పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డీ ఏ ఆర్ పీ జీ ప్రత్యేక ప్రచారం 3.0 సన్నాహక దశ మరియు అమలు దశలలో పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ క్రియాశీల భాగస్వామిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉంది.


ప్రత్యేక ప్రచారం ప్రాథమికంగా పరిశుభ్రమైన మరియు పర్యావరణ అనుకూల కార్యస్థలాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది

Posted On: 14 SEP 2023 9:01PM by PIB Hyderabad

మునుపటి ప్రత్యేక ప్రచారం సంచికల అద్భుతమైన విజయం మరియు పరివర్తన ఫలితాలతో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, సన్నాహక దశ (15-30 సెప్టెంబర్, 2023) మరియు అమలు దశ (2-31 అక్టోబర్,2023) సమయంలో క్రియాశీల భాగస్వామిగా ఉత్సాహంతో వ్యవహరించడానికి సిద్ధంగా ఉంది.  ప్రత్యేక ప్రచారం 3.0 పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం (డీ ఏ ఆర్ పీ జీ) ద్వారా నిర్వహించబడింది. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖలో నిర్వహించబడిన ప్రత్యేక ప్రచారం లో సందర్శకులకు, అధికారులకు మరియు సిబ్బందికి పరిశుభ్రమైన మరియు  పర్యావరణఅనుకూల కార్యాలయాలను ప్రోత్సహించడంపై  ప్రధానంగా దృష్టి సారిస్తారు. అనుకూలమైన పని వాతావరణం కోసం ప్రత్యేక ప్రచారం కింద పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ అనుసరించిన శాశ్వత ఉత్తమ పద్ధతుల యొక్క ప్రధాన ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి:

ఇ-ఆఫీస్ ద్వారా 100% ఫైల్ పనిని అమలు చేయడం

కార్యాలయ స్థలాల సమర్థ నిర్వహణ

కార్యాలయ స్థలాలను మెరుగుపరచడం మరియు ఉత్పాదక వినియోగం

పర్యావరణ అనుకూల పద్ధతులు

ఎల్లప్పుడూ పరిశుభ్రమైన కార్యాలయాన్ని నిర్వహించడం

100 % ఎలక్ట్రానిక్ చెత్తను పారవేయడం 

అన్ని ప్రజాసమస్యల నివేదనలను పరిష్కరించటం 

 

2023 అక్టోబర్ 2 నుండి 2023 అక్టోబర్ 31 వరకు నిర్వహించే ప్రత్యేక ప్రచార 3.0 కోసం వర్క్ ప్లాన్/యాక్షన్ ప్లాన్‌పై చర్చించేందుకు 11 సెప్టెంబర్ 2023న డివిజనల్ హెడ్‌లతో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్ర శేఖర్ కుమార్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (డీ ఏ ఆర్ పీ జీ), మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.  పరిశుభ్రతను సంస్థాగతీకరించడం మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌ను తగ్గించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన డాక్టర్ చంద్ర శేఖర్ కుమార్, ప్రత్యేక ప్రచారం 3.0 పరిశుభ్రత ద్వారా సుపరిపాలనను ప్రోత్సహించాలనే విస్తృత లక్ష్యం లో భాగంగా డీ ఏ ఆర్ పీ జీ గుర్తించిన పారామితుల ప్రకారం ఉత్తమ ఫలితాల కోసం అన్ని విభాగాలు సమన్వయంతో మరియు సహకార పద్ధతిలో పని చేయాలని సూచించారు.

 

ప్రత్యేక ప్రచారం 3.0 యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక ప్రచారం 3.0 కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయడంలో మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు నాయకత్వం వహించాలని డాక్టర్ చంద్ర శేఖర్ కుమార్ సూచించారు. ఈ సమావేశంలో సంయుక్త కార్యదర్శి శ్రీమతి  మమతా వర్మ, జాయింట్ సెక్రటరీ, శ్రీ అలోక్ ప్రేమ్ నగర్, ఆర్థిక సలహాదారు, డాక్టర్ బిజయ కుమార్ బెహెరా, డైరెక్టర్, శ్రీ రమిత్ మౌర్య, డైరెక్టర్, డాక్టర్ శ్రీరామప్ప వి. మరియు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖలోని ఇతర విభాగాలు/విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

పరిశుభ్రతను "ప్రతి ఒక్కరి భాధ్యత" మరియు "జీవన మార్గం"గా మార్చడం ద్వారా ప్రత్యేక ప్రచారం 3.0ని ఘన విజయవంతం చేయడంలో అవగాహన పెంచడానికి, అధికారులను సమీకరించడానికి మరియు వారి చురుకైన భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని డాక్టర్ బిజయ కుమార్ బెహెరా వివరించారు. డిసెంబర్ 2022 నుండి జులై 2023 వరకు పరిశుభ్రత ప్రచారాలు, ఖాళీ స్థలం, ఫైళ్లను తొలగించడం, చెత్త ను పారవేయడం ద్వారా ఆర్జించిన ఆదాయం మరియు 2023 జూలై వరకు పారవేయబడిన ప్రజా ఫిర్యాదులకు సంబంధించి కొన్ని అద్భుతమైన ఫలితాలను ఉదహరిస్తూ, డాక్టర్ బెహెరా  ప్రజా ఫిర్యాదుల పరిష్కారం గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు డిసెంబర్ 2022 - జూలై 2023 మధ్యకాలంలో 5541  ప్రజా ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి అన్నారు. రాష్ట్ర నోడల్ అధికారులు మరియు అంకితమైన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్‌ల నిర్దిష్ట సమన్వయం తో ప్రజా ఫిర్యాదులను ఒక నెల వ్యవధిలో పరిష్కరించడంలో సహాయపడిందని అందువల్ల ప్రజా ఫిర్యాదులలో ఇప్పుడు ఎటువంటి పెండింగ్‌ లేదని పేర్కొన్నారు.

 

ప్రత్యేక ప్రచారం 3.0 యొక్క వివిధ కార్యకలాపాలు మరియు అంశాలపై సమావేశంలో చర్చలు దృష్టి సారించాయి. ఇది అన్ని స్థాయిలలో ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేలా చేయడానికి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి ప్రక్రియలు విధి విధానాలను క్రమబద్ధీకరించడానికి ప్రత్యేక పరిశుభ్రత డ్రైవ్‌లను నిర్వహించడం మరియు ప్రభుత్వ ఉద్యోగులను సమీకరించడం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక ప్రచారం 3.0  ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన కార్యాలయాలుగా నిర్వహించడం , పని ప్రదేశంలో సరైన పనిముట్లను అందుబాటు లో ఉంచడం, సామర్థ్యాన్ని పెంచడం / ఉత్పాదకతను మెరుగుపరచడం అంటే పనిలో వేగం మరియు నాణ్యత మరియు ఉద్యోగులు / సిబ్బంది-సభ్యులకు (రెగ్యులర్, కాంట్రాక్టు మరియు అవుట్‌సోర్స్) క్లీన్ డెస్క్ / క్లీన్ ఆఫీస్ / క్లీన్ కారిడార్ / క్లీన్ వర్క్‌స్టేషన్ ద్వారా పరిశుభ్రమైన, చక్కనైన మరియు వ్యవస్థీకృత పని వాతావరణం కల్పించడం, సోషల్ మీడియా ద్వారా ఇతర ఉత్తమ విధానాలు అభ్యాసాలు  క్రమం తప్పకుండా ప్రచారం చేస్తారు.

 

పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ, రికార్డు అధికారులతో ఒక మినీ-వర్క్‌షాప్‌ని నిర్వహిస్తుంది, రికార్డ్ కీపింగ్‌పై వారి సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు రికార్డ్ భద్రత షెడ్యూల్ ప్రకారం ఫైళ్ల సంరక్షణ, పంపిణీ మరియు నిలుపుదల మొదలైన వాటి కోసం వర్గీకరణకు వారికి సహాయం చేస్తుంది. జీవన్ భారతి భవనం మరియు జీవన్ ప్రకాష్ భవనం రెండు కార్యాలయ ఆవరణలో పూల కుండీలు, మొక్కలు కుండీలు మొదలైనవి ఉంచడం ద్వారా మంచి అనుభూతిని కలిగించే వాతావరణం కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు. పార్లమెంటు సభ్యుల సూచనలు, పార్లమెంటరీ హామీలు, రాష్ట్ర ప్రభుత్వాల నుండి స్వీకరించిన సూచనలు, అంతర్ మంత్రిత్వ శాఖల సంప్రదింపులు, ప్రజా ప్రాతినిధ్యాలు వంటి పెండింగ్‌లో ఉన్న అంశాలు    సమస్యలను పరిగణలోకి తీసుకోవడం, కార్యాలయంలో పరిశుభ్రత  కోసం చెత్తను పారవేయడానికి, క్రమ పద్ధతిలో పేపర్‌లను సమీక్షించడం, మెరుగైన రికార్డు నిర్వహణ, కలుపుకోవడంపరిశుభ్రత  పట్ల ప్రవర్తనా / వైఖరి మార్పులపై  ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇది ప్రతిఒక్కరికీ మరింత సుస్థిరమైన భవిష్యత్తు వైపుగా పయనానికి మార్గం సుగమం చేస్తుంది.

 

***


(Release ID: 1957590)
Read this release in: English , Urdu , Hindi