వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని ప్రారంభించి 2023 సెప్టెంబర్ 17 కి ఏడాది పూర్తి లాజిస్టిక్స్ ను మెరుగుపరచడంలో వేగవంతమైన పురోగతి

Posted On: 14 SEP 2023 6:05PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి గతిశక్తి  జాతీయ మాస్టర్ ప్లాన్ (ఎన్ ఎం పి) కి మద్దతుగా 2022 సెప్టెంబర్ 17న జాతీయ లాజిస్టిక్స్ పాలసీ (ఎన్ ఎల్ పి ) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రధాన మంత్రి గతిశక్తి ఎన్ ఎం పి ఫిక్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ ప్లానింగ్ సమగ్ర అభివృద్ధి పై దృష్టి పెట్టగా, ఎన్ఎల్ పి సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ , లాజిస్టిక్స్ రంగ అభివృద్ధి అంశాన్ని చేపట్టింది. వీటిలో ప్రాసెస్ సంస్కరణలు, లాజిస్టిక్స్ సేవల మెరుగుదల, డిజిటలైజేషన్, మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యం ఉన్నాయి.

విజన్

క్లాస్ టెక్నాలజీ, ప్రక్రియలు , నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఉత్తమంగా ఉపయోగించడం ద్వారా సమీకృత, అంతరాయం లేని, సమర్థవంతమైన, విశ్వసనీయమైన, హరిత , సుస్థిర ఖర్చుతో కూడుకున్న లాజిస్టిక్స్ నెట్వర్క్ ద్వారా దేశ ఆర్థిక వృద్ధి , వ్యాపార పోటీతత్వాన్ని నడిపించడం ఎన్ఎల్ పి దార్శనికత. ఇది లాజిస్టిక్స్ ఖర్చును తగ్గిస్తుంది  పనితీరును మెరుగుపరుస్తుంది.

 లక్ష్యాలు

ఎన్ ఎల్ పి లక్ష్యాలు: (i) భారతదేశంలో లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడం; (ii) లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ర్యాంకింగ్ ను మెరుగుపరచడం - 2030 నాటికి టాప్ 25 దేశాలలో ఒకటిగా ఉండటానికి ప్రయత్నించడం  (iii) సమర్థవంతమైన లాజిస్టిక్స్ పర్యావరణ వ్యవస్థ కోసం డేటా ఆధారిత నిర్ణయ మద్దతు యంత్రాంగాన్ని సృష్టించడం.

కాంప్రహెన్సివ్ లాజిస్టిక్స్ యాక్షన్ ప్లాన్ (క్లాప్)

ఈ లక్ష్యాలను సాధించడానికి, (i) ఇంటిగ్రేటెడ్ డిజిటల్ లాజిస్టిక్స్ సిస్టమ్స్ తో సహా ఎనిమిది కార్యాచరణ ప్రాంతాలను కవర్ చేస్తూ ఎన్ ఎల్ పి లో భాగంగా ఒక సమగ్ర లాజిస్టిక్స్ యాక్షన్ ప్లాన్ (క్లాప్) ప్రారంభించబడింది;ఎనిమిది కార్యాచరణ అంశాలలో (i) ఇంటిగ్రేటెడ్ డిజిటల్ లాజిస్టిక్స్ సిస్టమ్స్ ; (ii) భౌతిక ఆస్తుల ప్రామాణీకరణ , సర్వీస్ క్వాలిటీ స్టాండర్డ్స్ ను బెంచ్ మార్క్ చేయడం; (iii) లాజిస్టిక్స్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్; (iv) ప్రభుత్వ భాగస్వామ్యం; (iv) ఎగ్జిమ్ లాజిస్టిక్స్; (vi) సర్వీసెస్ ఇంప్రూవ్ మెంట్ ఫ్రేమ్ వర్క్; (vii) సమర్థవంతమైన లాజిస్టిక్స్ కోసం సెక్టోరల్ ప్లాన్ లు (ఎస్ పి ఇ ఎల్) ; (viii) లాజిస్టిక్స్ పార్కుల అభివృద్ధిని సులభతరం చేయడం ఉన్నాయి. 

అవుట్ రీచ్ ఈవెంట్ లు/మీటింగ్ లు:

ఎన్ ఎల్ పి ప్రారంభించినప్పటి నుండి, ఈ విధానం అమలుకు సంబంధించి గణనీయమైన పురోగతి నమోదైంది. ప్రాంతీయ సదస్సులు, ముఖాముఖి చర్చలు, ఇంటర్ మినిస్టీరియల్ సమావేశాల ద్వారా డి పి ఐ ఐ టి ఎన్ ఎల్ పి అమలును సులభతరం చేసింది. ఈ అవుట్ రీచ్ కార్యకలాపాల అవలోకనం క్రింద ఇవ్వబడింది.

1.2023 జూలై 28న ఇంటర్ మినిస్టీరియల్ మీటింగ్

*నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ (ఎన్ఎల్ పి ) ప్రారంభమై పది నెలలు పూర్తయిన సందర్భంగా, దాని అమలు పురోగతిని సమీక్షించడానికి 2023 జూలై 28 న డిపిఐఐటి అంతర్ మంత్రిత్వ స్థాయి  సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో దేశంలో లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వివిధ మంత్రిత్వ శాఖలు తీసుకున్న చర్యలను ప్రదర్శించారు.

*ఈ సమావేశంలో రోడ్డు రవాణా ,రహదారులు (ఎం ఒ ఆర్ టి హెచ్),  పోర్ట్ షిప్పింగ్ , జలమార్గాలు (ఎం ఒ పి ఎస్ డబ్ల్యు), బొగ్గు, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, సివిల్ ఏవియేషన్ (ఎం ఒ సి ఎ) ,  స్టీల్, కామర్స్, ఫెర్టిలైజర్, రెవెన్యూ,  స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ (ఎం ఎస్ డి ఇ),   పవర్ శాఖలు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఐసీడీసీ) మొదలైన 11 మౌలిక సదుపాయాల, యూజర్ మంత్రిత్వ శాఖలు  ప్రాతినిధ్యం వహించాయి. 

*ఈ సమావేశానికి లాజిస్టిక్స్ ప్రత్యేక కార్యదర్శి అధ్యక్షత వహించారు. ముగింపు సెషన్ లో డీపీఐఐటీ కార్యదర్శి పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని రెండు సెషన్లుగా విభజించారు. డి పి ఐ ఐ టి  చేపట్టిన చర్యల సమీక్షపై  మొదటి సెషన్ దృష్టి సారించింది. సారించారు.  రెండవ సెషన్ లో పాల్గొన్న మంత్రిత్వ శాఖలు ఎన్ ఎల్ పి  అమలులో పురోగతిని చర్చించాయి

2. ప్రాంతీయ వర్క్ షాప్ లు (2023 మార్చి 20 ,ఏప్రిల్ 12 మధ్య)

*డీపీఐఐటీ 2023 మార్చి 20 నుంచి ఏప్రిల్ 12 వరకు ఐదు ప్రాంతీయ వర్క్ షాప్ లను నిర్వహించింది. అన్ని వర్క్ షాప్ లలో ఎన్ ఎల్ పి పై ఒక ప్రత్యేక సెషన్ జరిగింది, దీనిలో ఎన్ ఎల్ పి కీలక లక్షణాలు , పురోగతి ప్రదర్శించారు. పాల్గొన్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు సంబంధిత స్టేట్ లాజిస్టిక్స్ పాలసీ ఇతర జోక్యాల స్థితి , ముఖ్యాంశాలను ప్రదర్శించాయి.

*మొత్తం 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, సంబంధిత మంత్రిత్వ శాఖలు/డిపార్ట్ మెంట్ అధికారులు, నాలెడ్జ్ పార్టనర్స్, బహుళపక్ష సంస్థల ప్రతినిధులు 500 మందికి పైగా ఈ వర్క్ షాప్ లకు హాజరయ్యారు.

3. ఇతర ముఖాముఖి సంభాషణలు / సమావేశాలు:

*లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (ఎల్ పిఐ) పై సమావేశాలు: ఎల్ పి ఐలో భారత్ ర్యాంకును మరింత మెరుగుపరిచే ప్రయత్నంలో డిపిఐఐటి పలు చర్యలు చేపట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు, సంస్కరణల గురించి ప్రపంచబ్యాంకు బృందానికి వివరించడానికి, ఎల్ పి ఐ స్కోరింగ్ కోసం ఆబ్జెక్టివ్ బేస్డ్ మెథడాలజీపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని వారి దృష్టికి తీసుకురావడానికి, డిపిఐఐటి కార్యదర్శి వాషింగ్టన్ డిసిలోని వారి ప్రధాన కార్యాలయంలో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు.

*దీనికి కొనసాగింపుగా డిపిఐఐటి ప్రపంచ బ్యాంక్ గ్రూప్ (లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా బృందం) , సంబంధిత లైన్ మంత్రిత్వ శాఖలతో వరుస సమావేశాలు నిర్వహించింది.

*భారతదేశ ఎల్ పి ఐ ర్యాంకింగ్ ను మెరుగుపరచడం కోసం క ఒక కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయడానికి , అమలు చేయడానికి లాజిస్టిక్స్ డివిజన్ లో ఒక ప్రత్యేక యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నారు. 

*అదనంగా, సంబంధిత లైన్ మంత్రిత్వ శాఖలు ఆరు ఎల్ పి ఐ పరామీటర్లలో భారతదేశ పనితీరును మెరుగుపరచడానికి కేంద్రీకృత ప్రాజెక్ట్ ఆధారిత విధానం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.

*సర్వీసెస్ ఇంప్రూవ్మెంట్ గ్రూప్ (ఎస్ఐజి) సమావేశాలు: ఎన్ఎల్ పి కోసం ఆమోదించిన సంస్థాగత యంత్రాంగానికి అనుగుణంగా, 2023 మార్చి 14 న ఇంటర్-మినిస్టీరియల్ ఎస్ఐజి ఏర్పాటు అయింది. ఎస్ఎస్ (లాజిస్టిక్స్) నేతృత్వంలోని ఈ బృందంలో ఎం ఒ ఆర్ టి హెచ్, ఎం ఒఆర్, ఎం ఒ పి ఎస్ డబ్ల్యూ,  ఎంఎన్ఆర్ఇ, ఎం ఒ పి, డాట్, ఎం ఒ పి ఎన్ జి , ఎం ఒ సి ఎ , నీతి ఆయోగ్, ఎం ఒ ఇ ఎఫ్ సి సి, ఎం ఒ హెచ్ యు ఎ , డి ఒఆర్, డి ఒ సి ప్రతినిధులు ఉంటారు.

*లక్ష్యం: పరిశ్రమకు సంబంధించిన లాజిస్టిక్స్ సేవలు, ప్రక్రియలకు సంబంధించిన సమస్యలను సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ఎస్ఐజీని ఏర్పాటు చేశారు. ఎస్ ఐ జి  ద్వారా సమస్యలను పరిష్కరించడం అనేది ఇంటర్ ఆపరేబిలిటీని ప్రోత్సహిస్తుంది; డాక్యుమెంటేషన్, ఫార్మాట్ లు, ప్రక్రియలు, లయబిలిటీ నిర్వహణ లలో విచ్ఛిన్నతను తొలగించడం , రెగ్యులేటరీ ఆర్కిటెక్చర్ లో అంతరాలను తగ్గించడం.

* ఇ-ఎల్ ఒ జి ఎస్ పోర్టల్ (లాజిస్టిక్స్ సెక్టార్ అసోసియేషన్ల ద్వారా లాజిస్టిక్స్ సంబంధిత సమస్యలను నమోదు చేయడానికి డిజిటల్ వ్యవస్థ): ప్రస్తుతం 29 లాజిస్టిక్స్ సెక్టార్ అసోసియేషన్లు ఇ-ఎల్ ఒ జి ఎస్ పోర్టల్  లో రిజిస్టర్ అయ్యాయి, మొత్తం 71 సమస్యలు ఉన్నాయి, వీటిలో 34 సమస్యలను పరిష్కరించారు. 

*పరిశ్రమ ప్రతినిధులతో క్రమం తప్పకుండా రౌండ్ టేబుల్ సమావేశాలు, ఎస్ఐజి  సమావేశాలు నిర్వహిస్తారు.  ఇప్పటి వరకు పరిశ్రమ సంఘాలతో పాటు ఎస్ఐజి ఆరు సమావేశాలు నిర్వహించారు.

ఎన్ ఎల్ పి ,క్లాప్ అమలులో పురోగతి

ఎన్ ఎల్ పి ప్రారంభించినప్పటి నుండి, క్లాప్ అమలులో సాధించిన పురోగతి ఈ క్రింది విధంగా ఉంది:

*యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ఫామ్ (యులిప్): లాజిస్టిక్స్ రంగంలో డిజిటల్ ఇంటిగ్రేషన్ కోసం , వస్తువులను ట్రేడ్ చేసే,  బహుళ రవాణా పద్ధతులను ఉపయోగించే వినియోగదారులకు ఒకే గుర్తును అందించడానికి - యునిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ ఫామ్(యులిప్) ను ఎన్ ఎల్ పి తో కలిపి ప్రారంభించారు. 

*యులిప్ అనేది స్వదేశీ డేటా ఆధారిత వేదిక, ఇది మంత్రిత్వ శాఖలు / విభాగాలలో 34 లాజిస్టిక్స్ సంబంధిత డిజిటల్ వ్యవస్థలు / పోర్టల్స్ ను ఏకీకృతం చేస్తుంది. జిఎస్ టి డేటాను కూడా యులిప్ తో అనుసంధానం చేయడం గమనార్హం.

*యులిప్ పై యూజ్ కేసులను అభివృద్ధి చేయడానికి ప్రైవేట్ రంగానికి యులిప్ అవకాశాలను అందిస్తుంది. నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్స్ (ఎన్.డిఎ) పై సంతకం చేయడం ద్వారా , తగిన శ్రద్ధ తర్వాత, యులిప్ పై డేటాను ఎపిఐ ఇంటిగ్రేషన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.  ప్రైవేట్ ప్లేయర్లు అనువర్తనాలు / వినియోగ కేసులను అభివృద్ధి చేయవచ్చు.

*614కు పైగా ఇండస్ట్రీ ప్లేయర్లు యూలిప్ లో రిజిస్టర్ చేసుకున్నారు.

*106 ప్రైవేటు కంపెనీలు ఎన్ డీఏలపై సంతకాలు చేశాయి.

*142 కంపెనీలు యులిప్ పై హోస్ట్ చేయడానికి 382 యూజ్ కేసులను సమర్పించాయి.

*57 దరఖాస్తులను లైవ్ చేశారు.

ఎగ్జిమ్ లాజిస్టిక్స్: వాణిజ్య సౌకర్యాన్ని ప్రోత్సహించడానికి , ఎగ్జిమ్ లాజిస్టిక్స్ ను క్రమబద్ధీకరించడానికి, ఈ క్రింది చర్యలు చేపట్టారు.

*మౌలిక సదుపాయాల అంతరాలను పరిష్కరిస్తున్నారు. డిజిటల్ చొరవలను చేపట్టారు (నేషనల్ కమిటీ ఆన్ ట్రేడ్ ఫెసిలిటేషన్ కింద);

*ఎక్సిమ్ లాజిస్టిక్స్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు.

*చివరి,మొదటి మైలు ఇన్ఫ్రా అంతరాలను పరిష్కరించడానికి ,ఓడరేవులకు సరకుల నిరంతర రవాణాను ప్రోత్సహించడానికి ఎం/ఒపోర్ట్ షిప్పింగ్, జలమార్గాల శాఖ  సమగ్ర పోర్ట్ కనెక్టివిటీ ప్రణాళికను అభివృద్ధిచేసింది. . ఓడరేవులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఎం ఒ ఆర్ టి హెచ్ కు చెందిన 60 ప్రాజెక్టులు, రైల్వేకు చెందిన 47 ప్రాజెక్టులకు అనుమతి లభించింది.

*ఓడరేవు ఉత్పాదకతను మెరుగుపరచడానికి , సమస్యలను పరిష్కరించడానికి, ఎం ఒ పి ఎస్ డబ్ల్యూ,, పోర్ట్ అధికారులు మొదలైన వారితో అనేక సమావేశాలు నిర్వహించారు. మూడు  మేజర్ పోర్టుల (చెన్నై, జెఎన్ పి టి ,  విశాఖపట్నం) లో పోర్టు ప్రాసెస్ అధ్యయనాలు జరిగాయి.

*పోర్టుల సందర్శనను డి పిఐఐటి చేపడుతోంది.

* లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ (ఎల్.డిబి ) అనేది ఎగ్జిమ్ కార్గోను ట్రాక్ చేసే ,గుర్తించే అనువర్తనం. అధిక అంచనా, పారదర్శకత, విశ్వసనీయత, లాజిస్టిక్స్ ఖర్చు తగ్గుతుంది సరఫరా గొలుసులో వృథా తగ్గుతుంది.

*ఎల్. డి బి డేటాను ఉపయోగించి పోర్టుల వారీగా నౌక టర్నరౌండ్ సమయంపై కొత్త విశ్లేషణను సిద్ధం చేస్తున్నారు. పోర్ట్ ,సమీప చెక్ పోస్ట్ మధ్య రద్దీని పోర్ట్ టు సి ఎఫ్ ఎస్/ ఐ సి డి  (దిగుమతి సైకిల్ కోసం ) రూపంలో అందించబడుతుంది; సి ఎఫ్ ఎస్/ ఐ సి డి  టు పోర్ట్ (ఎగుమతి చక్రం కోసం ); సమీపంలోని టోల్ ప్లాజాకు పోర్ట్ చేస్తారు. ఈ విశ్లేషణలను ఉపయోగించి, పనితీరును మెరుగుపరచడానికి పోర్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మానవ వనరుల అభివృద్ధి

*ఈ రంగంలోని నిపుణులను ప్రోత్సహించడానికి, ఈ రంగంలోని వివిధ ఉద్యోగ పాత్రలకు అర్హత ప్యాక్ లను ప్రభుత్వం నోటిఫై చేస్తోంది.

*2023 జూలైలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (సి టి ఐ), స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ఎ టి టఐ)లతో వెబినార్ నిర్వహించారు.

*లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో శిక్షణ , సామర్థ్యాన్ని పెంపొందించడానికి సిలబస్ ,ట్రైనింగ్ మాడ్యూల్స్ ను అభివృద్ధి చేస్తున్నారు. 

సెక్టోరల్ ప్లాన్ ఫర్ ఎఫిషియెన్సీ లాజిస్టిక్స్ (ఎస్ పిఇఎల్)

*లాజిస్టిక్స్ రంగంలో రంగాలవారీ అవసరాలను తీర్చడానికి ,  దేశంలో బల్క్,  బ్రేక్-బల్క్ కార్గో కదలికలను క్రమబద్ధీకరించడానికి, సెక్టోరల్ ప్లాన్స్ ఫర్ ఎఫిషియెన్సీ లాజిస్టిక్స్ (స్పెల్) ను యూజర్ మంత్రిత్వ శాఖలు అభివృద్ధి చేస్తున్నాయి. వీటిలో వివిధ మూల-గమ్య జతల గుండా సరుకుల నిరంతర రవాణాకు అవసరమైన రంగ నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలు / జోక్యాలు ఉన్నాయి.

*ఇప్పటివరకు, నౌకాశ్రయాలకు చివరి మైలు అంతరాలను పూడ్చడానికి సమగ్ర పోర్ట్ కనెక్టివిటీ ప్లాన్ (సిపిసిపి) ను  పోర్ట్, షిప్పింగ్,  జలమార్గాల శాఖ అభివృద్ధి చేసింది. చేశాయి. 107 పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులతో కూడిన సిపిసిపి (ఎం ఒఆర్  47 , ఎం ఒ ఆర్ టి హెచ్ 60) నోటిఫై చేశారు. 

*సమర్థవంతమైన బొగ్గు తరలింపు కోసం  కోల్ లాజిస్టిక్స్ ప్లాన్ ని బొగ్గు శాఖ  అభివృద్ధి చేసింది.

*స్టీల్ శాఖ కూడా తన సెక్టోరల్ ప్రణాళికను  అభివృద్ధి చేస్తోంది.

ప్రభుత్వ భాగస్వామ్యం 

*స్టేట్ లాజిస్టిక్స్ పాలసీ: రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ పాలసీలో 'లాజిస్టిక్స్'పై సమగ్ర దృష్టిని తీసుకురావడానికి, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ఎల్· పి కి అనుగుణంగా స్టేట్ లాజిస్టిక్స్ ప్లాన్ (ఎస్ఎల్పి) లను అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటివరకు, 22 రాష్ట్రాలు తమ తమ రాష్ట్ర లాజిస్టిక్స్ విధానాలను నోటిఫై చేశాయి.

*వివిధ రాష్ట్రాల్లో లాజిస్టిక్స్ ఈజ్ (లీడ్స్): రాష్ట్రాల్లో లాజిస్టిక్స్ పనితీరు పర్యవేక్షణ కోసం 'లాజిస్టిక్స్ ఈజ్ అవర్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్)' ఇండెక్స్ పేరుతో ప్రపంచ బ్యాంకు ఎల్ పి ఐ తరహాలో స్వదేశీ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ను అభివృద్ధి చేశారు. ఈ సర్వేను ఏటా నిర్వహిస్తారు.  రాష్ట్రాల పనితీరును బట్టి ర్యాంకులు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ లాజిస్టిక్స్ పనితీరును మెరుగుపరచడానికి తగిన మౌలిక సదుపాయాలు, సేవలు ,నియంత్రణ సంస్కరణలను చేపట్టడానికి మెరుగుదల ప్రాంతాలను గుర్తించడం ,మద్దతు ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యం. త్వరలోనే లీడ్స్ 2023 నివేదికను విడుదల చేయనున్నారు.

లాజిస్టిక్స్ కాస్ట్ ఫ్రేమ్ వర్క్

లాజిస్టిక్స్ విభాగం, డిపిఐఐటి లాజిస్టిక్స్ వ్యయాన్ని అంచనా వేయడానికి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించింది, ఎందుకంటే అధికారిక అంచనాలు అందుబాటులో లేవు. అవి జిడిపిలో 8-14% వరకు మారుతూ ఉంటాయి.

ప్రైవేట్ రంగంలో గత అధ్యయనాలు (ఆర్మ్ స్ట్రాంగ్ అండ్ ఆర్మ్ స్ట్రాంగ్  అండ్ ఎన్ సిఎఇఆర్):

*ఆర్మ్ స్ట్రాంగ్ & ఆర్మ్ స్ట్రాంగ్ - జి.డి.పి.లో 13%;

*ఎన్ సిఎఇఆర్:2018 - జీడీపీలో 8.10%.

అందువల్ల సమగ్ర డేటా,  సంబంధిత గణాంక నమూనాల ఆధారంగా ఖచ్చితమైన అంచనాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది.

తీసుకున్న చర్యలు:

*మార్చి 2023 లో, ప్రభుత్వం ఉత్తమ పద్ధతులపై మేధోమథనం చేయడానికి అంతర్జాతీయ నిపుణులతో ఒక వర్క్ షాప్ ను నిర్వహించింది.

*సంబంధిత మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు, విద్యా, పరిశ్రమలు, మేధో వర్గాల  నిపుణులతో కూడిన టాస్క్ ఫోర్స్ ను 2023 మార్చిలో నోటిఫై చేశారు.

*టాస్క్ ఫోర్స్ పలు సమావేశాలు జరిగాయి.

*సాధించిన లాజిస్టిక్స్ ఖర్చు కోసం  పబ్లిక్ డొమైన్ బేస్ లైన్ అంచనాల్లో లభ్యమయ్యే సెకండరీ డేటాను ఉపయోగించడం (ఎం ఒ ఎస్ పి ఐ సప్లై యూజ్ టేబుల్స్ ఉపయోగించి). లాజిస్టిక్స్ ఖర్చు లెక్కింపు కోసం దీర్ఘకాలిక సర్వే ఆధారిత ఫ్రేమ్ వర్క్ ను అభివృద్ధి చేశారు. 

డేటా పరిమితులు ఉన్నప్పటికీ (పబ్లిక్ డొమైన్ లో లభ్యమయ్యే డేటా ప్రధానంగా రవాణా వ్యయ సమీకృత అంచనాలు) ఈ అంచనా భవిష్యత్తులో సమగ్ర ధోరణి విశ్లేషణను నిర్వహించడానికి బేస్ లైన్ గా ఉపయోగించబడుతుంది. ఈ దీర్ఘకాలిక సర్వే-ఆధారిత అధ్యయనం విభిన్న స్థాయిలో బలమైన లాజిస్టిక్స్ వ్యయ అంచనాలను చేరుకోవడంలో సహాయపడుతుంది, తద్వారా సెక్టార్లు / మోడ్ లలో లక్ష్య జోక్యాలను చేపట్టవచ్చు.

 

***



(Release ID: 1957598) Visitor Counter : 116


Read this release in: Hindi , English , Urdu