ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

"ఆధార్‌ను పునఃకల్పన చేయండి" థీమ్‌తో యూ ఐ డి ఎ ఐ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ లో పాల్గొంటోంది.


జీ ఈ ఎఫ్ 2023లో యూ ఐ డి ఎ ఐ ఉత్పత్తి లో నూతన అంశాలు మరియు పరిశ్రమ భాగస్వాములతో సహకారాన్ని ప్రదర్శిస్తుంది

Posted On: 06 SEP 2023 3:59PM by PIB Hyderabad

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూ ఐ డి ఎ ఐ) ఆధార్ గుర్తింపు ప్లాట్‌ఫారమ్‌ను ప్రభావితం చేయడానికి మరియు నివాసితులు వారి అందుబాటు లో పలు సేవలను పొందేందుకు నిరంతర సేవలను అందించడానికి సదా కృషి చేస్తోంది.

 

ఈ సంవత్సరం యూ ఐ డి ఎ ఐ ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో “ఆధార్ #ప్రామాణీకరణను తిరిగి రూపొందించడం” అనే థీమ్‌తో పూర్తిగా అంతర్గతంగా అభివృద్ధి చేసిన ఏ ఐ మరియు ఎం ఎల్ ఇంజిన్‌ల ఆధారితమైన  మెరుగైన ముఖ గుర్తింపు  సదుపాయాన్ని ప్రదర్శించింది.

 

సాంకేతికతను వేగంగా స్వీకరించడానికి మరియు నివాసితులకు మరింత మెరుగైన సేవలందించేందుకు మెరుగైన పరిష్కారాలు మరియు ఉత్పత్తులను కనుగొనడానికి, దాని వాలంటీర్ గైడ్‌లైన్ 2022 ప్రకారం యూ ఐ డి ఎ ఐ పరిశ్రమ మరియు ఫిన్‌టెక్ భాగస్వాములను  ప్రోత్సహిస్తోంది.

 

ముఖ గుర్తింపు ప్రామాణీకరణ కోసం నివాసితుల అనుభవాన్ని మెరుగుపరచడానికి యూ ఐ డి ఎ ఐ గత కొన్ని నెలలుగా ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ తో కలిసి పని చేసింది. మెరుగైన మోసం గుర్తింపు మరియు మోసం నివారణ విధానాలను కలిపి తక్కువ కాంతి స్థితిలో సైతం ముఖ గుర్తింపును నిర్ధారించడానికి రెండు బృందాలు సన్నిహితంగా పని చేయడం ద్వారా దీనిని సాధించారు.

 

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లబ్ధిదారులకు హాజరు వ్యవస్థలు మరియు బ్యాంకులు కస్టమర్లను పొందటం వంటి భాగస్వామి వినియోగ కేసులు కూడా ప్రదర్శించబడ్డాయి.

 

జీ ఈ ఎఫ్ 2023లో భాగంగా, యూ ఐ డి ఎ ఐ వివిధ ఫిన్‌టెక్ సంస్థల అధికారులు మరియు అనుబంధ పర్యావరణ వ్యవస్థ భాగస్వాములతో  సహకరించడానికి, సహ-ఆవిష్కరించడానికి మరియు విస్తృత అవకాశాలను అన్వేషించే ఉద్దేశ్యంతో"కలిసి ఆధార్ పునఃకల్పన" అనే థీమ్‌తో పరిశ్రమ సమావేశాన్ని కూడా నిర్వహించింది.

 

ఆవిష్కరణ పై ప్రత్యేక దృష్టితో  కొత్త శాండ్‌బాక్స్ వాతావరణంలో ఆవిష్కరణను ప్రారంభించడానికి రోడ్‌మ్యాప్‌ను మరియు  మరియు ఆవిష్కరణలను సులభతరం చేయడానికి అంకితమైన  పరిశోధన కోసం యూ ఐ డి ఎ ఐ టెక్ సెంటర్‌లో అత్యాధునిక ఆర్ & డి లాబ్ ను కూడా యూ ఐ డి ఎ ఐ అందించింది.

 

ఇది నివాసితులు కోసం సురక్షితమైన, నిరంతర  మరియు సమ్మిళిత ఆధార్‌ కోసం  విద్యావేత్తలు మరియు పరిశ్రమ భాగస్వాములు కలిసి పని చేసేలా ప్రోత్సహించడానికి యూ ఐ డి ఎ ఐ బృందం వేసిన మరో ముందడుగు.

 

****



(Release ID: 1955309) Visitor Counter : 135