రక్షణ మంత్రిత్వ శాఖ
ఉద్యోగ విరమణ చేసిన సైనికులకు మరో ఉపాధి కల్పించేందుకు ప్రైవేట్ రంగంతో ఒప్పందం కుదుర్చుకున్న విశ్రాంత సైనికుల సంక్షేమ విభాగం
Posted On:
31 AUG 2023 3:33PM by PIB Hyderabad
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని విశ్రాంత సైనికుల సంక్షేమ విభాగం పరిధిలో పని చేసే 'డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్‌మెంట్' (డీజీఆర్), 'జెన్‌పాక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. 31 ఆగస్టు 2023న న్యూదిల్లీలో ఒప్పందం రెండు వర్గాలు సంతకాలు చేశాయి. రక్షణ సేవల నుంచి ఉద్యోగ విరమణ చేసిన సైనికులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్పొరేట్ కంపెనీలు & విశ్రాంత సైనికులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ ఒప్పందం ప్రయత్నిస్తుంది.
వృత్తిపరమైన సేవల్లో ప్రపంచ స్థాయి సంస్థ అయిన జెన్‌పాక్ట్, విశ్రాంత ఉద్యోగులకు మంచి ఉపాధి అవకాశాలను అందిస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ (పునరావాసం) మేజర్ జనరల్ శరద్ కపూర్ మాట్లాడారు. “ఈ ఒప్పందం, మన విశ్రాంత సైనికుల గురించి పరిశ్రమ, కార్పొరేట్ సంస్థలకు మరింత స్పష్టమైన వివరాలను అందిస్తుంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడం, మన విశ్రాంత సైనికులకు గౌరవప్రదమైన రెండో వృత్తిని అందించడం వంటి లక్ష్యాలను సాధించడంలో సాయపడుతుంది” అని చెప్పారు.
***
(Release ID: 1953935)
Visitor Counter : 124