వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ఈ-నామ్ 2.0 మరియు వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలపై జాతీయ వర్క్‌షాప్


ఈ-నామ్ లో అనుసంధానం కోసం 28 కొత్త మండీలను ఇటీవల ఆమోదించడం తో మొత్తం ఏ పీ ఎం సీ ల సంఖ్య 1389 కి చేరింది: శ్రీ మనోజ్ అహుజా

ఉత్పత్తి నాణ్యతకు సంబంధించిన సమాచారం కొనుగోలుదారుకు చాలా ముఖ్యమైనది, అలాగే అమ్మకందారులకు వస్తువుల ధరలు అంతే ముఖ్యమైనవి: శ్రీ అహుజా

మొత్తం వ్యవసాయ విలువ గొలుసును సమర్థవంతంగా తయారు చేయాలి మరియు వ్యర్థాలను తగ్గించాలి: వ్యవసాయ కార్యదర్శి

Posted On: 19 SEP 2023 6:08PM by PIB Hyderabad

23 రాష్ట్రాలు మరియు 4 కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకొని 2023 ఆగస్టు 31 వరకు 1361 ఏ పీ ఎం సీ లు ఈ-నామ్ లో ఏకీకృతం చేయబడ్డాయని వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా ఈరోజు ఇక్కడ తన ప్రసంగంలో మాట్లాడుతూ తెలిపారు. ఇక్కడ మొత్తం 209 వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం జరుగుతోంది. ఈ-నామ్ ద్వారా లావాదేవీలు జరుపుతున్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మరియు కొనుగోలుదారులు/వ్యాపారులకు బహుముఖ ప్రయోజనాలను అందించడానికి దూరదృష్టితో కూడిన వ్యవస్థ. ఈ-నామ్ను మరింత బలోపేతం చేసేందుకు, మొత్తం మండీల సంఖ్యను 1389కి చేర్చేందుకు ఏకీకరణ కోసం 28 కొత్త మండీలు ఇటీవల ఆమోదించబడ్డాయి.  ఈ-నామ్ వాటాదారుల అభివృద్ధి కి సరైన సమయంలో కీలక సమాచారాన్ని అందించడం యొక్క ప్రాముఖ్యతను వ్యవసాయ శాఖ కార్యదర్శి హైలైట్ చేశారు. సమాచార అసమానతను తొలగించడం ముఖ్యమని,వస్తువుల ధరలు అమ్మకందారులకు కీలకమైనందున, ఉత్పత్తి నాణ్యతకు సంబంధించిన సమాచారం కొనుగోలుదారుకు అంతే కీలకమని ఆయన పేర్కొన్నారు.

 

ఆర్థిక దృక్కోణంలో, మొత్తం వ్యవసాయ విలువ గొలుసును సమర్థంగా మార్చాలని మరియు వృధాను తగ్గించాలని శ్రీ అహుజా అన్నారు. వ్యవసాయ కార్యదర్శి వర్క్‌షాప్ నిర్వహణ వెనుక కృషిని అభినందించారు.  ఈ-నామ్ ప్లాట్‌ఫారమ్‌ అందించిన వర్క్‌షాప్ తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ మరియు తమిళనాడు రాష్ట్రాల వ్యవసాయ మార్కెటింగ్ బోర్డుల ప్రదర్శనలు వాటాదారులందరూ తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకున్నందుకు హృదయపూర్వకంగా అభినందించారు.

 

శ్రీ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్,అడిషనల్ సెక్రటరీ, మార్కెటింగ్ డివిజన్, అగ్రికల్చర్ & ఫార్మర్స్ వెల్ఫేర్, మాట్లాడుతూ, ఈ-నామ్ 2.0 అనేది ఇప్పటికే ఉన్న ఈ-నామ్ యొక్క అధునాతమైన వెర్షన్ అని, ఇందులో రాష్ట్ర చట్టాలలో సంస్కరణలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ-నామ్ 2.0 విజయం చాలా ముఖ్యమైనదని అన్నారు.

 

చర్చు నారీ ఉర్జా ఎఫ్ పీ సీ ఎల్ (జార్ఖండ్), మాంగాని సిటీ కన్సార్టియం (తమిళనాడు) & జైవిక్ శ్రీ ఎఫ్ పీ సీ ఎల్, కోరాపుట్ (ఒడిశా)  కూడా ప్రదర్శనలు ఇచ్చాయి, అక్కడ వారు ఈ-నామ్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడంలో తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఈమూడు ఎఫ్ పి ఓ లూ వరుసగా రూ. 1.25 కోట్లు, రూ. 1.44 కోట్లు మరియు రూ. 2.68 కోట్ల వ్యాపారంతో ఇ-నామ్‌ని నిరంతరం ఉపయోగించుకుంటున్నాయి.

 

ఈ-నామ్ 2.0 మరియు వ్యవసాయ సంస్కరణలపై జరిగిన ఈ జాతీయ వర్క్‌షాప్‌లో ప్రజెంటేషన్ మరియు చర్చా-సెషన్‌లో ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు, కమోడిటీ ఎక్స్ఛేంజీలు, స్టేట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డులు మరియు మార్కెటింగ్ మరియు ఇన్స్పెక్షన్ డిపార్ట్‌మెంట్ నుండి వివిధ సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

 

నేపథ్య సమాచారం:

 

నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) అనేది దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్ వాణిజ్య పోర్టల్, దీనిని 14 ఏప్రిల్ 2016న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు, ఇది ఇప్పటికే ఉన్న ఏ పీ ఎం సీ మండీలను నెట్‌వర్క్ చేస్తుంది.ప్రస్తుత ఏ పీ ఎం సీలకు వున్న మౌలిక సదుపాయాలను అత్యధిక స్థాయిలో ఉపయోగించుకుంటూ వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఏకీకృత జాతీయ మార్కెట్‌ను రూపొందించడానికి  ఈ వాణిజ్య పోర్టల్ కృషి చేస్తుంది. భారత ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో "చిన్న రైతుల అగ్రిబిజినెస్ కన్సార్టియం (ఎస్ ఎఫ్ ఏ సీ)" ద్వారా పోర్టల్ నిర్వహించబడుతుంది.

 

ఈ-నామ్ సాంకేతిక జోక్యాలైన డిజిటల్ వెయిబ్రిడ్జ్ మరియు వెయిటింగ్ స్కేల్ ద్వారా బరువులో ఖచ్చితత్వం; ముందస్తు విశ్లేషణ పరికరాల ద్వారా అంచనా వేయడంలో ఖచ్చితత్వం; వస్తువుల ధరలపై నిజ-సమయ ఆన్‌లైన్ సమాచారం, ఎక్కువ మంది కొనుగోలుదారులు/విక్రేతలకు ప్రాప్యత మరియు వాణిజ్యంలో పారదర్శకత (ఆన్-లైన్ వేలం విధానం కారణంగా) ఫలితంగా పోటీ బిడ్డింగ్ మరియు మెరుగైన ధర ఆవిష్కరణ; బహుళ ఆన్‌లైన్ చెల్లింపు మోడ్‌ల ద్వారా చెల్లింపులో పారదర్శకత మరియు డిజిటలైజేషన్ వంటి సాంకేతికత ల ద్వారా మొత్తం ఏ పీ ఎం సీ మండి కార్యకలాపాలలో మెరుగైన సామర్థ్యం  తీసుకురాగలిగింది.

****



(Release ID: 1958911) Visitor Counter : 142


Read this release in: Urdu , English