వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వ్యవసాయ గణాంకాల కోసం ఏకీకృత పోర్టల్ www.upag.gov.in ని ప్రొఫెసర్ రమేష్ చంద్ ఈరోజు ప్రారంభించారు


ఈ ఏకీకృత పోర్టల్ వ్యవసాయ గణాంకాల కోసం భారతీయ వ్యవసాయ డేటా నిర్వహణను విప్లవాత్మకంగా మార్చే దిశగా ఒక ముందడుగు

ప్రొ. రమేష్ చంద్ మాట్లాడుతూ పోర్టల్ వాటాదారులకు నిజ-సమయ, విశ్వసనీయ మరియు ప్రామాణిక సమాచారంతో సాధికారతనిస్తుందని, మరింత ప్రతిస్పందించే మరియు సమర్థవంతమైన వ్యవసాయ విధానాలకు మార్గం సుగమం చేస్తుందని చెప్పారు.

వ్యవసాయ సమాచార వినియోగదారులకు సమాచార శోధన ఖర్చులు తగ్గటం మరియు సరళమైన మరియు విశ్వసనీయమైన, సూక్ష్మ మరియు ఆబ్జెక్టివ్ డేటాకు ప్రాప్యత ద్వారా ప్రయోజనం పొందుతారని చెప్పారు.

Posted On: 15 SEP 2023 5:52PM by PIB Hyderabad

నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రొఫెసర్ రమేష్ చంద్ ఈరోజు అధికారికంగా వ్యవసాయ గణాంకాల కోసం ఏకీకృత పోర్టల్  www.upag.gov.in ను ప్రారంభించారు. భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్లిష్ట పాలన సవాళ్లను పరిష్కరించడానికి ఇది ఒక సంచలనాత్మక చర్య. వ్యవసాయ రంగం లో డేటా నిర్వహణను క్రమబద్ధీకరించడానికి మరియు మెరుగుపరచడానికి రూపొందించిన ఈ వినూత్న ప్లాట్‌ఫారమ్, మరింత సమర్థవంతమైన మరియు ప్రతిస్పందించే వ్యవసాయ విధాన ఫ్రేమ్‌వర్క్ వైపు ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.

 

ఈ చొరవ కోసం పనిచేసిన బృందాన్ని ప్రొఫెసర్ రమేష్ చంద్ అభినందించారు. వ్యవసాయ డేటా నిర్వహణ రంగంలో ఇది పెట్టుబడిగా అభివర్ణిస్తూ ఇదో "దిగ్గజం" అని పేర్కొన్నారు.  అలాంటి చొరవ చాలా కాలం నుంచి బాకీ ఉందని ఈ "చిన్న శిశువు"  "గొప్ప ఏనుగు"గా మారే గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. వ్యవసాయంలో మైలురాయి మార్పులు తీసుకురావడానికి నూతన ఆలోచన ధోరణి అలవరుచుకోవాలి అని ఆయన  కోరారు. ఈ పోర్టల్ నిజ సమయంలో, విశ్వసనీయమైన మరియు ప్రామాణికమైన సమాచారంతో వాటాదారులకు సాధికారత ఇస్తుందని, మరింత ప్రతిస్పందించే మరియు సమర్థవంతమైన వ్యవసాయ విధానాలకు మార్గం సుగమం చేస్తుందని ప్రొఫెసర్ చంద్ పేర్కొన్నారు. డేటా ఎంత ఎక్కువ నిష్పాక్షికత తో ఉంటుందో విధాన రూపకల్పనలో వైక్తిక నిర్ణయం యొక్క పరిధి అంత తక్కువగా ఉంటుంది, ఇది స్థిరమైన, పారదర్శక మరియు పూర్తి సమాచారభరిత నిర్ణయాలకు దోహదపడుతుంది. డేటాలో $1 పెట్టుబడి $32 ప్రభావాన్ని సృష్టించిందని పరిశోధనలు సూచిస్తున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. పోర్టల్ డేటా విశ్వసనీయతను నిర్ధారించాలని ప్రొఫెసర్ చంద్ సూచించారు.

 

వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా ప్రస్తుతం డి ఎ & ఎఫ్ డబ్ల్యూ చేపడుతున్న కృషి నిర్ణయ మద్దతు వ్యవస్థ, రైతు నమోదు, పంటల సర్వే వంటి ఇతర కార్యక్రమాలను హైలైట్ చేశారు. పోర్టల్ ఒక ప్రజా ప్రయోజనంగా భావించబడుతుందని, ఇందులో వినియోగదారుల శోధన ఖర్చులు తగ్గటం, సరళమైన మరియు విశ్వసనీయమైన, సూక్ష్మ మరియు ఆబ్జెక్టివ్ డేటాకు ప్రాప్యత ద్వారా ప్రయోజనం పొందుతారని ఆయన పేర్కొన్నారు.

 

సీనియర్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ అడ్వైజర్, శ్రీ అరుణ్ కుమార్ ప్రస్తుతం డి ఎ & ఎఫ్ డబ్ల్యూలో డేటా ఖచ్చితత్వాన్ని పెంపొందించడానికి మరియు వ్యవసాయంలో డిజిటల్ డేటా నిర్వహణని మెరుగుపరచడానికి చేపట్టిన ప్రధాన కార్యక్రమాల గురించి వివరించారు.  డి ఎ & ఎఫ్ డబ్ల్యూ సలహాదారు శ్రీమతి రుచికా గుప్తా యూ పీ ఏజి పోర్టల్ యొక్క ముఖ్య లక్షణాలను పంచుకున్నారు. వ్యవసాయంలో ప్రామాణికమైన మరియు ధృవీకరించబడిన డేటా లేకపోవడం, విధాన నిర్ణేతలు, పరిశోధకులు మరియు వాటాదారులకు సమాచార నిర్ణయాలు తీసుకోవడం కష్టతరం కావటం వంటి డేటా సంబంధిత పాలన సవాళ్లను పరిష్కరించే ప్రయత్నంలో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ దీనిని అభివృద్ధి చేసింది. యూ పీ ఏజి పోర్టల్ డేటా సమగ్రత మరియు విశ్లేషణకు దాని సమగ్ర విధానంతో ఈ సమాచార ఆవరణాన్ని మార్చడానికి రూపొందించబడింది.

 

యూ పీ ఏజి పోర్టల్ ద్వారా పరిష్కరించబడిన ప్రధాన సవాళ్లు:

 

1. ప్రామాణిక డేటా లేకపోవడం: ప్రస్తుతం, వ్యవసాయ డేటా వివిధ వనరులలో చెల్లాచెదురుగా ఉంది మరియు తరచుగా వివిధ ఫార్మాట్‌లు మరియు యూనిట్లలో ప్రదర్శించబడుతుంది. యూ పీ ఏజి పోర్టల్ ఈ డేటాను ప్రామాణిక ఆకృతిలో ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇది వినియోగదారులకు సులభంగా ప్రాప్యత మరియు అర్థమయ్యేలా చేస్తుంది.

 

2. ధృవీకరించబడిన డేటా లేకపోవడం: ఖచ్చితమైన విధాన నిర్ణయాలకు విశ్వసనీయ డేటా కీలకం. యూ పీ ఏజి పోర్టల్ అగ్మార్క్నెట్ (Agmarknet) వంటి మూలాధారాల నుండి డేటా పరిశీలించబడుతుందని మరియు సకాలంలో అప్‌డేట్ చేయబడిందని నిర్ధారిస్తుంది, విధాన రూపకర్తలకు వ్యవసాయ ధరలపై ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.

 

3. విభజిత డేటా: ఏదైనా పంట యొక్క సమగ్ర వీక్షణను రూపొందించడానికి, ఉత్పత్తి, వాణిజ్యం మరియు ధరలతో సహా బహుళ అస్థిరతలను పరిగణించాలి. యూ పీ ఏజి పోర్టల్ వివిధ వనరుల నుండి డేటాను ఒకచోట చేర్చి, వ్యవసాయ వస్తువుల సమగ్ర అంచనాను అందిస్తుంది.

 

4. వివిధ ఫ్రీక్వెన్సీ అస్థిరతలు: వివిధ సమయాల్లో డేటా అప్‌డేట్‌లు ఆలస్యం మరియు అసమర్థతలకు కారణమవుతాయి. యూ పీ ఏజి పోర్టల్ డేటా మూలాధారాలతో నిజ-సమయ కనెక్టివిటీని అందిస్తుంది, పర్యవేక్షణ మరియు విశ్లేషణ కోసం అవసరమైన సమయం మరియు కృషిని తగ్గిస్తుంది.

 

యూ పీ ఏజి పోర్టల్ యొక్క ముఖ్య లక్షణాలు:

 

1. డేటా ప్రామణీకరణ: పోర్టల్ ధరలు, ఉత్పత్తి, విస్తీర్ణం, దిగుబడి మరియు వాణిజ్యంపై డేటాను ప్రామాణికం చేస్తుంది, ఇది ఒకే చోట అందుబాటులో ఉంటుంది, బహుళ మూలాల నుండి డేటాను సమీకరించవలసిన అవసరాన్ని తొలగిస్తుంది.

 

2. డేటా విశ్లేషణ: యూ పీ ఏజి పోర్టల్ అధునాతన విశ్లేషణలను నిర్వహిస్తుంది, ఉత్పత్తి పోకడలు, వాణిజ్య సహసంబంధాలు మరియు వినియోగ విధానాల వంటి అంతర్దృష్టులను అందజేస్తుంది, విధాన నిర్ణేతలకు సమాచార నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేస్తుంది.

 

3. సూక్ష్మ ఉత్పత్తి అంచనాలు: పోర్టల్ పెరిగిన ఫ్రీక్వెన్సీతో సూక్ష్మ ఉత్పత్తి అంచనాలను రూపొందిస్తుంది, వ్యవసాయ సంక్షోభాలకు వేగంగా స్పందించే ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచుతుంది.

 

4. వ్యవసాయ ఉత్పత్తుల ప్రొఫైల్ రిపోర్ట్‌లు: వ్యవసాయ ఉత్పత్తుల ప్రొఫైల్ రిపోర్ట్‌లు అల్గారిథమ్‌లను ఉపయోగించి తయారు చేయబడతాయి, వైక్తికత కనిష్టీకరించబడతాయి మరియు వినియోగదారులకు సమగ్ర అంతర్దృష్టులను అందిస్తాయి.

 

5. ప్లగ్ మరియు ప్లే: వినియోగదారులు తమ స్వంత నివేదికలను సిద్ధం చేయడానికి పోర్టల్ యొక్క డేటాను ఉపయోగించుకునే సౌలభ్యాన్ని కలిగి ఉంటారు, డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తారు.

 

యూ పీ ఏజి పోర్టల్  వ్యవసాయం కోసం డిజిటల్ పౌర మౌలిక సదుపాయాలలో కీలకమైన భాగం, ఇది వ్యవసాయ రంగం యొక్క వైవిధ్యాన్ని ఉపయోగించడం మరియు వృద్ధికి ఉత్ప్రేరకంగా డేటాను ఉపయోగించడం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ రంగంలో డేటా నిర్వహణను క్రమబద్ధీకరించడానికి వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ ద్వారా ఇది ఒక మార్గదర్శక కార్యక్రమం. విధాన రూపకర్తలు, పరిశోధకులు మరియు వాటాదారుల కోసం డేటా-ఆధారిత నిర్ణయాధికారాన్ని సులభతరం చేయడం, వ్యవసాయ వస్తువులపై నిజ-సమయం, ప్రామాణికమైన మరియు ధృవీకరించబడిన డేటాను అందించడం దీని లక్ష్యం. ఈ చొరవ భారతదేశ వ్యవసాయ రంగానికి వివేకం, పారదర్శకత మరియు చురుకుదనం తీసుకురావడానికి ఇ-గవర్నెన్స్ సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది.

 

***



(Release ID: 1957929) Visitor Counter : 241


Read this release in: English , Urdu , Hindi