రక్షణ మంత్రిత్వ శాఖ
పురాతన ఓడకు కీలు వేసే ప్రక్రియ
Posted On:
12 SEP 2023 8:51PM by PIB Hyderabad
గౌరవనీయులైన భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయమంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి ద్వారా గోవాలోని హోడి ఇన్నోవేషన్స్ సంస్థ వద్ద పురాతనమైన ఓడకు వినోదం కోసం 2023సెప్టెంబర్, 12వ తేదీన కీలు వేయడం జరిగింది. సి.ఎన్.ఎస్. కు చెందిన అడ్మిరల్ ఆర్. హరి కుమార్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ తో పాటు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత నౌకాదళానికి చెందిన ప్రముఖుల సమక్షం లో ఈ కార్యక్రమం జరిగింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సమకూర్చిన నిధులతో, భారత నౌకాదళం పర్యవేక్షణలో, బహుళ-మంత్రిత్వ శాఖల ప్రాజెక్టుగా ఈ పురాతనమైన ఓడ రూపకల్పన, పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. 22 నెలల్లో ఓడ నిర్మాణం, సరఫరా కోసం భారత నావికాదళం, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, గోవా లోని హోడి ఇన్నోవేషన్స్ సంస్థ మధ్య 2023 జులై, 18వతేదీన త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.
ఇది ఒక ఓడ ను రూపొందించడం, నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇది ఒక రకమైన చెక్క పడవ. దీన్ని పగ్గాలు, తాళ్ళతో కలపబడిన పలకలతో నిర్మించడం జరిగింది. ఇది మెటాలిక్ ఫాస్టెనర్లు రాకకు ముందు సముద్రపు నౌకలను నిర్మించడానికి పురాతన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సాంకేతికత. ఈ సాంప్రదాయ కళను పునరుద్ధరించి, సంరక్షించడంతో పాటు, భారతదేశ గొప్ప సముద్ర వారసత్వాన్ని ప్రపంచానికి ప్రదర్శించడం ఈ ఓడ నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
నౌకను పూర్తి చేసిన తర్వాత, భారతీయ నావికాదళం ద్వారా పురాతన నౌకాయాన పద్ధతులను ఉపయోగించి సాంప్రదాయ మార్గాలలో ఏదైనా ఒక మార్గంలో ఆగ్నేయాసియా / పర్షియన్ గల్ఫ్ కు 2025 లో ప్రయాణం సాగించేలా నిర్ణయించడం జరిగింది.
ప్రముఖుల ప్రసంగాల సంగ్రహం
భారతదేశ ప్రాచీన సముద్రపు వారసత్వాన్ని పునరుజ్జీవింపజేసే కార్యక్రమంగా ఈ సందర్భాన్ని గౌరవనీయులైన కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖల సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి ప్రత్యేకంగా పేర్కొంటూ, “2000 సంవత్సరాల నాటి భారతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పునరుజ్జీవింపజేసే విధంగా చెక్క పలకల ద్వారా ఈ నౌకకు కీలు వేసే మహత్తరమైన వేడుకలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ఈ విశిష్ట చొరవ భారతదేశానికి చెందిన గొప్ప నౌకానిర్మాణ వారసత్వాన్ని కీర్తిస్తుంది. భారతదేశాన్ని ప్రపంచానికి అనుసంధానించే మన ప్రాచీన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకప్పుడు మహాసముద్రాలలో ప్రయాణించిన నౌకలను గుర్తు చేస్తుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారతీయ నావికా దళం, నౌకా రవాణా, జలమార్గాలు, ఎం.ఈ.ఏ. మంత్రిత్వ శాఖ ల మధ్య సహకార ప్రయత్నం, పురాతన నౌకాయాన పద్ధతులను ఉపయోగించి సాంప్రదాయ సముద్ర వాణిజ్య మార్గాలలో పునర్నిర్మించిన ఓడలో భారతీయ నావికాదళం ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని చేపట్టడంతో ముగుస్తుంది. పునరావిష్కరణ, పునరుజ్జీవనం యొక్క ఈ అద్భుతమైన ప్రాజెక్టు భారతదేశ సాంస్కృతిక, నాగరికతల వారసత్వాన్ని గుర్తు చేస్తుంది. వీటిలో సముద్రయానం, నౌకా నిర్మాణం ఒక ముఖ్యమైన అంశం." అని వివరించారు.
భారతదేశ గొప్ప సముద్ర వారసత్వం గురించి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ మాట్లాడుతూ, ‘ఈ మహత్తర సందర్భం భారతీయులందరికీ మన దేశ ఘనమైన సముద్ర గతాన్ని పునశ్చరణ చేసుకోవడానికి, పండుగలా జరుపుకోవడానికి ఒక అవకాశం.' అని అభివర్ణించారు.
నౌకాదళం అధిపతి అడ్మిరల్ ఆర్. హరి కుమార్ మాట్లాడుతూ, "మన పూర్వీకుల గొప్పదనం, మన విలువలు, నీతిపై నమ్మకం, మన గత చరిత్ర పై సంపూర్ణ అవగాహన వంటివి, ఇప్పుడు మన దేశ అభివృద్ధి వెనుక శక్తిగా మారాయి. ముఖ్యంగా, ఈ ఉత్ప్రేరకం పెరుగుతున్న 'మొత్తం సమాజం' ప్రయత్నం లేదా లోపల నుండి వచ్చే అభిప్రాయాలకు అనుగుణంగా ఉంది. మనకు ప్రభుత్వం, సాయుధ బలగాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, చేతివృత్తుల వారు - ఈ రోజు ఇక్కడ సమావేశమవుతున్నారనే వాస్తవం, భారతదేశాన్ని సరైన స్థానానికి నడిపించాలనే మన ఉమ్మడి ఆశయానికి నిదర్శనం." అని చెప్పారు.
భారతదేశ గొప్ప సముద్ర చరిత్ర గురించి మన పౌరులకు అవగాహన కల్పించవలసిన అవసరం గురించి ఆయన నొక్కి చెబుతూ, "నేవీ కోసం, మన దేశంలో సముద్ర-అంధత్వాన్ని లేకుండా చేసి, సముద్ర చైతన్యాన్ని రేకెత్తించడంలో ఒక భాగమే ఈ నౌక నిర్మాణం. ఇందులో, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా వాణిజ్యం, సంస్కృతి, అనుసంధానం, సహ-శ్రేయస్సు కోసం, మన పౌరులు సముద్ర మార్గం గుండా ప్రపంచాన్ని చేరుకోవడానికి వెళతారు. శతాబ్దాలుగా ఈ ఓడల్లో ప్రయాణించిన భారతీయ నావికులు సరిగ్గా ఇదే పని చేశారు." అని పేర్కొన్నారు.
****
(Release ID: 1956895)
Visitor Counter : 131