పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
స్వచ్ఛతను ప్రోత్సహించేందుకు & అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు 2 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ 2023 వరకు సాగనున్న ప్రత్యేక ప్రచారం 3.0లో పాలుపంచుకోనున్న పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
12 SEP 2023 8:08PM by PIB Hyderabad
పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కరించడం, స్వచ్ఛతను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక ప్రచారం 3.0ను సమన్వయం చేసి, నడిపించేందుకు పాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ నోడల్ విభాగం 2 అక్టోబర్ 2023 నుంచి 31 అక్టోబర్ 2023 వరకు జరిగే ఈ కార్యక్రమం కోసం మార్గదర్శకాలను జారీ చేసింది.
ఇందుకు అనుగుణంగా అపరిష్కృత సమస్యలను పరిష్కరించి, స్వచ్ఛతను ప్రోత్సహించే లక్ష్యంతో పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ 2 అక్టోబర్ 2023 నుంచి 31 అక్టోబర్ 2023 వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొననుంది. ఇందుకు ప్రచార సన్నాహక దశ 15 సెప్టెంబర్ 2023న మొదలు కానుంది.
ప్రభుత్వ కార్యాలయాలలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తగ్గించి, స్వచ్ఛతను వ్యవస్థీకరించే లక్ష్యంతో 02 నుంచి 31 అక్టోబర్ 2022న ప్రారంభమైన సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ప్రత్యేక ప్రచారం 2.0లో పర్యావరణం, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ పాలుపంచుకుంది. కేవలం మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా, క్షేత్ర స్థాయి కార్యాలయాలు, స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు, పిఎస్‌యులు సహా అనుబంధ కార్యాలయాలు అన్నీ ఈ ప్రచారంలో పాలుపంచుకున్నాయి.
కాగా, పర్యావరణం, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ, దాని అనుబంధ సంస్థలు డిసెంబర్ 2022 నుంచి ఆగస్టు 23 వరకు సాధించిన విజయాలలో ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి -
- 58, 433 ప్రజా ఫిర్యాదుల పరిష్కారం
- 14,886 చదరపు అడుగులు ఖాళీ చేయడం
- తుక్కును విసర్జించడం ద్వారా రూ. 21, 15,174 ఆదాయం ఆర్జన
- 5028 ఫైళ్ళ తొలగింపు
- 182 పారిశుద్ధ్య ప్రచారాలు
ప్రత్యేక ప్రచారం 3.0తోపాటుగా ఇంతకు ముందు ప్రచారాలలో సాధించిన విజయాలు, లక్ష్యాలపై నిర్మించేందుకు పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు శాఖ కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 1956843)
आगंतुक पटल : 161