వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పరిశుభ్రత మరియు సుపరిపాలన కోసం ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించిన వ్యవసాయ పరిశోధన మరియు విద్యా శాఖ
Posted On:
12 SEP 2023 4:37PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ క్యాంపెయిన్ 2.0కి కొనసాగింపుగా 10-నెలల పాటు స్వచ్ఛతా ప్రచారంలో భాగంగా డిఏఆర్‌ఈ మరియు దాని అధీనంలోని ఐకార్‌తో పాటు కెవికెలు, మూడు సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు (సిఏయూలు), అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏఎస్‌ఆర్‌బి) మరియు అగ్రినోవేట్ ఇండియా లిమిటెడ్ సంస్థలు వివిధ కార్యకలాపాలను చేపట్టాయి.
ఈ సమయంలో సాధించిన విజయాలు మరియు కార్యకలాపాలు:
- 1363 ప్రజా ఫిర్యాదులకు పరిష్కారం
- 10203 ఫైళ్ల తొలగింపు
- 353 పరిశుభ్రత/స్వచ్ఛతా ప్రచారాల నిర్వహణ
- 109700 చ.అడుగుల స్థలం ఖాళీ చేయబడింది.
- రూ.68,89,879 ఆదాయం సమకూరింది.
- 171 వీఐపీ సూచనలకు పరిష్కారం
- వీటికి అదనంగా స్వచ్ఛ భారత్ ప్రచారం సందర్భంగా వివిధ ఐకార్ ఇన్‌స్టిట్యూట్‌ల క్యాంపస్ కూడా ఈ క్రింది కార్యకలాపాలను చేపట్టాయి:
- వ్యర్థ పదార్థాలను బయోడిగ్రేడబుల్ మరియు నాన్ బయోడిగ్రేడబుల్ గా విభజించడం.
- కంపోస్టింగ్ మరియు పురుగుల-కంపోస్టింగ్ రూపంలో కలుపు మొక్కలు, చెత్త మరియు వ్యర్థ పదార్థాల తొలగింపుతో సహా పరిశుభ్రత చర్యలు.
- ప్లాస్టిక్ రహిత క్యాంపస్ డ్రైవ్‌లు.
కార్యక్రమంలో భాగంగా అవలంబించిన ఉత్తమ పద్ధతులు:
(ఎ) ఐకార్-సిఐపిహెచ్‌ఈటీ క్యాంపస్‌లోని ఒక ఉపయోగించని స్థలం ఆక్యుప్రెషర్ పార్క్‌గా మార్చబడింది. ఇది ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణం రెండింటినీ మెరుగుపరుస్తుంది. పర్యావరణంలో ఆక్సిజన్ స్థాయిని పెంపొందించడానికి నూట డెబ్బై ‘ఇండోర్ ప్లాంట్ పాట్స్’ ఆఫీసు గదుల్లో ఉంచబడ్డాయి.
(బి) స్వచ్ఛతా ప్రచారం సందర్భంగా ఐకార్-సిఐఎఫ్‌టి బృందం ఎర్నాకులంలోని మారాడు పంచాయతీ వద్ద ఉన్న వలంతకడు ద్వీప గ్రామంలో "సే నో టు ప్లాస్టిక్" అవగాహన డ్రైవ్‌ను నిర్వహించింది.
(సి) ఐకార్-సిఎంఎఫ్‌ఆర్‌ఐ, ప్రాంతీయ స్టేషన్ కాలికట్ "స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ్ సాగర్" నినాదంతో పెయింటింగ్ పోటీని నిర్వహించింది మరియు "తీర మరియు సముద్ర కాలుష్యం" అనే అంశంపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మరియు పెయింటింగ్ పోటీని నిర్వహించింది.
(డి) ఐకార్-ఐఏఆర్‌ఐ, జార్ఖండ్ వ్యర్థాల వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించింది మరియు వ్యవసాయ మరియు గృహ వ్యర్థ ఉత్పత్తులను ఉపయోగించి వర్మి కంపోస్టింగ్‌ను ప్రదర్శించింది.
పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించడం కోసం నెలరోజుల పాటు ప్రత్యేక ప్రచారం 2.0కి కొనసాగింపుగా ఈ విభాగం గత 10 నెలలుగా స్వచ్ఛతపై తన ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (డిఏఆర్‌ఈ) అక్టోబర్ 2నుండి అక్టోబర్31 వరకు పరిశుభ్రత మరియు సుపరిపాలన కోసం ప్రత్యేక ప్రచార 2.0ని కూడా నిర్వహించింది.
ప్రత్యేక ప్రచారం 2.0 సమయంలో డిఏఆర్‌ఈ మరియు దాని స్వయంప్రతిపత్త సంస్థ ద్వారా వివిధ కార్యకలాపాలు చేపట్టబడ్డాయి.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్). ఐకార్ దేశవ్యాప్తంగా 113 సంస్థలు మరియు 700కి పైగా కృషి విజ్ఞాన కేంద్రాలను (కెవికె) కలిగి ఉంది. ఈ ప్రత్యేక ప్రచారం 2.0 సందర్భంగా డేర్/ఐకార్‌కు చెందిన ఫీల్డ్/అవుట్‌స్టేషన్ కార్యాలయాలపై దృష్టి సారించారు. ఈ కాలంలో అవలంబించిన కొన్ని విజయాలు మరియు ఉత్తమ పద్ధతులు:
ప్రత్యేక ప్రచారం 2.0 యొక్క విజయాలు:
- స్వచ్ఛతా అవగాహన కార్యక్రమంలో 91,000 మంది వ్యక్తులు పాల్గొన్నారు.
- "పంట అవశేషాల నిర్వహణ"కు సంబంధించిన దాదాపు 980 కార్యకలాపాలు కెవికెలచే నిర్వహించబడ్డాయి. ఇందులో 35,000 కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు. వారిలో దాదాపు 28000 మంది రైతులు ఉన్నారు.
- వ్యర్థం నుండి సంపదపై సాంకేతికతలను ప్రదర్శించడం కోసం కెవికెల ద్వారా సుమారు 960 కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో 22,000 మందికి పైగా పాల్గొన్నారు.
- 1800 కంటే ఎక్కువ గ్రామాలలో 38,000 మందికి పైగా పాల్గొనడంతో గ్రామాలను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టబడింది. ఇందులో పాఠశాల విద్యార్థులు, రైతులు మరియు ఇతర సంఘం సభ్యులు ఉన్నారు.
- సుమారు 28,000 మంది పాఠశాల విద్యార్థులు 790కి పైగా కార్యకలాపాల ద్వారా పరిశుభ్రత, పారిశుద్ధ్యం వంటి వివిధ అంశాలపై దృష్టి సారించారు.
- కెవికెల యొక్క 8,000 కంటే ఎక్కువ మంది సిబ్బంది దాదాపు 2290 విభిన్న కార్యకలాపాల ద్వారా కార్యాలయాలను శుభ్రపరచడంలో మరియు స్క్రాప్‌లను పారవేయడంలో పాల్గొన్నారు.
- ఈ ప్రత్యేక ప్రచారంలో కార్యాలయ స్క్రాప్‌ను తొలగించడం ద్వారా రూ.40.00 లక్షల ఆదాయం సమకూరింది.
ప్రత్యేక ప్రచారం 2.0 సమయంలో అనుసరించిన ఉత్తమ పద్ధతులు:
- కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికెలు) ఇతివృత్త ప్రాంతాలలో వివిధ కార్యకలాపాలలో పాల్గొన్నాయి.వర్మికంపోస్ట్ ఉపయోగించి సూక్ష్మజీవుల ఆధారిత వ్యవసాయ వ్యర్థాల నిర్వహణ కోసం గ్రామాలను దత్తత తీసుకోవడం; స్వచ్ఛత గురించి అవగాహన కార్యక్రమం; పంట అవశేషాల నిర్వహణ; వ్యర్థాలు మరియు సంపదపై సాంకేతికతలను ప్రదర్శించడం; రైతులతో గ్రామాల పరిశుభ్రత కార్యక్రమం; పరిశుభ్రత, పారిశుధ్యం, పరిశుభ్రత వంటి వివిధ అంశాలపై పాఠశాల విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం; కార్యాలయాలు మరియు క్యాంపస్‌లను శుభ్రపరచడం మరియు స్క్రాప్‌లను పారవేయడం మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
- 38,000 కంటే ఎక్కువ మంది పాల్గొనే "వర్మికంపోస్ట్ టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయ వ్యర్థాల నిర్వహణ"ను ప్రోత్సహించడం కోసం 1,200 కంటే ఎక్కువ గ్రామాలను కెవికెలు దత్తత తీసుకున్నాయి.
****
(Release ID: 1956852)
Visitor Counter : 119