మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
నార్వే సందర్శించిన, కేంద్ర మత్య్స, పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖమంత్రి శ్రీ పర్షోత్తం రూపాల నాయకత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి వర్గం.
చేపలు, ఆక్వాకల్చర్ రంగాలలో ఇండియా, నార్వేల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేఉద్దేశంతో నార్వేపర్యటన
ఆక్వాజెన్‌రంగంలో సంయుక్త సమకారానికి గల అవకాశాలపై చర్చించిన కేంద్ర మంత్రి.
Posted On:
22 AUG 2023 6:20PM by PIB Hyderabad
కేంద్ర మత్య, పశుసంవర్థక,పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీపర్షోత్తం రూపాల నాయకత్వంలో, కేంద్ర మత్య్స, పశుసంవర్థక , పాడిపరిశ్రమ శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ సహా ఉన్నతస్థాయి ప్రతినిధి వర్గం ఈరోజు నార్వే సందర్శించింది.
మత్స్య, ఆక్వాకల్చర్ రంగాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు దోహదపడే రంగాలుగా గుర్తింపుపొందడంతో, భారత ప్రభుత్వం ఈ రంగాలకు సంబంధించి అంతర్జాతీయంగా పురోగమించడానికిగల అవకాశాలకు సంబంధించి పలు చర్యలు తీసుకుంటోంది. ఇందుకు అనుగుణంగా, ఇండియా, నార్వేల మధ్య మత్స్య, ఆక్వాకల్చర్ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు నార్వే పర్యటనను ఏర్పాటు చేశారు.
భారత ప్రతినిధి వర్గం నార్వేలోని క్లోస్‌టెర్‌గటాలోని ట్రోన్‌థీమ్ స్పెక్ట్రం (మెండెల్ షామ్ కాన్ఫరెన్స్ హాల్ )లో జరిగిన ఆక్వా నార్ 2023 ప్రారంభ సమావేశానికి హాజరైంది. ఆక్వానార్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా ట్రేడ్‌షో. ఇది ఆక్వా కల్చర్ సాంకేతికత, ఆవిష్కరణలకు సంబంధించిన ప్రదర్శన.
ఆక్వానార్ 2023 ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి హాజరైనఅనంతరం, ఈ రంగంలో వచ్చిన అధునాతన మార్పులను పరిశీలించడంతోపాటు, సుస్థిర ఆక్వాకల్చర్‌కు పరిష్కారాలనుకూడా పరిశీలించారు. ఈ ప్రతినిధివర్గం, ఆక్వాజెన్, పరిశోధనాత్మక బ్రీడిరగ్ కంపెనీని సందర్శించింది. ఇదాఇ అంతర్జాతీయ ఆక్వాకల్చర్ పరిశ్రమకు జెనిటిక్‌స్టార్టర్ మెటీరియల్‌ను, ఫలదీకరణ చెందిన గుడ్లను అందజేస్తుంటుంది. శ్రీ పర్షోత్తం రూపాల, డాక్టర్ ఎల్.మురుగన్‌లు ఆక్వాజెన్ సి.ఇ.ఒ క్నుట్ రోఫ్లో తో సంయుక్తభాగస్వామ్యానికి సంబంధించిన అంశాలను చర్చించారు. సాల్మన్ బ్రీడిరగ్ కు సంబంధించి ఆక్వాజెన్ పరిశోధన, అభివృద్ధి , డైరక్టర్ ఆఫ్ బ్రీడిరగ్, శ్రీ మతియాస్ మెడియానా ప్రెజెంటేషన్ ఇచ్చారు.
***
(Release ID: 1951590)
Visitor Counter : 132