఎల్ డైరెక్టర్ ప్రొఫెసర్ వేణుగోపాల్ ఆచంట ప్రత్యేక ఆహ్వానితునిగా కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. అధిక సంఖ్యలో ఆడియెన్స్ ను చేరడం కోసం ఈ కార్యక్రమం లైవ్ స్ర్టీమింగ్ ను యూ ట్యూబ్, ఫేస్ బుక్ లో ప్రసారం చేశారు.
సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ పరిమాణపరంగా చిన్నవే అయినప్పటికీ వాటికి లభించిన అవకాశం చాలా పెద్దదని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. శాస్ర్తీయ విజయాలను ఈ ఇన్ స్టిట్యూట్ సమాజానికి తెలియచేస్తుంది. సిఎస్ఐఆర్ కు చెందిన విభిన్న లేబరేటరీల కార్యక్రమాలను సుసంఘటితం చేసేందుకు ‘‘ఒక నెల ఒక థీమ్’’ కార్యక్రమం నిర్వహించాలని మంత్రి ప్రతిపాదించారు. సైన్స్ మీడియా కమ్యూనికేషన్ సెల్ ను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించడంతో పాటు ఎన్ఐఎస్ సిపిఆర్ కు చెందిన రెండు ప్రముఖ ప్రచురణలు (విజ్ఞాన ప్రగతి : 80 ఉత్తమ వ్యాసాల సంపుటీకరణ; సిఎస్ఐఆర్@80:1942-2022 మధ్యలో ఫొటో ప్రయాణం) కూడా ఆవిష్కరించారు.
ఎన్ఐఎస్ సిపిఆర్ ఒడబ్ల్యుఓఎల్ ప్రారంభ కార్యక్రమంలో సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్.కలైసెల్వి మాట్లాడుతూ సిఎస్ఐఆర్ కు చెందిన లేబరేటరీ ఎన్ఐఎస్ సిపిఆర్ విలువను తెలియచేశారు. పరిశోధకులు, సమాజానికి మధ్యన పెద్ద అనుసంధానతగా ఎన్ఐఎస్ సిపిఆర్ వ్యవహరిస్తుందని ఆమె చెప్పారు.
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి సమక్షంలో సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ 2022 సంవత్సరానికి శాంతిస్వరూప్ భట్నాగర్ (ఎస్ఎస్ బి) బహుమతి గ్రహీతల పేర్లు ప్రకటించారు.
ప్రారంభ వేడుక అనంతరం వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కోవలో మొదటిదైన ‘‘భారత స్టార్టప్ విప్లవం: ఐడియా నుంచి మార్కెట్ కు ఉత్సుకతతో కూడిన ప్రయాణం’’ కార్యక్రమాన్ని ఎన్ఐఎస్ సిపిఆర్ వన్ వీక్ వన్ లాబ్ (ఒడబ్ల్యుఓఎల్) కార్యక్రమం రెండో రోజున సిఎస్ఐఆర్-ఎన్ పిఎల్ ఆడిటోరియంలో 2023 సెప్టెంబరు 12వ తేదీన నిర్వహించారు. స్టార్టప్ ఒడిశా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ఓంకార్ రాయ్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో సిఐఐ ఢిల్లీ స్టేట్ కౌన్సిల్ చైర్మన్, శాంటెల్ ఏవియానిక్స్ సిఇఓ శ్రీ పునీత్ కౌరా (టిబిసి) గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
తైవాన్ రాయబార కార్యాలయంలో తైపీ ఎకనామిక్, కల్చరల్ సెంటర్ కు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ త్సాన్ వాంగ్ గౌరవ అతిథిగా పాల్గొనగా సిఎస్ఐఆర్-ఐజిఐబి డైరెక్టర్ డాక్టర్ సోవిక్ మైతీ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. 300 మంది ప్రత్యక్షంగాను, 800 మంది ఆన్ లైన్ లోను ఈ కార్యక్రమం వీక్షించారు. హై టెక్నాలజీ నుంచి గ్రామీణాభివృద్ధికి పెద్ద ఎత్తున తోడ్పడతామంటూ ప్రభావవంతమైన హామీతో ముందుకు వచ్చిన వారి వరకు మొత్తం 30 స్టార్టప్ ల ఎగ్జిబిషన్ స్టార్టప్ వర్క్ షాప్ లో అమిత ఆసక్తికరమైన అంశాల్లో ఒకటి. హైడ్రోజెన్ తో నడిచే కారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా బొమ్మల తయారీ, సీడ్ స్టార్టప్ లు ఈ ప్రదర్శన హైలైట్లలో కొన్ని.
2023 సెప్టెంబరు 13వ తేదీన సిఎస్ఐఆర్-ఎన్ పిల్ ‘‘గ్రామీణాభివృద్ధికి మౌలిక స్థాయి నవ ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కాంక్లేవ్’’ నిర్వహించింది. రైతులు, మహిళా ఎస్ హెచ్ జిలు, ఎఫ్ పిఓలు వంటి గ్రామీణ భాగస్వాములకు కార్యక్రమం అంకితం చేశారు. సిఎస్ఐఆర్ మాజీ డిజి డాక్టర్ శేఖర్.సి.మండే ముఖ్య అతిథిగా వ్యవసాయ శాస్ర్తవేత్తల నియామక బోర్డు (ఎఎస్ఆర్ బి) చైర్మన్ డాక్టర్ సంజయ్ కుమార్ గౌరవ అతిథిగా, విజ్ఞాన భారతి (విభా) కార్యదర్శి శ్రీ ప్రవీణ్ రామ్ దాస్ ప్రత్యేక ఆహ్వానితుడుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ప్రదర్శనలో 10కి పైగా సిఎస్ఐఆర్ లాబ్ లు, ఉన్నత్ భారతి అభియాన్, విజ్ఞాన భారతి ప్రతినిధులు పాల్గొన తమ టెక్నాలజీలు, ఉత్పత్తులను ప్రదర్శించారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానంలో 500 మందికి పైగా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు-రైతుల ముఖాముఖి పేరిట టెక్నికల్ సెషన్ ను నిర్వహించారు. సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు, నిపుణులు తమ అనుభవం ఆధారంగా గ్రామీణ ప్రాంతాలకు అనువైన టెక్నాలజీల గురించి కీలకమైన సమాచారం అందించారు. కిసాన్ సభ యాప్ పై (సిఎస్ఐఆర్, పారిశ్రామిక భాగస్వాముల ఉమ్మడి కల్పన) నిర్వహించిన శిక్షణ సెషన్ లో పాల్గొన్న వారికి స్మార్ట్ ఫార్మింగ్ గురించి తెలియచేశారు. మూడో టెక్నికల్ సెషన్ లో ఉన్నత్ భారతి అభియాన్ (యుబిఏ) జాతీయ సమన్వయకర్త ప్రొఫెసర్ వీరేంద్ర కుమార్ విజయ్, వ్యవస్థాపక అధ్యక్షుడు విఎస్ఎం (రిటైర్డ్) బ్రిగేడియర్ పి.గణేశం, పల్లె సృజన, డాక్టర్ రోహిత్ కండకట్ల ప్రసంగించారు.
సెప్టెంబరు 23వ తేదీన స్టూడెంట్-సైన్స్ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సిఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్.సి.ముంబే; ఎఎస్ఆర్ బి చైర్మన్ డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. కథా మాధ్యమంలో డాక్టర్ సంజయ్ విద్యార్థులను ఆకట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన 150 మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. చిరుధాన్యాల పోషక విలువల ప్రాధాన్యత, న్యూట్రిషనల్ ప్రొఫైల్స్ గురించి తెలిపారు. కమ్యూనికేటింగ్ సైంటిఫికల్లీ వాలిడేటెడ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ టు ద సొసైటి (స్వస్తిక్) పేరిట సాంప్రదాయిక పరిజ్ఞానంపై వినోదాత్మకమైన క్విజ్ పోటీని ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ చారులత, సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ శాస్త్రవేత్త డాక్టర్ పద్మనాభ బర్మన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన తోలుబొమ్మలాట విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది.
దీనికి సమాంతరంగా సైన్స్ కమ్యూనికేషన్ కు సంబంధించిన విభిన్న కోణాలపై నిర్వహించిన వర్క్ షాప్ లో 50 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ శర్మిష్ఠ బెనర్జీ విద్యార్థులకు సైన్స్ కు సంబంధించిన విభిన్న అంశాలపై బోధన గురించి వివరించారు. సైన్స్ కమ్యూనికేషన్ కు చెందిన ముఖ్యమైన అంశాలపై చీఫ్ సైంటిస్ట్ శ్రీ హసన్ జవైద్ ఖాన్, సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ సీనియర్ సైంటిస్ట్ శ్రీమతి సోనాలి నగర్ ప్రసంగించారు.
నాలుగో రోజున (2023 సెప్టెంబరు 14వ తేదీ) సైన్స్ కమ్యూనికేషన్ : పబ్లిక్ ఎంగేజ్ మెంట్ విత్ సైన్స్ పేరిట ఒక కార్యక్రమం నిర్వహించారు. భోపాల్ కు చెందిన రబీంద్రనాథ్ ఠాగూర్ విశ్వవిద్యాలయం చాన్సలర్ డాక్టర్ సంతోష్ చౌబే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు (ఇస్రో) చెందిన యుఆర్ రావు శాటిలైట్ సెంటర్, నావిగేషన్ స్పేస్ క్రాఫ్ట్ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ త్సెరింగ్ తాషి గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ ప్రచురించే ప్రముఖ సైన్స్ పత్రిక ‘‘విజ్ఞాన్ ప్రగతి’’ 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏడు దశాబ్దాల ప్రయాణంపై ఒక గోష్ఠి నిర్వహించారు. సమాజానికి శాస్ర్తీయ పరిజ్ఞానాన్ని వ్యాపింపచేసే సంస్థలపై టెక్నికల్ సెషన్ నిర్వహించారు. కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ (డాక్టర్ అశోక్.ఎన్.సెల్వేత్కర్), సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ (డాక్టర్ మనీష్ మోహన్ గోరె), ఎన్ఆర్ డిసి (డాక్టర్ అంకిత మిశ్రా), హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (డాక్టర్ కె.కె.మిశ్రా), విజ్ఞాన భారతి (డాక్టర్ రాజీవ్ సింగ్), లోక్ విజ్ఞాన్ పరిషత్ (డాక్టర్ ఒ.పి.శర్మ) సంస్థల నిపుణులు, శాస్ర్తవేత్తలు ఈ గోష్ఠిలో పాల్గొన్నారు.
నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మరో ఆసక్తికరమైన కార్యక్రమం హిందీ దివస్ ని (సెప్టెంబరు 14) గుర్తు చేసుకుంటూ నిర్వహించిన ‘‘విజ్ఞాన కవి సమ్మేళనం’’. సిఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయం అడ్మినిస్ర్టేటర్, జాయింట్ సెక్రటరీ శ్రీ మహేంద్ర కుమార్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొనగా న్యూఢిల్లీకి చెందిన రాష్ర్టీయ బాల భవన్ మాజీ డైరెక్టర్, ప్రముఖ సైన్స్ కవయిత్రి డాక్టర్ మధు పంత్ చైర్ పర్సన్ గా వ్యవహరించారు. ప్రముఖ సైన్స్ కవులు (శ్రీ మోహన్ సగోరియా, డాక్టర్ అనుసింగ్, డాక్టర్ వేదమిత్రా శుక్లా, శ్రీ యశ్ పాల్ సింగ్ యశ్, డాక్టర్ ద్వివేది కవి సమ్మేళనంలో తమ కవితలు వినిపించారు. శ్రీమతి రాధా గుప్తా యాంకరింగ్ చేశారు.
ఐదో రోజున (2023 సెప్టెంబరు 15) సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ ఎస్.వి.మార్గ్ క్యాంపస్ లో సైన్స్ నాలెడ్జ్ కన్వెన్షన్ ను నిర్వహించారు. సెర్బ్ కార్యదర్శి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సీనియర్ అడ్వైజర్ డాక్టర్ అఖిలేష్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోల్కతాకు చెందిన సిఎస్ఐఆర్-సిజిసిఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ సుమన్ కుమారి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు, ఎన్ కెఆర్ సికి చెందిన డల్ అధికారులకు విభిన్న ఇ-రీసోర్స్ లు, ప్రమాణాలు, వివిధ విజ్ఞాన ఉత్పత్తుల గురించి అవగాహన కల్పించడం దీని లక్ష్యం. ఎన్ కెఆర్ సికి సంబంధించి సిఎస్ఐఆర్, డిఎస్ టి; సిఎస్ఐఆర్, ఎంఒఇల మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు కూడా జరిగాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన ‘‘ఒక నెల ఇ-రీసోర్స్ పై ఒక లెక్చర్’’ కార్యక్రమంలో భాగంగా ‘‘ఎన్ కెఆర్ సి నివేదిక : 21 సంవత్సరాల ప్రయాణం; ప్రత్యేక సంచికలు : ఐజెబిబి & ఐజెఇఎంఎస్’’ విడుదల చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ సమాచారం, నాలెడ్జ్ రీసోర్స్ లు అనే అంశంపై గోష్ఠి నిర్వహించారు. డిఎస్ టికి చెందిన అటానమస్ సంస్థల విభాగం అధిపతి డాక్టర్ మనోరంజన్ మొహంతి అధ్యక్షత వహించగా సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ చీఫ్ సైంటిస్ట్ శ్రీమతి నీలు శ్రీవాస్తవ సహాధ్యక్షత వహించారు. సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ చీఫ్ సైంటిస్ట్ శ్రీ ముకేశ్ పండ్, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ తారకాంత్ జనా ప్రసంగించారు. ‘‘ఇ-జర్నల్స్ ప్రాధాన్యత : సైంటిఫిక్ రచనలు, పబ్లికేషన్లు’’; ‘‘ఇండెక్సింగ్ టూల్స్’’; ‘‘సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనకు ఇ-వనరులు, ప్రమాణాలు, డేటా బేస్’’ అనే అంశాలపై రచయితలు, పబ్లిషర్ల ముఖాముఖి సమావేశం కూడా నిర్వహించారు. సిఎస్ఐఆర్ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సుమన్ మల్లిక్ అధ్యక్షత వహించగా సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ శ్రీ సి.బి.సింగ్ సహాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రెండు బహిరంగా చర్చా కార్యక్రమాలు నిర్వహించారు.
‘‘మీరు చేపట్టే పరిశోధన/ప్రాజెక్ట్ సామాజిక ప్రభావం’’ అనే అంశంపై సైన్స్ ఎగ్జిబిషన్, పోస్టర్ ప్రెజెంటేషన్ పోటీ నిర్వహించారు. ఈ పోటీలు పలువురు విద్యార్థులు, అతిథులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ సైన్స్ పబ్లిషర్లు పాల్గొని స్టాల్స్ ఏర్పాటు చేశారు. విలీ, క్లారివేట్, ఎల్సెవీర్, అమెరికన్ కెమికల్ సొసైటీ (ఎసిఎస్), ఎసిఎస్ ఇంటర్నేషనల్ ఇండియా, సైఫైండర్, గ్రామర్లీ, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ (ఐఓపి) వంటి ప్రముఖ సైన్స్ పబ్లిషర్లు పాల్గొన్నారు. సిఎస్ఐఆర్-సిఆర్ఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ మనోరంజన్ పాండా ప్రసంగించి పోస్టర్ పోటీలో గెలిచిన వారికి బహుమతులు అందచేశారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానాల్లో 800 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్.కె.ప్రసన్న వందన సమర్పణ చేశారు.
వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాలు 2023 సెప్టెంబరు 16వ తేదీన ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో భాగంగా సుస్థిర అభివృద్ధికి ప్రత్యేకించి సుస్థిర ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అభివృద్ధికి సైన్స్ డిప్లొమసీ ఏ విధంగా దోహదపడుతుంది అనే అంశం ఆధారంగా ‘‘సుస్థిర అభివృద్ధికి సైన్స్ డిప్లొమసీ’’ అనే కార్యక్రమం నిర్వహించారు. భారత, భూటాన్ లలో జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిప్ ఏకర్ మాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న మాజీ సైన్స్ డిప్లొమాట్ డాక్టర్ భాస్కర్ బాలకృష్ణన్ ప్రసంగించారు. సిఎస్ఐఆర్ లోని ఇంటర్నేషనల్ ఎస్ అండ్ టి అఫైర్స్ డైరెక్టరేట్ హెడ్ డాక్టర్ రామస్వామి బన్సాల్; జెఎన్ యు సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సైన్స్ పాలసీ చైర్మన్ ప్రొఫెసర్ మాధవ్ గోవింద్; ఇండో-జర్మన్ ఎస్ అండ్ టి సెంటర్ డైరెక్టర్ శ్రీ ఆర్.మాధవ్; సిఇఎఫ్ఐపిఆర్ఏ మాజీ డైరెక్టర్, సిఎస్ఐఆర్ హెడ్ డాక్టర్ పూర్ణిమా రూపాల్; నెదర్లాండ్స్ రాయబార కార్యాలయంలో ఇన్నోవేషన్ కౌన్సెలర్ ఫర్ ఇండియా డాక్టర్ ధోయా స్నైజ్డర్స్ నిపుణులైన ప్రసంగికులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడబ్ల్యుఓఎల్ కార్యక్రమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారాన్ని సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ ఒడబ్ల్యుఓఎల్ చైర్మన్ డాక్టర్ యోగేష్ సుమన్ ఆవిష్కరించగా సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ ఒడబ్ల్యుఓఎల్ సైంటిస్ట్, కోఆర్డినేటర్ డాక్టర్ మనీష్ మోహన్ గోరె వందన సమర్పణ చేశారు.
సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ గురించి
భారత ప్రభుత్వానికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేస్తున్న సిఎస్ఐఆర్ అనుబంధ లేబరేటరీల్లో ఒకటి సిఎస్ఐఆర్-నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్). సైన్స్ కమ్యూనికేషన్; ఎస్ టిఐ కేంద్రబిందువుగా జరిగే విధానపరమైన పరిశోధన, అధ్యయన వ్యవహారాల్లో ఈ సంస్థ స్పెషలైజ్ చేసింది. వివిధ జర్నల్స్, పుస్తకాలు, మాగజైన్లు, న్యూస్ లెటర్లు, సైన్స్ అండ్ టెక్నాలజీపై నివేదికలు ఈ సంస్థ ప్రచురిస్తుంది. సైన్స్ కమ్యూనికేషన్, సైన్స్ పాలసీ, ఇన్నోవేషన్ సిస్టమ్స్, సైన్స-సొసైటీ ఇంటర్ ఫేస్, సైన్స్ డిప్లొమసీలపై పరిశోధన కూడా నిర్వహిస్తుంది.
మరింత సమాచారం కోసం https://niscpr.res.in/ చూడండి. @CSIR-NIScPRలో మమ్మల్ని ఫాలో అవండి.
ఫొటో క్యాప్షన్లు...
- కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు; సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ ఒడబ్ల్యుఓఎల్ బ్రోచర్ విడుదల
- ఎన్ఐఎస్ సిపిఆర్ ఒడబ్ల్యుఓఎల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న కేంద్ర ఎస్ అండ్ టి శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
- ఎన్ఐఎస్ సిపిఆర్ ఒడబ్ల్యుఓఎల్ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతులు 2022 ప్రకటిస్తున్న సిఎస్ఐఆర్ డిజి డాక్టర్ ఎన్. కలైసెల్వి
- ఎస్ అండ్ టి మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను ఆహ్వానిస్తున్న సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజన్న అగర్వాల్
- గ్రామస్థాయి అన్వేషణల కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సిఎస్ఐఆర్ మాజీ డిజి డాక్టర్ శేఖర్.సి.మండె (ఎడమ), ఉన్నత్ భారత్ అభియాన్ జాతీయ సమన్వయకర్త ప్రొఫెసర్ వీరేంద్ర కుమార్ విజయ్ (కుడి)
- పిక్ 5 : ఎన్ఐఎస్ సిపిఆర్ ఒడబ్ల్యుఓఎల్ నిర్వహణలోని ఇండియా స్టార్టప్ కార్యక్రమం
- ఎన్ఐఎస్ సిపిఆర్ ఒడబ్ల్యుఓఎల్ నిర్వహణలోని స్టూడెంట్-సైన్స్ కనెక్ట్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన తోలుబొమ్మలాట
- ఎన్ఐఎస్ సిపిఆర్ ఒడబ్ల్యుఓఎల్ సైన్స్ కమ్యూనికేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
- సైన్స్ పాలసీ అండ్ డిప్లొమసీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని తన అభిప్రాయాలు పంచుకుంటున్న భారత, భూటాన్ దేశాల జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిప్ ఏకర్ మాన్
***
(Release ID: 1959314)
Visitor Counter : 140