వ్యవసాయ మంత్రిత్వ శాఖ

భారతీయ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు: రైతుల కోసం కొత్త చొరవ (గేమ్ లను ఛేంజింగ్ ఇనిషియేటివ్స్ )ను ఆవిష్కరించిన వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఒఎ అండ్ ఎఫ్ డబ్ల్యు)


కెసిసి ఘర్ ఘర్ అభియాన్, కిసాన్ రిన్ పోర్టల్, విండ్స్ మాన్యువల్ ను సంయుక్తంగా ఆవిష్కరించిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

ఘర్ ఘర్ కెసిసి అభియాన్ విజయవంతానికి బ్యాంకుల పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ హామీ

వరి, గోధుమ పంటల ఉత్పత్తికి వాస్తవ కాల (రియల్ టైమ్) అంచనాను ప్రశంసించిన శ్రీమతి సీతారామన్: ఈ అంచనాను పప్పు ధాన్యాలు, (దల్హాన్) , నూనెగింజలు (తిల్హాన్) పంటలకు విస్తరించాలని పిలుపు

వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానం, పారదర్శకత ముఖ్యం: ఈ దిశగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంది: శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

మహమ్మారి సమయంలో కూడా ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి వ్యవసాయం, గ్రామీణ రంగం కారణం: వ్యవసాయ మంత్రి

Posted On: 19 SEP 2023 6:49PM by PIB Hyderabad

రుణాలు (కెసిసి అండ్ ఎం ఐ ఎస్ ఎస్) , పంటల బీమా (పిఎంఎఫ్ బివై/ ఆర్ డబ్ల్యు బి సి ఐ ఎస్) పై దృష్టి సారించిన  చొరవలను ఈ రోజు ఇక్కడ ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ సంయుక్తంగా ఆవిష్కరించారు.  కె సి సి రిన్ పోర్టల్ (కెఆర్ పి ), కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను దేశం లోని ప్రతి రైతుకూ విస్తరించే ఉద్దేశంతో కెసిసి ఘర్ ఘర్ అభియాన్, వాతావరణ సమాచార నెట్ వర్క్ డేటా సిస్టమ్స్ (డబ్ల్యూ ఐ ఎన్ డి ఎస్ -విండ్స్) పై మాన్యువల్ అనే మూడు చొరవ లను వ్యవసాయ , రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, ఆర్థిక సమ్మిళితాన్ని పెంచడం, డేటా వినియోగాన్ని పెంచడం, దేశవ్యాప్తంగా రైతుల జీవితాలను మెరుగుపరచడం ఈ చొరవల ప్రధాన ఉద్దేశం.

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ప్రధానోపన్యాసం చేస్తూ, ఘర్ ఘర్ కెసిసి క్యాంపెయిన్ విజయవంతానికి బ్యాంక్ ల నుంచి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు కె సి సి పథకం కింద సులభంగా స్వల్పకాలిక రుణాలను అందించడానికి , ఈ పథకంలో వారి చేరికకు భరోసా ఇవ్వడానికి తగినన్ని నిధులను కేటాయించిందని ఆమె చెప్పారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్ బివై) ను విజయవంతంగా అమలు చేసినందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖను ఆర్థిక మంత్రి అభినందించారు. రూ.29 వేల కోట్ల ప్రీమియం చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.1,40,000 కోట్ల బీమా మొత్తాన్ని రైతులకు అందించామని తెలిపారు. వరి, గోధుమ పంటల ఉత్పత్తికి వాస్తవ కాల అంచనా వేయాలని, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలకు ఈ అంచనాను విస్తరించాలని, తద్వారా అవసరమైతే వాటి దిగుమతికి మెరుగైన ప్రణాళికను రూపొందించాలని కోరారు. పంటల రియల్ టైమ్ అంచనా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని, పంట సీజన్ లో రైతులకు సరైన ధరలకు భరోసా ఇస్తుందని ఆర్థిక మంత్రి అన్నారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులను పూర్తిస్థాయిలో ఆటోమేషన్ చేయాలని, ఈ బ్యాంకుల రుణ మంజూరు, రుణ పంపిణీ మధ్య అంతరాన్ని అధ్యయనం చేయడానికి ఆర్థిక సేవల విభాగాన్ని ఆదేశించాలని సీతారామన్ పిలుపునిచ్చారు.

 

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ తన ప్రసంగంలో,  ప్రస్తుత ప్రభుత్వంలో వ్యవసాయం , గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇచ్చిన ప్రాముఖ్యతను వివరించారు. 2013-14లో రూ.23,000 కోట్లుగా ఉన్న వ్యవసాయ శాఖ బడ్జెట్ 2023-24 నాటికి రూ.1,25,000 కోట్లకు పెరిగిందన్నారు. విండ్స్ మాన్యువల్ గురించి మంత్రి మాట్లాడుతూ, రైతులు తమ పంటకు సరైన సమయంలో సరైన ప్రాధాన్యత ఇవ్వడానికి రియల్ టైమ్ వాతావరణ సమాచారాన్ని హామీ ఇవ్వడమే దీని ఉద్దేశమని అన్నారు. వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానం, పారదర్శకత ముఖ్యమని, ఈ దిశగా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టిందని తోమర్ అన్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద సుమారు 9 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని, కెసిసి ఘర్ ఘర్ అభియాన్ లక్ష్యం ఇంకా కెసిసి పథకానికి అనుసంధానించబడని సుమారు 1.5 కోట్ల మంది లబ్ధిదారులను కనెక్ట్ చేయడమేనని వ్యవసాయ మంత్రి తెలియజేశారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా రైతులకు సుమారు 2 కోట్ల కెసిసిలను అందించినందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు , బ్యాంకులకు శ్రీ తోమర్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలోనూ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించింది వ్యవసాయం, గ్రామీణ రంగమేనని మంత్రి ఉద్ఘాటించారు.

 

శ్రీ రితేష్ చౌహాన్, జెఎస్ (క్రెడిట్) అండ్ సి ఇ ఒ , పిఎంఎఫ్ బి వై కొత్త చొరవలపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. సాంకేతిక జోక్యాల ఫలితంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్ బి వై ) ఈ ఏడాది రికార్డు స్థాయిలో నమోదు అయిందని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ మంత్రులు శోభా కరంద్లాజే, శ్రీ కైలాష్ చౌదరి, వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా, కార్యదర్శి డిఎఫ్ఎస్ ఎస్ వివేక్ జోషి, ఒఎస్.డి (క్రెడిట్) శ్రీ అజిత్ కుమార్ సాహు, సి ఇ ఒ -పిఎంఎఫ్ బి వై శ్రీ రితేష్ చౌహాన్, నాబార్డు చైర్మన్ షాజీ కెవి , అనుబంధ శాఖలు, వ్యవసాయ రంగానికి చెందిన అనేకమంది ఇతరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

రైతులకు సుస్థిర , రెట్టింపు ఆదాయ లక్ష్యంతో, వ్యవసాయానికి సృజనాత్మకత , సమర్థవంతమైన సేవలను అందించడానికి భారత ప్రభుత్వ అంకిత భావాన్ని ఈ ప్రారంభ కార్యక్రమం ప్రముఖంగా చెబుతోంది.  కిసాన్ రిన్ పోర్టల్(కెఆర.పి) ), డోర్ టు డోర్ కేసీసీ క్యాంపెయిన్,  విండ్స్ మాన్యువల్ వంటి కార్యక్రమాలు రైతుల శ్రేయస్సు, ఆవిష్కరణలు, టెక్నాలజీ ఇన్ఫ్యూషన్, ఆబ్జెక్టివ్ సర్వీస్ డెలివరీ పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. దేశవ్యాప్తంగా రైతాంగానికి వ్యవసాయ మార్పు, సుస్థిర ఆర్థిక వృద్ధి లక్ష్యంగా ఈ ప్రయత్నం ఉంటుంది.

 

 నేపథ్యం

 

కిసాన్ రిన్ పోర్టల్(కెఆర్.పి))

 

ఎంఒఎ అండ్ ఎఫ్ డబ్ల్యు , ఆర్థిక సేవల విభాగం (డిఎఫ్ఎస్), పశుసంవర్ధక,  పాడి పరిశ్రమ విభాగం (డిఎహెచ్ అండ్ డి), మత్స్య శాఖ (డి ఒఎఫ్), ఆర్ బి ఐ, నాబార్డ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కె ఆర్ పి కిసాన్ క్రెడిట్ కార్డు (కెసిసి) కింద రుణ సేవల ప్రాప్యతను సులభతరం చేస్తుంది. మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెంటేషన్ స్కీమ్ (ఎం ఐ ఎస్ ఎస్ ) ద్వారా సబ్సిడీ వ్యవసాయ రుణాలు పొందేందుకు కూడా రైతులకు ఇది తోడ్పడుతుంది.

 

కె ఆర్ పి పోర్టల్ ఇంటిగ్రేటెడ్ హబ్ గా పనిచేస్తుంది, రైతు డేటా, రుణ పంపిణీ స్పెసిఫికేషన్, వడ్డీ రాయితీ క్లెయిమ్ లు,  పథకం వినియోగ పురోగతి సమగ్ర వీక్షణను అందిస్తుంది. బ్యాంకులతో అంతరాయం లేని ఏకీకరణను పెంపొందించడం ద్వారా, ఈ మార్గదర్శక పోర్టల్ క్రియాశీల విధాన జోక్యం, వ్యూహాత్మక మార్గదర్శకత్వం,  మరింత కేంద్రీకృత , సమర్థవంతమైన వ్యవసాయ రుణం , వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవడానికి అనుకూల మెరుగుదలను అనుమతిస్తుంది.

 

ఇంటింటికీ  కె సి సి క్యాంపెయిన్:

 

ఈ కార్యక్రమం "ఘర్ ఘర్ కెసిసి అభియాన్" ను కూడా ప్రారంభిస్తుంది. సార్వత్రిక ఆర్థిక సమ్మిళితం పట్ల ఎంఒఎ అండ్ ఎఫ్ డబ్ల్యు నిబద్ధతను ఈ ప్రచారం నొక్కిచెబుతుంది, ప్రతి రైతుకు వారి వ్యవసాయ కార్యకలాపాలను నడిపించే రుణ సౌకర్యాలు నిరాటంకంగా లభ్యమయ్యేలా చేస్తుంది. 2023 అక్టోబర్ 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఈ క్యాంపెయిన్ జరగనుంది.

 

పి ఎం.కిసాన్ డేటాబేస్‌కు వ్యతిరేకంగా కె సి సి ఖాతాదారుల డేటాను ఎంఒఎ అండ్ ఎఫ్ డబ్ల్యు  జాగ్రత్తగా ధృవీకరించింది. పి ఎం.కిసాన్  డేటాబేస్‌తో సరిపోలిన ఖాతాదారులను పి ఎం.కిసాన్   లబ్ధిదారులు అయినప్పటికీ, కె సి సి ఖాతాలు లేని వారిని గుర్తించింది. నాన్ కెసిసి ఖాతా లేని పిఎం కిసాన్ లబ్దిదారులను చేరుకోవడంలో , అర్హులైన పిఎం కిసాన్ లబ్దిదారులలో కెసిసి ఖాతాల సంతృప్తతను పెంపొందించడంలో ఈ ప్రచారం కీలక పాత్ర పోషిస్తుంది.

 

3. విండ్స్ మాన్యువల్ ఆవిష్కరణ

 

తాలూకా/బ్లాక్ , గ్రామ పంచాయితీ స్థాయిలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ,  రెయిన్ గేజ్ ల నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడానికి వెదర్ ఇన్ఫర్మేషన్ నెట్ వర్క్ డేటా సిస్టమ్స్ (విండ్స్) చొరవ ఒక మార్గదర్శక ప్రయత్నంగా నిలుస్తుంది. ఈ చొరవ హైపర్-లోకల్ వాతావరణ డేటా బలమైన డేటాబేస్ ను సృష్టిస్తుంది, వివిధ వ్యవసాయ సేవలకు మద్దతు ఇస్తుంది.

 

ఈ రోజు ప్రారంభించబడిన ఈ కాంప్రహెన్సివ్ విండ్స్ మాన్యువల్ పోర్టల్ పనితీరు, డేటా ఇంటర్ ప్రిటేషన్ , సమర్థవంతమైన వినియోగం గురించి వాటాదారులకు లోతైన అవగాహనను అందిస్తుంది.

విండ్స్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేయడం,  ఏకీకృతం చేయడం, పారదర్శక ,ఆబ్జెక్టివ్ డేటా పరిశీలన ,ప్రసారాన్ని పెంపొందించడంలో  రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గనిర్దేశం చేస్తుంది. మెరుగైన పంట నిర్వహణ, వనరుల కేటాయింపు, ఎండ్ రిస్క్ మిటిగేషన్ కోసం వాతావరణ డేటాను ఉపయోగించుకోవడంలో ఇది ఆచరణాత్మక అంతర్దృష్టులను కూడా అందిస్తుంది.

 

***



(Release ID: 1958957) Visitor Counter : 163


Read this release in: English , Urdu , Hindi , Marathi