వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
భారత ప్రమాణాల సంస్థచే గ్రామపంచాయితీల ద్వారా నాణ్యతా ప్రమాణాలపై దేశ ప్రజలలో అవగాహన కార్యక్రమాలు.
ఇప్పటివరకు 2.4 లక్షల గ్రామ పంచాయతీలకు చేరిన బి.ఐ.ఎస్. .
గ్రామ పంచాయతి అధ్యక్షులు, కార్యదర్శులకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టిన బి.ఐ.ఎస్
Posted On:
11 SEP 2023 7:16PM by PIB Hyderabad
భారత ప్రమాణాల సంస్థ –బిఐఎస్, భారతీయ ప్రమాణాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అవగాహనక కల్పించేందుకు , ప్రమాణాలను పాటింప చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను అమలు చేయడంలో భాగంగా భారత ప్రమాణాల సంస్థ దేశవ్యాప్తంగా గల గ్రామ పంచాయతీ అధ్యక్షులు, కార్యదర్శులకు దర్శులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టింది.
భారత ప్రమాణాల సంస్థ – బిఐఎస్ జాతీయ స్థాయిలో గల ప్రమాణాల సంస్థ. ఇది వివిధ ఉత్పత్తులకు సంబంధించిన ప్రమాణాలను నిర్దేశిస్తుంది. అలాగే ఆయా ఉత్పత్తులు,సేవలు నిర్దేశిత ప్రమాణాలకు తగినట్టు ఉన్నాయా లేదా అన్నది పరిశీలిస్తుంది., పౌరుల మేలును,పర్యావరణ హితాన్ని , ద్రుష్టిలో ఉంచుకుని వివిధ ఉత్పత్తుల నాణ్యత, సేవలు మొత్తంగా నిర్దేశిత ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూస్తుంది. ఇందుకు తగిన అవగాహన కల్పించేందుకు బిఐఎస్ అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది.
ఈ అవగాహనా కార్యక్రమాల ప్రధాన లక్ష్యం, గ్రామ పంచాయితీలు భారత ప్రమాణాల సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రాధాన్యతను గుర్తించేలా చూడడం.అలాగే ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు గ్రామస్థాయిలో అమలు చేయడంలో ఈ ప్రమాణాలు పాటించేలా చూసేందుకు అవగాహన కల్పించడం. గ్రామపంచాయితీలు బిఐఎస్ ప్రమాణాలను పాటించే సంస్క్రుతిని పెంపొందించి, తద్వారా ప్రజలు ప్రయోజనం పొందేట్టు చూడడం దీని ఉద్దేశం. వివిధ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయితీలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి .
బిఐఎస్ చేపట్టిన కార్యక్రమాలలో ముఖ్యాంశాలు:
1.2.4 లక్షల గ్రామపంచాయితీలలో కార్యక్రమాలు: బిఐఎస్ దేశవ్యాప్తంగా గల అన్ని గ్రామపంచాయితీలను తన కార్యక్రమాల ద్వారా చేరుకుంది. గ్రామ పంచాయితీలకు భారతప్రమాణాల సంస్థ రూపొందించిన సమాచార అవగాహనా పుస్తకాన్ని అందజేశారు.కేంద్ర ,రాష్ట్రప్రభుత్వాలు అమలు చేసే వివిధ పథకాలు, కార్యక్రమాలలో బిఐఎస్ ప్రమాణాలు పాటించేట్టు చూసే ఆవశ్యకత గురించి ఇందులో పేర్కొనడం జరిగింది.
2. అవగాహనా వర్క్ షాప్ లు:
గ్రామపంచాయితీ అధ్యక్షులు, కార్యదర్శులకు రాష్ట్ర, జిల్లా స్థాయి పాలనాయంత్రాంగాల సమన్వయంతో శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ శిక్షణా కార్యక్రమాలను బి.ఐ.ఎస్ కు చెందిన 38 బ్రాంచి కార్యాలయాల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ చర్యల ద్వారా ప్రయోజనం:
--నాణ్యత, భద్రత పెంపు: భారత ప్రమాణాల సంస్థ నిర్దేశించిన ప్రమాణాలు పాటించడం వల్ల,ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు గ్రామస్థాయిలో నాణ్యమైనవిగా ఉంటాయి.
--వినియోగదారుల రక్షణ : వివిధ ఉత్పత్తులు, సేవలకు సంబంధించి, బిఐఎస్ ప్రమాణాలు పాటించడం వల్ల
వినియోగదారులు నాణ్యతలేని ఉత్పత్తులు పొందకుండా, తగిన భద్రత లేని ఉత్పత్తులు తీసుకోకుండా ఉండడానికి వీలు కలుగుతుంది.
--పర్యావరణ పరిరక్షణ : బిఐఎస్ ప్రమాణాలు పాటించడం పర్యావరణానికి మేలు చేస్తుంది. దీనితో పర్యావరణంపై వ్యతిరేక ప్రభావం పడకుండా ఉంటుంది.
--సామర్ధ్యాల నిర్మాణం: బిఐఎస్ వర్క్ షాప్లు గ్రామపంచాయితీ సిబ్బందికి సాధికారత కల్పించేందుకు , వారికి తగిన సమాచారం అందించడమే కాక, ప్రమాణాలు పాటించేలా చేసేందుకు అవసరమైన ఉపకరణాల గురించి తెలియజేయడం జరుగుతుంది.
దేశప్రగతి: ప్రమాణాలు పాటించడం ద్వారా దేశప్రగతికి వీలు కలుగుతుంది. అన్ని రంగాలలో నాణ్యతా ప్రమాణాల సంస్క్రుతి, భద్రత దేశ సుసంపన్నతకు,పురోగతికి దారితీస్తుంది.
--బిఐఎస్ కేర్ యాప్ పై అవగాహన: వినియోగదారులకు సాధికారత కల్పించేందుకు బిఐఎస్ సంస్థ, బిఐఎస్ కేర్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆండ్రాయిడ్, ఐఒఎస్ ప్లాట్ ఫారంలలో అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఈ యాప్ ద్వారా భారత ప్రమాణాల సంస్థకు సంబంధించిన సమాచారం పొందవచ్చు.అలాగే తప్పనిసరి సర్టిఫికేషన్ కింద గల ఉత్పత్తుల వివరాలు తెలుసుకోవచ్చు. బిఐఎస్ సర్టిఫికేట్ పొందిన తయారీదారుల జాబితా, సర్టిఫికేట్ పొందిన సంస్థల ఉత్పత్తుల గురించి తనిఖీ, వినియోగదారు సంత్రుప్తి చెందకపోతే ఫిర్యాదు చేయడానికి వెసులుబాటు వంటివి ఇందులో ఉన్నాయి.
బిఐఎస్ వర్క్ షాపులు నిర్వహించడానికి రాష్ట్ర, జిల్లాస్థాయి సంబంధిత విభాగాలు తమ సహకారాన్ని అందజేయాల్సిందిగా బిఐఎస్ పిలుపునిచ్చింది. ఇది క్షేత్రస్థాయిలో నాణ్యతా ప్రమాణాలను అమలు చేయడానికి పనికివస్తుంది.తద్వారా నాణ్యమైన మౌలికసదుపాయాల కల్పనకు వీలుకలుగుతుంది.
గ్రామీణప్రాంతాలలో , ఉమ్మడి చర్యల ద్వారా నాణ్యతా ప్రమాణాలను అమలు చేసినట్టయితే, ఇదిపౌరుల ప్రయోజనాలను కాపాడడమే కాక,దేశపురోగతి సాధించడానికి తొడ్పడుతుందని బి.ఐ.ఎస్ పేర్కొంది.
***
(Release ID: 1956523)
Visitor Counter : 159