మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

మహమ్మారి సంసిద్ధత కోసం ఒక ఆరోగ్య విధానాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం మరియు ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.ఓ.ఏ.హెచ్) సహకరించింది


"భారతదేశంలో వన్యప్రాణుల్లో స్పిల్ ఓవర్ ఈవెంట్స్ పై రిస్క్-బేస్డ్ మేనేజ్‌మెంట్" అనే బహుళ-విభాగ వర్క్‌షాప్‌ ను డబ్ల్యూ.ఓ.ఏ.హెచ్. భాగస్వామ్యంతో కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ హైదరాబాద్ లో 2023 సెప్టెంబర్ 11, 12 తేదీల్లో నిర్వహించింది.


వన్యప్రాణుల మూల వ్యాధి ప్రమాద విశ్లేషణ గురించి వాటాదారుల జ్ఞానాన్ని పెంపొందించడం, భారతదేశ ప్రమాద అంచనా, నిర్వహణపై సమగ్ర విశ్లేషణ నిర్వహించడం, వ్యాధి స్పిల్‌ ఓవర్ సంఘటనలను స్వీకరించడం, సంబంధిత వాటాదారుల్లో కమ్యూనికేషన్ తో పాటు, అవగాహన పెంపొందించడం వంటి నాలుగు కీలక లక్ష్యాలపై ఈ వర్క్-షాప్ దృష్టి సారించింది.

Posted On: 13 SEP 2023 7:23PM by PIB Hyderabad

"భారతదేశంలో వన్యప్రాణుల్లో స్పిల్ ఓవర్ ఈవెంట్స్ పై రిస్క్-బేస్డ్ మేనేజ్‌మెంట్" అనే బహుళ-విభాగ వర్క్‌షాప్‌ ను డబ్ల్యూ.ఓ.ఏ.హెచ్. భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వ  మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలోని పశుసంవర్ధక, పాడి పరిశ్రమ విభాగం, హైదరాబాద్ హైటెక్ సిటీ రాడిసన్ లో 2023 సెప్టెంబర్ 11,  12 తేదీల్లో విజయవంతంగా నిర్వహించింది.

 

ఈ వర్క్‌-షాప్‌ ను పశుసంవర్ధక శాఖ క మిషనర్, డాక్టర్ అభిజిత్ మిత్రా, డబ్ల్యూ.ఓ.ఏ.హెచ్. ఆసియా పసిఫిక్ ప్రాంతీయ ప్రతినిధి డాక్టర్ హిరోఫుముయి కుగిటా ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో డాక్టర్ పాలో టిజానీ, డాక్టర్ లెసా థాంప్సన్, డాక్టర్ జాక్వెలిన్ లుసాటాన్, డాక్టర్ బాసిలియో వాల్డెహ్యూసా తోసహా డబ్ల్యూ.ఓ.ఏ.హెచ్ నుండి విశిష్ట నిపుణులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో కేరళ, ఉత్తరాఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ అనే ఆరు భారతీయ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పశుసంవర్ధక, మానవ ఆరోగ్యం, వన్యప్రాణుల విభాగాల నుండి 25 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.  వీరితో పాటు, ఐ.సి.ఏ.ఆర్., నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ ఎపిడెమియాలజీ అండ్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ (ఎం.ఐ.వి.ఈ.డి.ఐ), సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ ఐ.వి.ఆర్.ఐ., సంస్థల నుండి 13 మంది నిపుణులు పాల్గొన్నారు. అదే విధంగా, ఈ కార్యక్రమంలో డబ్ల్యూ.హెచ్.ఓ., ఎఫ్.ఏ.ఓ., యు.ఎస్.ఏ.ఐ.డి. రైజ్., వన్ హెల్త్ సపోర్ట్ యూనిట్ (ఓ.హెచ్ చెస్/యు)  నుండి పలువురు పరిశీలకులు కూడా పాల్గొన్నారు.

 

 

 

వన్యప్రాణుల మూల వ్యాధి ప్రమాద విశ్లేషణ గురించి వాటాదారుల జ్ఞానాన్ని పెంపొందించడం, భారతదేశ ప్రమాద అంచనా, నిర్వహణపై సమగ్ర విశ్లేషణ నిర్వహించడం, వ్యాధి స్పిల్‌ఓవర్ సంఘటనలను స్వీకరించడం, సంబంధిత వాటాదారుల్లో కమ్యూనికేషన్ తోపాటు, అవగాహన పెంపొందించడం వంటి నాలుగు కీలక లక్ష్యాలపై ఈ వర్క్-షాప్ దృష్టి సారించింది.  వన్ హెల్త్ అప్రోచ్, క్రాస్ సెక్టోరల్ సహకారం, మహమ్మారి సంసిద్ధత ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ముందుకు వెళ్ళే  మార్గంపై చర్చలతో వర్క్‌షాప్ ముగిసింది.  ఈ వర్క్‌-షాప్ లో ఏడు సెషన్లు ఉన్నాయి. ఇందులో రెండు సెషన్లలో రిస్క్ అనాలిసిస్ సిమ్యులేషన్ల గురించి ప్రత్యేకంగా చర్చిండం జరిగింది. (ఒకటి వ్యాధి "ఎక్స్" గురించి, మరొకటి ప్రత్యేకంగా భారతదేశానికి కేటాయించడం జరిగింది)  వన్యప్రాణులు, పర్యావరణ వ్యవస్థలతో పాటు, మనుషులు, పెంపుడు జంతువుల ఆరోగ్యంపై సురక్షితమైన, మరింత స్థిరమైన భవిష్యత్తును నిర్ధారించడానికి క్రాస్-సెక్టోరల్ సహకారంతో పాటు వన్ హెల్త్ విధానాన్ని అవలంబించడం యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకంగా పేర్కొంటూ, రెండు రోజుల వర్క్‌షాప్ లో విస్తృతంగా చర్చించడం జరిగింది. 

 

 

భవిష్యత్తులో వచ్చే మహమ్మారి ప్రభావాలను తగ్గించడానికి దేశాలు, ప్రాంతాలు తమ సంసిద్ధతను పెంచుకోవాల్సిన అవసరాన్ని కోవిడ్-19 మహమ్మారి నొక్కి చెప్పింది.  ఈ క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ,హెచో), యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (UNEP)తో సహా నాలుగు పక్షాలుగా ఉన్న భాగస్వాములతో డబ్ల్యూ.ఓ.ఏ.హెచ్. చురుకుగా సహకరిస్తోంది.

 

 

వన్యప్రాణులు, పెంపుడు జంతువులతో పాటు మానవుల ఆరోగ్యం పరస్పరం అనుసంధానమై ఉన్న ప్రపంచంలో; సహకారం, సమన్వయంతో కూడిన "వన్ హెల్త్" విధానం స్థిరమైన భవిష్యత్తుకు చాలా అవసరం.  ఈ వర్క్‌-షాప్‌ లో డబ్ల్యూ.ఓ.ఏ.హెచ్. మరియు భారత ప్రభుత్వ ఉమ్మడి ప్రయత్నాలు సురక్షితమైన, ఆరోగ్యకరమైన, మరింత స్థిరమైన ప్రపంచాన్ని నిర్మించాలనే నిబద్ధతకు ఉదాహరణగా నిలుస్తాయి. 

 

 

***



(Release ID: 1957249) Visitor Counter : 99


Read this release in: English , Urdu , Hindi , Tamil