చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

టెలి-లా 2.0ని ఆవిష్కరించిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి


డిజిటల్‌ విధానంలో పౌర-కేంద్రీకృత న్యాయ సేవలు అందించడంలో టెలి-లా 2.0 తో నూతన శకానికి నాంది
దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన 50 లక్షల ప్రీ-లిటిగేషన్ సలహా సేవలు

టెలి-లా, ప్రో బోనో ప్రోగ్రామ్‌లను ఏకీకృతం చేసి రూపొందించిన టెలి-లా 2.0లో ద్వారా అట్టడుగు స్థాయిలో ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి రానున్న పౌర-కేంద్రీకృత సేవలు

సిఎస్సి- విఎల్ఈ లు, టెలి లా ప్యానెల్ లాయర్లు, లబ్ధిదారులతో వర్చువల్ విధానం ద్వారా మాట్లాడిన న్యాయశాఖ మంత్రి

వాయిస్ ఆఫ్ బెనిఫిషియరీస్ బుక్‌లెట్ 4వ ఎడిషన్‌ను ఆవిష్కరించిన మంత్రి

Posted On: 25 AUG 2023 6:36PM by PIB Hyderabad

భారత న్యాయ రంగంలో సరికొత్త శకానికి నాంది పలికే విధంగా రూపొందిన టెలి-లా 2.0ని కేంద్ర న్యాయ శాఖ సహాయ  మంత్రి (స్వతంత్ర భాద్యత) శ్రీ అర్జున్ రాం మేఘవాల్ ఈ రోజు ఆవిష్కరించారు.
కేంద్ర  న్యాయ శాఖ, న్యాయ , న్యాయ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న  టెలి-లా కార్యక్రమంలో భాగంగా టెలి-లా 2.0ని రూపొందించారు. దిశా పథకం కింద అమలు జరుగుతున్న ఈ సంచలనాత్మక కార్యక్రమం ఇప్పటికే  50 లక్షల న్యాయపరమైన సంప్రదింపులు అందించి  ఒక ముఖ్యమైన మైలురాయి సాధించింది.   దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి న్యాయవ్యవస్థ అందుబాటులోకి రావాలన్న లక్ష్యంతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మూలకు చేరుతుందని నిర్ధారించడానికి దాని అచంచలమైన అంకితభావాన్ని బలపరుస్తుంది. టెలి-లా 2.0ని  న్యాయ, న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆవిష్కరించారు. .టెలి-లా, ప్రో బోనో ప్రోగ్రామ్‌లను ఏకీకృతం చేసి రూపొందించిన టెలి-లా 2.0 ని అభివృద్ధి చేశారు. ప్రజలకు    , న్యాయ సహాయాన్ని  మరింత అందుబాటులోకి తీసుకురావడానికి టెలీ-లా 2.0 అమలు జరుగుతుంది.  ప్రజాస్వామ్యబద్దంగా న్యాయ సేవలు అందించే అంశంలో  టెలి-లా 2.0  కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తెలిపారు.
 టెలీ-లా 2.0 ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన  శ్రీ మేఘ్వాల్  డిజిటల్‌ విధానంలో  పౌర-కేంద్రీకృత న్యాయ సేవలు అందించడంలో  టెలి-లా 2.0 తో నూతన శకానికి నాంది పలుకుతుందన్నారు. 
 సాంకేతిక అంశాలు ప్రజా జీవనంలో కీలకంగా మారాయని మంత్రి అన్నారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా న్యాయ సేవలు కూడా అభివృద్ధి సాధించాలని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  టెలి-లా పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న  లబ్ధిదారుల సంఖ్య 50 లక్షల మైలురాయిని చేరిందన్నారు.  ఒకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా చట్టపరమైన మార్గదర్శకత్వం, సహకారం, ప్రాతినిధ్యం వహించే విధంగా అభివృద్ధి చెందిన వ్యవస్థ  డిజిటల్ అక్షరాస్యత అందించి ప్రజలకు  సాధికారత కలిగిస్తుందన్నారు. . ఏ పౌరుడు కూడా అవసరమైన న్యాయ సహాయం కోల్పోకుండా ఉండేలా ప్రో బోనో సేవలను అందించాలని న్యాయ నిపుణులకు శ్రీ మేఘవాల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ బెనిఫిషియరీస్ బుక్‌లెట్  4వ ఎడిషన్‌ను శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్   విడుదల చేశారు.

టెలి-లా,న్యాయ బంధు ప్రో బోనో లీగల్ సర్వీసెస్ మధ్య ఏకీకరణను  శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ లాంఛనంగా ఆవిష్కరించారు, దీనితో పాటు టెలి-లా వల్ల కలిగిన ప్రయోజనాలు వివరిస్తూ రూపొందించిన  సంక్షిప్త చిత్రం, ఏకీకరణ ప్రక్రియపై రూపొందించిన  ఇ-ట్యుటోరియల్ ను మంత్రి ఆవిష్కరించారు. నూతన విధానం వల్ల న్యాయ సహాయం కోరే వారికి, అనుకూల న్యాయవాదుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పడుతుంది. ప్రజలందరికి న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే విధంగా  వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. 

 న్యాయ నిపుణులు ప్రో బోనో సేవలు అందించాలని శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ పిలుపునిచ్చారు. ప్రజలందరికీ  అవసరమైన న్యాయ సహాయం అందాలని ఆయన అన్నారు. ప్రో బోనో వివరాలను మంత్రి వివరించారు.మూలాలను అర్థం చేసుకోవడానికి భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని లోతుగా పరిశోధించాలని న్యాయ విద్యార్థులను, న్యాయనిపుణులకు మంత్రి సూచించారు.' ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు,  వారికి సహాయం చేయడం భారతీయ సంప్రదాయం; అది ప్రో బోనో'' అని మంత్రి వివరించారు.  'దీపం లో వత్తి, నూనె ఉన్నాయి , మీరు టెలి-లా ద్వారా దానిని  వెలిగించాలి.  తుఫాను వచ్చినా  వర్షం వచ్చినా దీపం వెలుగుతునే ఉండాలి" అని సూచించిన మంత్రి  వ్యవస్థ విజయం సాధించడానికి, ప్రతి ఒక్కరికీ న్యాయం అందేలా చూసేందుకు సమిష్టి కృషి జరగాలన్నారు.  న్యాయ శాఖ తన లక్ష్యాన్ని చేరుకొని  భారతదేశం అంతటా న్యాయం అమలు జరిగేలా ,చూడాలని మంత్రి అన్నారు. 

కార్యక్రమంలో భాగంగా  శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తలు (VLEలు), లబ్ధిదారులు,ప్యానెల్ న్యాయవాదులతో మాట్లాడారు. అభిప్రాయాలు, సలహాలు ఇవ్వాలని కోరారు. టెలి-లా కార్యక్రమం అమలుకు జరుగుతున్న  అభినందించారు.  ఫ్రంట్‌లైన్ కార్యదర్శులను సర్టిఫికేట్‌లతో మంత్రి  సత్కరించారు. చిన్న వివాదాలు పూర్తి స్థాయి వ్యాజ్యం వరకు పెరగకుండా నివారించడంలో ముందస్తు వివాద పరిష్కారం , పారా లీగల్ వాలంటీర్లు, గ్రామ-స్థాయి వ్యవస్థాపకుల పాత్ర ప్రముఖంగా ఉంటుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో టెలి-లా ద్వారా సానుకూలంగా ప్రభావితం చేయబడిన వ్యక్తుల నిజ జీవిత కథలు ప్రస్తావిస్తూ  రూపొందించిన వాయిస్ ఆఫ్ బెనిఫిషియరీస్ పుస్తకాన్ని విడుదల చేశారు. 

భవిష్యత్తులో   టెలి-లా మరింత పటిష్టంగా అమలు జరగాలని శ్రీ మేఘ్వాల్ అన్నారు.  . దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా న్యాయం జరిగేలా టెలి-లా సేవలను త్వరలో 2.65 లక్షల గ్రామ పంచాయతీలకు ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా అందిస్తామని మంత్రి వివరించారు.  2026 నాటికి కోటి మంది లబ్ధిదారులకు టెలి-లా కార్యక్రమం ద్వారా సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న  న్యాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ రాజిందర్ కుమార్ కశ్యప్  న్యాయవ్యవస్థ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలని, ఇది ప్రతి ఒక్కరి హక్కు అని అన్నారు. న్యాయ వ్యవస్థ పరిధి విస్తరణలో  టెలి-లా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 

 కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా న్యాయ సలహాలు అందించడానికి టెలి-లా కార్యక్రమం అందిస్తున్న  వినూత్న విధానాన్ని జస్టిస్ శ్రీ SKG రహతే వివరించారు.  కార్యక్రమం  సాధించిన విజయాలను వివరించిన శ్రీ  రహతే దేశంలో సీఎస్ సి  ల సంఖ్య 1800 నుండి  2.5 లక్షల గ్రామ పంచాయతీలకు పెరిగిందన్నారు.  2026 నాటికి 1 కోటి మంది లబ్ధిదారులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యం అని ఆయన చెప్పారు.  

కార్యక్రమంలో న్యాయ శాఖ  ప్రత్యేక కార్యదర్శి శ్రీ రాజిందర్ కుమార్ కశ్యప్, సంయుక్త కార్యదర్శిశ్రీ నీరజ్ కుమార్ గయాగి,  శ్రీ అక్షయ్ కుమార్ ఝా తదితరులు పాల్గొన్నారు. 

 

***



(Release ID: 1952300) Visitor Counter : 187