రక్షణ మంత్రిత్వ శాఖ
ఐదు డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ (డీ.ఎస్.సీ.) ప్రాజెక్ట్ కింద మొదటి షిప్ ' డీ.ఎస్.సీ. ఏ 20 (యార్డ్ 325)' ప్రారంభం
కోల్‌కతాలోని మెస్సర్స్ టిటాగర్ రైల్ సిస్టమ్స్ సంస్థలో తయారైన అత్యాధునిక షిప్
Posted On:
31 AUG 2023 8:27PM by PIB Hyderabad
కోల్కతాలోని మెస్సర్స్ టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఆర్ఎస్ఎల్) 05 డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ (డి.ఎస్.సి.) ప్రాజెక్ట్ కింద రూపొందించిన మొదటి నౌకను భారత నావికాదళం కోసం 31 ఆగస్టు 2023న టిటాగర్, కోల్కతా (WB) వద్ద హుగ్లీ నదిపై ప్రారంభించబడింది. టీఆర్ఎస్ఎల్ సంస్థను గతంలో మెస్సర్స్ టిటాగర్ వ్యాగన్స్ లిమిటెడ్గా పిలిచేవారు (టీబడ్ల్యుఎల్). ఈ లాంచ్ వేడుకకు డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ (డీసీఎన్ఎస్) వీఏడీఎం సంజయ్ మహింద్రు అధ్యక్షత వహించారు. నావికాదళ సంప్రదాయానికి అనుగుణంగా శ్రీమతి ఆరాధనా మహీంద్రు అథర్వవేదం నుండి ఆహ్వానంతో నౌకను ప్రారంభించారు. ఐదు (05) డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ (డి.ఎస్.సి.) నిర్మాణానికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ, కోల్కతాలోని మెస్సర్స్ టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఆర్ఎస్ఎల్) మధ్య 12 ఫిబ్రవరి 2021న ఒక ఒప్పందం సంతకం చేయబడింది. ఈ తరహా నౌకలు నౌకాశ్రయాలు మరియు తీర జలాల్లో కార్యాచరణ/ శిక్షణ డైవింగ్ కార్యకలాపాలను చేపట్టేందుకు రూపొందించబడ్డాయి. ఇవి సుమారు 300 టన్నుల స్థానభ్రంశంతో 30 మీటర్ల పొడవు గల కాటమరాన్ హల్ షిప్లు. మొత్తం ఐదు (05) డి.ఎస్.సి.లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత నౌకాదళానికి అందించబడుతాయని అంచనా. డి.ఎస్.సి. డైవింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుగా అత్యాధునిక డైవింగ్ పరికరాలు మరియు సాధనాలను అమర్చబడి తయారు చేయబడింది. ఈ నౌకలు దేశీయంగా రూపొందించబడ్డాయి. సంబంధిత నావల్ రూల్స్ మరియు రెగ్యులేషన్ ఆఫ్ ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్) క్రింద నిర్మించబడ్డాయి. డిజైన్ దశలో నౌకల హైడ్రోడైనమిక్ విశ్లేషణ/నమూనా పరీక్ష విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (ఎన్ఎస్టీఎల్)లో చేపట్టబడింది. స్వదేశీ తయారీదారుల నుండి లభించే చాలా ప్రధాన మరియు సహాయక పరికరాలతో ఈ నౌకలు మేక్ ఇన్ ఇండియా మరియు మేక్ ఫర్ ది వరల్డ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ఇండియా (భారత ప్రభుత్వం)/ రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓడీ) యొక్క గర్వించదగిన జెండాను కలిగి ఉన్నాయి. ముఖ్య అతిథి, సంజయ్ మహింద్రు 1వ డి.ఎస్.సిని ప్రారంభించే సమయంలోని 5వ మరియు చివరి డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ (డి.ఎస్.సి) అంటే డి.ఎస్.సి ఏ 24 యొక్క కీల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడమైంది. ఇది భారత నావికాదళం కోసం మొత్తం ఐదు డి.ఎస్.సి.లను ఏకకాలంలో నిర్మించడాన్ని సూచిస్తుంది.
*****
(Release ID: 1954053)
Visitor Counter : 166