పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
టెర్మినల్ భవనాల నిర్మాణ ఆకృతులపై ఏఏఐ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర పౌర విమానయాన,ఉక్కు శాఖ మంత్రి
సాంప్రదాయ, స్థానిక నిర్మాణఆకృతులకు ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తులో వివిధ విమానాశ్రయాలలో టెర్మినల్ భవనాల నిర్మాణం
Posted On:
25 AUG 2023 12:49PM by PIB Hyderabad
టెర్మినల్ భవనాల నిర్మాణ ఆకృతులపై ఏఏఐ రూపొందించిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఈ రోజు కేంద్ర పౌర విమానయాన ,ఉక్కుశాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా ఈరోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. విమానాశ్రయాల టెర్మినల్ భవనాల నిర్మాణంలో ఉపయోగించిన సాంప్రదాయ, స్థానిక ఆకృతులను పుస్తకంలో పొందుపరిచారు. . 19 విమానాశ్రయాల టెర్మినల్ భవనాల చిత్రాలతో పుస్తకాన్ని రూపొందించారు. సాంప్రదాయ, స్థానిక నిర్మాణఆకృతులకు ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తులో వివిధ విమానాశ్రయాలలో టెర్మినల్ భవనాల నిర్మాణం చేపట్టేందుకు సాగుతున్న ప్రయత్నాలకు అనుగుణంగా పుస్తకాన్ని రూపొందించారు.
దేశ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా స్థానిక భారతీయ సాంప్రదాయ, స్థానిక కళకు ప్రాధాన్యత ఇస్తూ ఇకపై టెర్మినల్ భవనాల నిర్మాణం జరుగుతుంది.
విమానాల రాకపోకల్లో టెర్మినల్ భవనాల పాత్ర కీలకంగా ఉంటుంది. విమాన ప్రయాణం సాఫీగా, ఇబ్బందులు లేకుండా జరిగేందుకు సహకరించే వివిధ సేవలు టెర్మినల్ భవనంలో అందిస్తారు. ఒక నగరానికి విమానంలో వచ్చే వారికి టెర్మినల్ భవనం మొదటి అనుభూతి అందిస్తుంది. నగరంపై ప్రయాణీకులకు ఒక అవగాహన కల్పిస్తుంది. టెర్మినల్ భవనాలు ఇకపై సేవలు, సౌలభ్యం అందించే భవనాలుగా మాత్రమే కాకుండా ప్రయాణీకులకు విస్మయం, అద్భుత అనుభూతిని కలిగించే అద్భుతాలుగా నగరానికి మైలురాయిగా ఉండే విధంగా నిర్మించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
భారతదేశ సామాజిక, సాంస్కృతిక వైవిధ్యం,వారసత్వాన్నిప్రపంచానికి చాటి చెప్పాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించారు. దీనికోసం స్వయంగా కృషి చేస్తున్న ప్రధానమంత్రి వివిధ మంత్రిత్వ శాఖలకు మార్గదర్శకాలు జారీచేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నుంచి స్ఫూర్తి పొందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా చర్యలు ప్రారంభించారు. ప్రయాణికులకు, చూసే వారికి భారతదేశ వారసత్వం సారాంశాన్ని తెలియజేసే విధంగా ఇప్పటికే పనిచేస్తున్న, భవిష్యత్తులో నిర్మించే టెర్మినల్ భవనాలలో భారతీయ వాస్తుశిల్పం నైపుణ్యాన్ని క్రియాత్మక సౌలభ్యంతో రంగ రించాలని శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా నిర్ణయించారు. వారసత్వ విలువలు, స్థానిక కళతో రూపుదిద్దుకునే టెర్మినల్ భవనాలు కేవలం భవనాలుగా మాత్రమే మదిలో కలకాలం గుర్తుండి పోయే విధంగా రూపుదిద్దుకుంటాయి.
శ్రీ జ్యోతిరాదిత్య సూచనల మేరకు టెర్మినల్ భవనాలను సంబంధిత నగరం రూపురేఖలు అనుగుణంగా నిర్మించడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కృషి ప్రారంభించింది. టెర్మినల్ భవనాలు కేవలం భౌతిక అంశాలుగా కాకుండా భారతదేశ సంస్కృతి, సంప్రదాయం, కళ ను ప్రబింబించే కట్టడాలు గా నిలుస్తాయి. టెర్మినల్ భవనాలు స్థానిక ప్రజల గౌరవ మర్యాదలు, జాతీయ స్ఫూర్తికి ప్రతీకగా ఉంటాయి.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ బన్సాల్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఓఎస్డీ శ్రీ చంచల్ కుమార్, బీసీఏఎస్ డీజీ శ్రీ జుల్ఫికర్ హసన్, డీజీసీఏ శ్రీ విక్రమ్ దేవ్ దత్, ఏఏఐ చైర్మన్ శ్రీ సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 1952198)
Visitor Counter : 110