హోం మంత్రిత్వ శాఖ
లోక్ సభలో నారీ శక్తి వందన్ అధినియం పై చర్చలో పాల్గొన్న కేంద్ర హోం,, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
19 సెప్టెంబర్, 2023 భారత పార్లమెంటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది: ఈ రోజున వినాయక చవితి పర్వదినం
రోజున కొత్త పార్లమెంటు మొదటిసారిగా పనిచేసింది: ఇంకా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును సభలో
ప్రవేశపెట్టారు.
140 కోట్ల జనాభాలో 50 శాతం ఉన్న మహిళా శక్తికి అసలైన గౌరవం అందించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి నేను
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇప్పుడు ఈ దేశంలోని మహిళలు విధానాల్లో భాగస్వాములు కావడమే కాకుండా విధానాలను నిర్ణయించడంలో
కూడా దోహదపడతారు.
ఇటీవల జరిగిన జీ-20 సదస్సులో ప్రధాని మోదీ 'మహిళల నేతృత్వంలో అభివృద్ధి' అనే భావనను ప్రపంచం
ముందు ఉంచారు: ఈ బిల్లు ఆమోదంతో కొత్త శకం ప్రారంభమవుతుంది
మహిళా సాధికారత అనేది కొన్ని పార్టీలకు రాజకీయ ఎజెండా కావచ్చు, కానీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నాయకత్వంలోని ప్రభుత్వానికి మహిళా సాధికారత గుర్తింపుకు సంబంధించిన అంశం.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి మహిళల భద్రత, గౌరవం, భాగస్వామ్యం ప్రభుత్వానికి
ఊపిరి, ఆత్మగా నిలిచాయి.
భారతదేశంతో సంబంధం ఉన్న వ్యక్తులు మహిళలను బలహీనులు అని
Posted On:
20 SEP 2023 9:10PM by PIB Hyderabad
కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు లోక్ సభలో నారీ శక్తి వందన్ అధినియం పై చర్చలో పాల్గొన్నారు. శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, 2023 సెప్టెంబర్ 19 భారత పార్లమెంటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని, ఎందుకంటే ఈ రోజున వినాయక చవితి సందర్భంగా కొత్త పార్లమెంటు పనిచేయడం ప్రారంభించిందని, మహిళలకు చట్ట సభలలో రిజర్వేషన్ హక్కును కల్పించే దీర్ఘకాల పెండింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారని అన్నారు. 140 కోట్ల జనాభాలో 50 శాతం ఉన్న మహిళా శక్తిని నిజంగా గౌరవించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వు అవుతాయని అమిత్ షా తెలిపారు.
140 కోట్ల జనాభాలో 50 శాతం ఉన్న మహిళా శక్తిని నిజంగా గౌరవించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వు అవుతాయని అమిత్ షా తెలిపారు. ఈ బిల్లు ఆమోదంతో మహిళలు తమ హక్కుల కోసం చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి తెరపడనుంది. ఇటీవల జరిగిన జి-20 సదస్సులో ప్రధాని శ్రీ మోదీ "మహిళల నేతృత్వంలో అభివృద్ధి" అనే భావనను ప్రపంచం ముందు ఉంచారని, ఈ బిల్లు ఆమోదంతో, కొత్త శకం ప్రారంభమవుతుందని, ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలోని మహిళలు విధానాలలో భాగస్వాములు కావడమే కాకుండా విధానాలను నిర్ణయించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు.
మహిళా సాధికారత అనేది కొన్ని పార్టీలకు రాజకీయ ఎజెండా కావచ్చునని, కానీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వానికి మహిళా సాధికారత గుర్తింపునకు సంబంధించిన అంశమని శ్రీ అమిత్ షా అన్నారు.
2014లో 30 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారని, ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళల భద్రత, గౌరవం, భాగస్వామ్యం ప్రభుత్వానికి ఊపిరి, ఆత్మగా నిలిచాయి. 2014లో నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయ్యేనాటికి దేశంలో 70 కోట్ల మందికి తమ ఇళ్లలో బ్యాంకు ఖాతాలు లేవన్నారు. శ్రీ నరేంద్ర మోదీ జన్ ధన్ యోజనను ప్రారంభించి, బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు ఒక ప్రచారాన్ని ప్రారంభించారు, దీని ఫలితంగా 52 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరుచుకున్నాయి, వీటిలో 70 శాతం బ్యాంకు ఖాతాలు మహిళల పేరిట తెరుచుకున్నాయి. భారతదేశంతో సంబంధం ఉన్న వ్యక్తులు మహిళలను బలహీనులు అని పిలిచే తప్పు చేయరని ఆయన అన్నారు.
నేడు దేశంలో మహిళా సాధికారత జరిగిందని, అన్ని పథకాల డబ్బు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తోందని కేంద్ర హోం, , సహకార శాఖ మంత్రి అన్నారు. ఐదు దశాబ్దాలకు పైగా దేశాన్ని పాలించిన ప్రతిపక్ష పార్టీ హయాంలో దేశంలో 11 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు లేవన్నారు. పేదరిక నిర్మూలన కోసం నినాదాలు హోరెత్తినా పేదలకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. ఇంట్లో మరుగుదొడ్డి లేనప్పుడు చిన్న కూతురు, సోదరి, తల్లి ఎక్కువగా ఇబ్బంది పడతారని , ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తొలి ఐదు సంవత్సరాలలో 11.72 కోట్ల మరుగుదొడ్లను అందించడంతో తల్లులు, అక్కాచెల్లెళ్లు, కూతుళ్ల కు సాధికారత లభించిందని పేర్కొన్నారు. దేశంలోని 10 కోట్ల కుటుంబాలు పొగలో బతకాల్సి వస్తోందని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ 10 కోట్ల ఇళ్లకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించారని అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడు కోట్ల మందికి పైగా మహిళల పేర్లపై ఇళ్లను అందించినట్టు చెప్పారు. దేశంలో 12 కోట్ల ఇళ్లకు తాగునీరు లేదని, వాటికి కుళాయి నీటిని నరేంద్ర మోదీ అందించారని అమిత్ షా చెప్పారు. దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కొక్కరికి నెలకు ఐదు కిలోల ఉచిత ఆహార ధాన్యాలను అందించారని తెలిపారు. ప్రధాని మోదీ మూడు కోట్ల 18 లక్షల సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిచారని, మాతృవందన్ యోజన కింద 3 కోట్ల మంది మహిళలకు ప్రయోజనాలు కల్పించారని, సుమారు 26 వారాల ప్రసూతి సెలవులు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహిళా పైలట్ల సంఖ్య ఐదు శాతం ఉండగా, భారత్ లో అది 15 శాతంగా ఉందని, దీనిని సాధికారత అంటారని శ్రీ షా అన్నారు.
పురుషుల కంటే మహిళలే ఎక్కువ సాధికారత కలిగి ఉన్నారని, నిర్ణయాలు, విధాన నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యానికి ఈ బిల్లు దోహదపడుతుందని కేంద్ర హోం, , సహకార శాఖ మంత్రి అన్నారు. సామాజిక వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి, మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారిని గౌరవించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ "మహిళల నేతృత్వంలోని అభివృద్ధి" విజన్ ను నెరవేర్చడంలో సభ మొత్తం ఏకగ్రీవంగా, ఐక్యంగా ఉన్నట్టు ప్రపంచానికి సందేశం ఇవ్వడానికి ఈ రోజు మనకు ఒక అవకాశం లభించిందని తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి గత ప్రభుత్వాలు నాలుగుసార్లు ప్రయత్నించాయని అమిత్ షా చెప్పారు. 1996లో దేవెగౌడ నేతృత్వంలోని ప్రభుత్వం తొలిసారి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిందని, ఆ తర్వాత సీమా ముఖర్జీ నేతృత్వంలోని కమిటీకి ఇచ్చిందన్నారు. ‘కమిటీ కూడా తన నివేదిక ఇచ్చింది కానీ ఆ బిల్లు ఈ సభకు చేరలేదు. ఆ తర్వాత 1998లో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. అయితే ప్రతిపక్షాలు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి అనుమతించలేదు‘ అని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ రాజ్యసభలో సవరణ బిల్లును తీసుకువచ్చిందని, అక్కడ అది ఆమోదం పొందినా తర్వాత ఈ బిల్లు లోక్ సభలోకి రాలేకపోయిందని ఆయన అన్నారు.
ఈ కొత్త ఆరంభం ద్వారా రాజ్యాంగాన్ని సవరించి మహిళా శక్తికి రిజర్వేషన్లు కల్పించడానికి సభ్యులందరూ ఏకగ్రీవంగా పనిచేయాలని కేంద్ర హోం మంత్రి కోరారు. ప్రస్తుత నిబంధన ప్రకారం, పార్లమెంటుకు ఎన్నికయ్యే మూడు కేటగిరీల- జనరల్ (ఇందులో ఒబిసి), షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సభ్యులలో మహిళలకు మోదీ ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. ఈ రాజ్యాంగ సవరణ కింద ఆర్టికల్ 330 (ఎ), ఆర్టికల్ 332 (ఎ) ద్వారా మహిళా రిజర్వేషన్లు కల్పించినట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు మూడు కేటగిరీల్లో వర్టికల్ రిజర్వేషన్ కల్పించి మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు కేటాయించారు. డీలిమిటేషన్ కమిషన్ అనేది మన దేశ ఎన్నికల ప్రక్రియను నిర్ణయించే ఒక ముఖ్యమైన సంస్థ చట్టపరమైన నిబంధన అని, ఇది నియామకం ద్వారా జరుగుతుందని, కానీ పాక్షిక న్యాయపరమైన చర్యలు ఉన్నాయని శ్రీ షా అన్నారు. దీనికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వం వహిస్తారని, ఇందులో ఎన్నికల సంఘం ప్రతినిధి కూడా ఉంటారని చెప్పారు. రిజర్వు చేయాల్సిన మూడింట ఒక వంతు సీట్లను డీలిమిటేషన్ కమిషన్ ఎంపిక చేస్తుందని చెప్పారు.కమిషన్ ప్రతి రాష్ట్రానికి వెళ్లి బహిరంగ విచారణలు జరిపి పారదర్శకంగా పాలసీని నిర్ణయిస్తుంది. డీలిమిటేషన్ కమిషన్ తీసుకురావడం వెనుక ఉన్న ఏకైక లక్ష్యం పారదర్శకత తీసుకురావడమేనని ఆయన అన్నారు. ఈ కమిషన్ ఏర్పాటులో ఎలాంటి జాప్యం జరగదని, ఎన్నికల తర్వాత జనాభా గణన, డీలిమిటేషన్ రెండూ జరుగుతాయని, త్వరలోనే మూడింట ఒక వంతు మహిళా ఎంపీలు ఈ సభలో కూర్చొని దేశ భవిష్యత్తును నిర్ణయించే రోజు వస్తుందని ఆయన అన్నారు.
దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి మనస్ఫూర్తిగా కృషి చేశారని శ్రీ అమిత్ షా అన్నారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ తన తొలి ప్రసంగంలో తమది దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, మహిళల ప్రభుత్వమని చెప్పారని గుర్తు చేశారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్, నీరు, మందులు, గ్యాస్ సిలిండర్లు, ఆహార ధాన్యాలు అందించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిందని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్నడూ ఓబీసీని ప్రధానిని చేయలేదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లుకు మద్దతివ్వాలని కేంద్ర హోం మంత్రి కోరారు.
***
(Release ID: 1959242)
Visitor Counter : 204