భారత పోటీ ప్రోత్సాహక సంఘం

టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్ ఇండియాలో విలీనం చేయడానికి, ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ కొంత వాటాను కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం

Posted On: 01 SEP 2023 7:50PM by PIB Hyderabad

టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్ ఇండియాలో విలీనం చేయడానికి, ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ కొంత వాటా కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదించింది. పార్టీలు పాటించే స్వచ్ఛంద కట్టుబాట్లకు లోబడి ఈ అనుమతులు జారీ చేసింది.

ప్రతిపాదిత కొనుగోలు ద్వారా (ఎ) టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్‌ (టీఎస్‌ఏఎల్‌/విస్తారా) ఎయిర్ ఇండియా లిమిటెడ్‌లో (ఏఐఎల్‌/ఎయిర్‌ ఇండియా) విలీనం అవుతుంది. విలీన సంస్థగా ఏఐఎల్‌ మనుగడలో ఉంటుంది. (బి) విలీన సంస్థలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ (ఎస్‌ఐఏ), టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్‌పీఎల్‌) నిర్దిష్ట వాటాలు కొనుగోలు చేస్తాయి (సి) విలీన సంస్థలో ఎస్‌ఐఏకి ప్రాధాన్యత ప్రాతిపదికన అదనపు వాటాల కేటాయింపు జరుగుతుంది.

టీఎస్‌పీఎల్‌ అనేది పెట్టుబడుల సంస్థ. ఇది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 'కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ'గా నమోదైంది. టీఎస్‌పీఎల్‌ (తాలస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా) 27 జనవరి 2022న ఏఐఎల్‌ కొనుగోలును పూర్తి చేసింది.

ఏఐఎల్‌ (తన సంపూర్ణ యాజమాన్యంలోని అనుబంధ సంస్థలైన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్, ఏఐఎక్స్‌ కనెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి) (ఎ) దేశీయ షెడ్యూల్డ్ విమాన సర్వీసులు (బి) అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమాన సర్వీసులు (ఏఐఎక్స్‌ కనెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ వ్యాపారంలో లేదు) (సి) సరకు రవాణా సేవలు (డి) చార్టర్ విమాన సేవలను అందించే వ్యాపారం చేస్తోంది.

టీఎస్‌ఏఎల్‌ అనేది టీఎస్‌పీఎల్‌ & ఎస్‌ఐఏ మధ్య ఏర్పడిన జాయింట్ వెంచర్. ఇందులో టీఎస్‌పీఎల్‌ & ఎస్‌ఐఏకు వరుసగా 51%, 49% వాటాలు ఉన్నాయి. టీఎస్‌ఏఎల్‌ "విస్తారా" బ్రాండ్ పేరుతో పని చేస్తోంది. టీఎస్‌ఏఎల్‌ (ఎ) దేశీయ షెడ్యూల్డ్ విమాన సర్వీసులు (బి) అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమాన సర్వీసులు (సి) సరకు రవాణా సేవలు, (డి) చార్టర్ విమాన సేవలు (దేశీయ & అంతర్జాతీయ) అందించే వ్యాపారం చేస్తోంది.

ఎస్‌ఐఏ అనేది ఎస్‌ఐఏ గ్రూపు కంపెనీలకు మాతృ సంస్థ. ఎస్‌ఐఏ కూడా ప్రయాణీకులను, సరకును వాయు మార్గాన రవాణా చేసే వ్యాపారంలో ఉంది. వీటితో పాటు ఇంజినీరింగ్ సేవలు, పైలట్‌లకు శిక్షణ, ఎయిర్ చార్టర్‌లు, పర్యటన కార్యకలాపాలు, సరుకుల విక్రయం, సంబంధిత కార్యకలాపాలను ఎస్‌ఐఏ గ్రూపు నిర్వహిస్తోంది.

సీసీఐ వివరణాత్మక ఆదేశం రావలసి ఉంది.

 

****



(Release ID: 1954320) Visitor Counter : 137


Read this release in: Hindi , English , Urdu