మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌ లోని నవ్‌ సారి లో ఐ.సి.ఏ.ఆర్-సి.ఐ.బి.ఏ. రొయ్య రైతుల సమ్మేళనం-2023 రెండవ ఎడిషన్ను ప్రారంభించిన - కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా


వ్యవసాయ బీమా సంస్థ రూపొందించిన రొయ్యల పంటల బీమా పథకాన్ని ప్రారంభించిన – పురుషోత్తం రూపాలా


జీవనోపాధి అభివృద్ధి కోసం సి.ఐ.బి.ఏ. రూపొందించిన సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా నవ్‌ సారి ప్రాంతం లోని ఎస్.సి., ఎస్.టి., కేజ్ కల్చర్ లబ్ధిదారులు ఆర్జించిన 40.05 లక్షల రూపాయలను అందజేసిన - శ్రీ రూపాలా


సి.ఐ.బి.ఏ. ఉత్పత్తి చేసిన ఆసియా సీ బాస్ చేప విత్తనాలను రైతులకు అందజేసిన - శ్రీ రూపాలా

Posted On: 14 SEP 2023 5:26PM by PIB Hyderabad

గుజరాత్‌లోని నవ్‌సారి వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఐ.సి.ఏ.ఆర్-సి.ఐ.బి.ఏ. (ఐ.సి.ఏ.ఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్) రొయ్య రైతుల సమ్మేళనం-2023 రెండవ ఎడిషన్ను కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా ఈరోజు ప్రారంభించారు.  గుజరాత్‌ లోని కోస్తా జిల్లాలకు చెందిన దాదాపు 410 మంది ఆక్వా రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ పురుషోత్తం రూపాలా మాట్లాడుతూ, మత్స్య, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ధికి 20,050 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను ఆమోదించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు.   ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పి.ఎం.ఎం.ఎస్.వై) కింద ఐ.సి.ఏ.ఆర్-సి.ఐ.బి.ఏ. ద్వారా 25 కోట్ల రూపాయల వ్యయంతో రొయ్యల పెంపకం కోసం నేషనల్ జెనెటిక్ ఇంప్రూవ్‌మెంట్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడంకోసం “పెనియాస్ ఇండికస్ (ఇండియన్ వైట్ ష్రిమ్ప్)-మొదటి దశ జన్యు మెరుగుదల కార్యక్రమం” ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ఇది మార్గం సుగమం చేసింది.  రొయ్యలలో ఈ.హెచ్.పి వ్యాధి నియంత్రణకు ఈ.హెచ్.పి-క్యూరా-I చికిత్సను అభివృద్ధి చేసినందుకు సి.ఐ.బి.ఏ. శాస్త్రవేత్తలను కేంద్ర మంత్రి శ్రీ రూపాలా అభినందించారు.  ఈ చికిత్సా విధానాన్ని వీలైనంత త్వరగా రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు.  ఐ.సీ.ఏ.ఆర్-సి.ఐ.బి.ఏ. సహకారంతో వ్యవసాయ బీమా సంస్థ (ఏ.ఐ.సి) రూపొందించిన రొయ్య పంటల బీమా పథకాన్ని కూడా కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ఏ.ఐ.సి. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి గిరిజా సుబ్రమణియన్ సమక్షంలో ప్రారంభించారు. 

ఎన్.ఎఫ్.డి.బి. అందించే ప్రీమియం సబ్సిడీ మరియు ఎఫ్.ఎఫ్.పి.ఓ. కోసం సాంకేతిక సహకారంతో ఆక్వాకల్చర్ కోసం పంట బీమాను అమలు చేయడం కోసం - సి.ఐ.బి.ఏ. మరియు జాతీయ మత్స్య సంపద అభివృద్ధి మండలి (ఎన్.ఎఫ్.డి.బి) మధ్య అదేవిధంగా సి.ఐ.బి.ఏ. మరియు గుజరాత్ కు చెందిన మత్స్య రైతుల ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్.ఎఫ్.పి.ఓ) మధ్య రెండు అవగాహనా ఒప్పందాలు కుదిరాయి.  ఎన్.జి.ఆర్.సి-సి.ఐ.బి.ఏ. శాస్త్రవేత్తల సహకారంతో జీవనోపాధి అభివృద్ధి కోసం సి.ఐ.బి.ఏ. రూపొందించిన సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా నవ్ సారి ప్రాంతం లోని ఎస్.సి., ఎస్.టి., కేజ్ కల్చర్ లబ్ధిదారులు ఆర్జించిన 40.05 లక్షల రూపాయలను కూడా శ్రీ రూపాలా అందజేశారు.  సి.ఐ.బి.ఏ. కి చెందిన నవ్‌సారి-గుజరాత్ ప్రాంతీయ కేంద్రం గుజరాత్‌ లోని ఆక్వా రైతులతో పాటు, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలోని ఇతర లోతట్టు సెలైన్ ప్రాంతాలకు మంచి సేవలు అందిస్తోంది.  మొత్తం పశ్చిమ తీరానికి ఈ కేంద్రం పూర్తి స్థాయి పరిశోధనా కేంద్రంగా ఎదగడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను, సహాయాన్ని గుజరాత్ మత్స్య శాఖ అందించాలని శ్రీ రూపాలా సూచించారు.  ప్రత్యక్ష రొయ్యలు, ఫిన్ ఫిష్ జాతుల ప్రదర్శనను కేంద్ర మంత్రి శ్రీ రూపాలా సందర్శించారు.  సి.ఐ.బి.ఏ. హేచరీ ఈ రొయ్యలు, చేప విత్తనాలను ఉత్పత్తి చేసింది.  అలాగే సీ.ఐ.బీ.ఏ. ఉత్పత్తి చేసిన ఏషియన్ సీ బాస్ చేప విత్తనాలను కూడా కేంద్ర మంత్రి రైతులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో నవ్‌సారి నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు శ్రీ సి.ఆర్.పాటిల్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.  నవ్‌సారి లో ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఐ.సి.ఏ.ఆర్-సి.ఐ.బి.ఏ. ని ఆయన అభినందించారు.  సి.ఐ.బి.ఏ. నవ్‌సారి-గుజరాత్ ప్రాంతీయ కేంద్రానికి అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.  ఐ.సి.ఏ.ఆర్. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఫిషరీస్) డాక్టర్ జె. కె. జెనా ఈ సందర్భంగా మాట్లాడుతూ, 35,000 కోట్ల రూపాయల విలువైన భారతీయ మత్స్య ఎగుమతులలో 70 శాతం మేర ప్రధాన వస్తువుగా రొయ్యలు దోహదపడుతున్నాయని తెలియజేశారు.  అయితే, ఇటీవలి కాలంలో ఈక్వెడార్ నుండి ఎక్కువ పరిమాణంలో రొయ్యల సరఫరా కారణంగా, అంతర్జాతీయ మార్కెట్లలో భారతదేశంలో పండించిన రొయ్యల దిగుమతి తగ్గుముఖం పడుతోంది, ఇది స్థానిక స్థాయిలో మార్కెట్ ధరను కూడా తగ్గించింది.  అందువల్ల, ఈ సమస్యను అధిగమించడానికి మార్కెట్‌ లోనూ, అలాగే వ్యవసాయ రంగాల్లోనూ వినూత్న వ్యూహాలు అమలుచేయవలసిన అవసరం ఉంది.  అదేవిధంగా, ఎస్.పి.ఎఫ్. టైగర్ రొయ్యలు, జన్యుపరంగా మెరుగుపరచబడిన భారతీయ తెల్ల రొయ్యలు వంటి ఇతర జాతులతో ఉప్పునీటి ఆక్వాకల్చర్‌ ని వైవిధ్యపరచడం వల్ల రాబోయే రోజుల్లో భారతీయ రొయ్యల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

ప్రభుత్వ పధకాలను పొందడం కోసం భారత ప్రభుత్వ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సి.ఏ.ఏ) లో రొయ్యల ఫారాల నమోదుతో పాటు, రిజిస్ట్రేషన్‌ లో తీసుకొచ్చిన సంస్కరణల గురించి సి.ఏ.ఏ. సభ్య కార్యదర్శి డాక్టర్ వి. కృపా స్పష్టంగా తెలియజేశారు.  ఆక్వాకల్చర్‌ ను కూడా వ్యవసాయ కార్యకలాపంగా పరిగణించి, జాతీయ విపత్తు నిర్వహణ జాబితాలో వ్యవసాయ రంగంగా చేర్చేందుకు సి.ఏ.ఏ. కృషి చేస్తుందని ఆమె రైతులకు హామీ ఇచ్చారు.

ఐ.సి.ఏ.ఆర్-సి.ఐ.బి.ఏ. డైరెక్టర్, డాక్టర్ కుల్ దీప్ కె. లాల్ స్వాగతోపన్యాసం చేస్తూ, దేశంలో, ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో ఉప్పునీటి ఆక్వాకల్చర్ యొక్క ప్రస్తుత పరిస్థితి, రొయ్యల పెంపకం, వ్యాధుల పర్యవేక్షణ, వ్యవస్థలు, జాతుల వైవిధ్యం, ప్రత్యామ్నాయ ప్రోటీన్ వనరులతో ఫీడ్ ఫార్ములేషన్లలో సమస్యలను పరిష్కరించడంలో సి.ఐ.బి.ఏ. ప్రయత్నాలతో పాటు,  నియంత్రణ మార్గదర్శకాలు, అభివృద్ధి విధానాలు, సామాజికాభివృద్ధిని పెంపొందించడంలో సాంకేతికత వంటి అంశాలతో రొయ్యల రైతుల సమ్మేళనం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. 

ఈ సమావేశంలో భాగంగా నిర్వహించిన సాంకేతిక సదస్సులో రొయ్యల ఎగుమతి ప్రస్తుత దృష్టాంతం, తక్షణ అవకాశాలు, మైక్రోస్పోరిడియన్ (ఎంట్రోసైటోజూన్ హెపాటోపెనెయి (ఈ.హెచ్.పి) వల్ల కలిగే హెపాటోపాంక్రియాటిక్ మైక్రోస్పోరిడియోసిస్ (హెచ్.పి.ఎం) కి ప్రత్యేక సూచనతో వ్యాధి నివారణ, నిర్వహణ, రొయ్యల పెంపకం కోసం పంట బీమా, జన్యుపరంగా మెరుగుపరచిన భారతీయ తెల్ల రొయ్యల (పెనేయస్ ఇండికస్) అభివృద్ధి, మడ్‌క్రాబ్, ఆసియన్ సీ బాస్ చేపలతో ఉప్పునీటి ఆక్వాకల్చర్ యొక్క వైవిధ్యత గురించి వివరంగా చర్చించారు.

ఐ.సి.ఏ.ఆర్-సి.ఐ.బి.ఏ. డైరెక్టర్ డాక్టర్ కుల్ దీప్ కె లాల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పి.ఎం.ఎంఎస్.వై) కింద దేశంలో అభివృద్ధి చెందుతున్న వ్యాధి రోగకారకాలను నివేదించడానికి జల జంతు వ్యాధుల కోసం జాతీయ వ్యాధి నిఘా కార్యక్రమం (ఎన్.ఎస్.పి.ఏ.ఏ.డి) కి ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది.  ఇప్పటికే ఉన్న, అభివృద్ధి చెందుతున్న వాటి గురించి నివేదించడానికి “రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్” ని  అభివృద్ధి చేయడం జరిగింది. ఈ సమ్మేళనం సందర్భంగా రైతులకు వ్యాధికారక క్రిములను ప్రదర్శించారు.  తదనంతరం, మైక్రోస్పోరిడియన్ (ఎంటరోసైటోజోన్ హెపాటోపెనై (ఈ,హెచ్.పి) వల్ల కలిగే హెపాటోపాంక్రియాటిక్ మైక్రోస్పోరిడియోసిస్ (హెచ్.పి.ఎం) పై స్పష్టమైన ప్రదర్శనను అందించారు,  రొయ్యల పెంపకంలో దాని నిర్ధారణ, నిర్వహణను ఐ.సి.ఏ.ఆర్-సి.ఐ.బి.ఏ. శాస్త్రవేత్త డాక్టర్ టి. సతీష్ కుమార్ వివరించారు.   రొయ్యల పొలాలలో ఈ.హెచ్.పి. వ్యాధికారకాన్ని నిర్వహించడానికి సి.ఐ.బి.ఏ. అభివృద్ధి చేసిన చికిత్సా విధానం ద్వారా అందించబడిన ఆశాజనక ఫలితాల గురించి కూడా, ఆయన ఈ సందర్భంగా వివరించారు.

అనంతరం ‘రొయ్యల పంటల బీమా’ పై ప్రత్యేక సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో భారత వ్యవసాయ బీమా సంస్థ;  యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా; మధ్యవర్తి అలయన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్లతో పాటు, సి.ఐ.బి.ఏ. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి. రవిశంకర్, జాతీయ మత్స్య సంపద అభివృద్ధి మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్, డాక్టర్ ఎల్. నరసింహ మూర్తి పాల్గొన్నారు.  రొయ్యల పెంపకం కోసం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ అభివృద్ధి చేసిన బీమా సౌకర్యం, ప్రాథమిక మరియు వ్యాధి కవర్ కోసం ప్రీమియంలతో పాటు, ఎన్.ఎఫ్.డి.బి. అందించే 20-30 శాతం సబ్సిడీ భాగం గురించి వారు వివరించారు.  ఈ పథకంపై రైతులు తమ ఆశాభావం వ్యక్తం చేయడంతో పాటు, అందులో భాగస్వాములయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

రొయ్యల రైతులు తమ సమస్యలను, అవసరాలను ముఖ్యంగా రొయ్యల విత్తనాల నాణ్యత, రొయ్యల ధర, విద్యుత్ ఛార్జీలు మొదలైన వాటిపై అంతర్-విభాగ అధికారుల బృందం ముందు తెలియజేసారు.  రైతు సమ్మేళనం సమన్వయకర్త డాక్టర్ ఎం. కుమరన్ సమన్వయంతో తగిన సలహాలను పొందారు.  తరువాత, డా.ఎం. కైలాసంతో పాటు సి.ఐ.బి.ఎ. విభాగాధిపతులు,  డాక్టర్ సి.పి.బాలసుబ్రమణియన్ వరుసగా ఉప్పునీటి ఆక్వాకల్చర్‌ ని ఆసియా సీ బాస్ మరియు మడ్ క్రాబ్‌ లతో వైవిధ్యభరితంగా చేయడం, వాటి వ్యవసాయ పద్ధతులను ప్రదర్శించారు.

పి.ఎం.ఎం.ఎస్.వై. పథకం కింద భారత ప్రభుత్వ జాతీయ మత్స్య సంపద అభివృద్ధి మండలి (ఎం.ఎఫ్.డి.బి), ఆర్థిక సహకారంతో నాబార్డ్, ఎస్.సి.ఏ.ఎఫ్.ఐ., వ్యవసాయ బీమా సంస్థ ఈ సమావేశాన్ని నిర్వహించాయి.    సి.ఐ.బి.ఏ. కి చెందిన డా. అక్షయ పాణిగ్రాహి, శ్రీ పంకజ్ ఎ.పాటిల్ తో పాటు ఎన్.జి.ఆర్.సి. కి చెందిన శ్రీ జోస్ ఆంటోనీ నాయకత్వంలోని శాస్త్రీయ బృందం ఈ సమావేశాన్ని సమన్వయ పరిచింది.  ఈ కార్యక్రమంలో వివిధ అధికారులు, సాంకేతిక నిపుణులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

*****


(Release ID: 1957599) Visitor Counter : 106


Read this release in: English , Urdu , Hindi