భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ - అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా 79 ప్రదేశాలలో మెగా బీచ్ క్లీన్-అప్ డ్రైవ్‌లు నిర్వహించిన భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ

Posted On: 17 SEP 2023 5:49PM by PIB Hyderabad

అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని 16 సెప్టెంబర్ 2023న దేశంలోని 8 తీరప్రాంత రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 79 స్థానాల్లో మెగా సిటిజన్ నేతృత్వంలో భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎస్) బీచ్ క్లీన్-అప్ డ్రైవ్‌లను నిర్వహించింది, ఇది 17 సెప్టెంబర్ 2023న కూడా కొనసాగింది. తీర ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి పౌరులను ప్రోత్సహించడం, సముద్రాలు, జలమార్గాలను సంరక్షించడం గురించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు భారీ ఎత్తున దేనిలో పాలుపంచుకున్నారు. దాదాపు 18 టన్నుల వ్యర్థాలను శుభ్రం చేయడంలో ఐదు వేల మందికి పైగా వాలంటీర్లు సహాయం చేశారు. 12 ఎంపిక చేసిన ప్రదేశాలలో, బీచ్ క్లీన్-అప్ డ్రైవ్‌తో పాటుగా, ఎంఓఈఎస్ సేవల గురించి మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 

2033 స్వచ్ఛ్ సాగర్ సురక్షిత సాగర్ బీచ్ క్లీన్-అప్ ఐదు ఎంఓఈఎస్ ఇన్‌స్టిట్యూట్‌లు -ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కాయిన్), నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (ఎన్సిసిఆర్), నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ అండ్ పోలార్ రీసెర్చ్ (ఎన్సిపిఓఆర్), సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ (సిఎంఎల్ఆర్ఈ), నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ (ఎన్సిఈఎస్ఎస్) ఆధ్వర్యంలో జరిగింది. అనేక మంది వాలంటీర్లు, ఎన్ జీ ఓల సమన్వయంతో ఈ మొత్తం కార్యక్రమం విజయవంతం అయింది. 

"జీవనోపాధి, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే వాతావరణం నియంత్రించడం కోసం మన సముద్రాలు మన మనుగడకు చాలా ముఖ్యమైనవి, ఇవి విలువైన వనరులకు నిలయంగా ఉన్నాయి. ఈ గ్రహం జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తున్నాయి.  అంతర్జాతీయ ఎంఓఈఎస్ కార్యదర్శి డాక్టర్ ఎం.రవిచంద్రన్ అన్నారు. సెప్టెంబరు 16, 2023న అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఆయన ఓజోన్ దినోత్సవాన్ని కూడా ప్రస్తావించారు.

అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మూడవ శనివారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. 2022లో, భారత ప్రభుత్వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ అంతర్-మంత్రిత్వ స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ (స్వచ్ఛమైన తీరం, సురక్షితమైన సముద్రం) ప్రచారాన్ని సమన్వయం చేసింది. స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ 2022 అనేది 75 రోజుల పాటు సాగిన ప్రచారం, ఇది తీరప్రాంతంలోని ప్రతి కిలోమీటరుకు 75 మంది వాలంటీర్లతో 75 బీచ్‌లను కవర్ చేస్తుంది, ఇది భారీ విజయవంతమైన సామూహిక ప్రజల భాగస్వామ్యం, అవగాహన కార్యక్రమం గా మార్చింది.

మత్స్యకారులు, తీరప్రాంత కమ్యూనిటీల కోసం ఎంఓఈఎస్ సేవలు (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, అంటే, ఇన్కాయిన్)లో సంభావ్య ఫిషింగ్ జోన్ అడ్వైజరీలు, ట్యూనా అడ్వైజరీలు, ఓషన్ స్టేట్ ఫోర్‌కాస్ట్‌లు, సునామీలు, తుఫానులు, ఉప్పెనలు మొదలైన హెచ్చరికలు ఉన్నాయి. మొబైల్ యాప్‌లు, ఎస్ఎంఎస్, వెబ్‌సైట్‌ల వంటి సరికొత్త డిజిటల్ కమ్యూనికేషన్ మోడ్‌ల ద్వారా సముద్ర సంబంధిత సమాచారం ప్రతిరోజూ 4 లక్షల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు అందుబాటులో ఉంటుంది. 

సెప్టెంబరు 16, 17 అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంఓఈఎస్ నిర్వహించిన బీచ్ క్లీన్-అప్ డ్రైవ్‌ల స్థానాలు :

 

క్రమ సంఖ్య 

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం 

బీచ్ 

ఎంఓఈఎస్ సంస్థ 

1

కేరళ 

అలప్పుజ

ఎన్సిసిఆర్ 

2

కొచ్చి 

3

తాయికడపురం 

సిఎంఎల్ఆర్ఈ 

4

పుతువైపె 

5

కోవలం 

ఎన్సిఈఎస్ఎస్ 

6

కొల్లం 

7

Andhra Pradesh

ఆర్కే 

ఎన్సిసిఆర్ 

8

శ్రీకాకుళం 

9

డొంకూరు 

ఇంకాయిస్ 

10

ఇద్దివానిపాలెం 

11

పెద్ద గంగళ్లవాని పేట 

12

పెద్ద కొవ్వాడ 

13

చింతపల్లి 

14

కె ముక్కం 

15

ఉప్పాడ 

16

ఆర్కే 

17

యారాడ 

18

ముత్యాలమ్మపాలెం 

19

పూడిమడక 

20

రాజయ్యపేట 

21

దానవాయిపేట 

22

ఉప్పాడ చేపల జెట్టి 

23

ఎన్టీఆర్ బీచ్ 

24

సిర్రా యానాం 

25

ఎస్ యానాం 

26

ఓడల రేవు 

27

వేములదీవి 

28

పేరుపాలెం 

29

హంసలదీవి 

30

చిన్నగొల్లపాలెం 

31

మంగినపూడి 

32

దిండి 

33

సూర్యలంక 

34

ఓడరేవు 

35

చింతల గారి పాలెం 

36

కొత్తపట్నం పల్లిపాలెం 

37

చెల్లమ్మగారి పాలెం 

38

అలగ్యపాలెం 

39

తుమ్మలపెంట 

40

ఇస్కపల్లిపాలెం 

41

మైపాడు 

42

ముత్యాలతోపు 

43

కృష్ణపట్నం 

44

తుపిలిపాలెం 

45

వాటెంబేడు 

46

గుజరాత్ 

వెరవల్ 

ఎన్సిసిఆర్ 

47

మాండవి 

48

డుమస్ 

49

Maharashtra

మహీం రేతి బందర్ 

50

అక్సా 

51

సాగర్ విహార్, వశి 

52

మిరామర్ 

53

Karnataka

రవీంద్రనాథ్ ఠాగూర్, కార్వార్ 

54

పానంబుర్ 

55

హొన్నవార్ 

56

Tamil Nadu

ఎల్లియోట్ 

57

కోవలం 

58

సిల్వర్ 

59

తిరువాన్మియూర్ 

60

కదపక్కం 

61

తొండి, పాలక్ బే 

62

రామేశ్వరం 

63

నాగపట్నం 

64

ఒడిశా 

పూరి 

65

గోపాలపూర్ 

66

చందీపూర్ 

67

పరదీప్ 

68

పశ్చిమ బెంగాల్ 

దీఘ 

69

సాగర్ దీవి 

70

లక్షద్వీప్ 

అగట్టి దీవి 

71

పుదుచ్చేరి 

చిన్న వీరంపట్నం 

72

కలాపేట్ 

73

ఆరోవిల్లె 

74

గోవా 

బొగ్మలో 

75

దక్షిణ గోవా కొల్వ 

ఎన్సిపిఓఆర్ 

77

ఉత్తర గోవా మిరామర్ 

78

అండమాన్, నికోబార్ 

కర్బీన్స్ కోవా 

ఎన్సిసి ఆర్ 

79

రంగ చాంగ్ 

****


(Release ID: 1958370) Visitor Counter : 172


Read this release in: English , Urdu , Hindi