రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో పర్యటిస్తున్న ఐఎన్‌ఎస్‌ సునయన

Posted On: 22 AUG 2023 2:26PM by PIB Hyderabad

ఈ నెల 21వ తేదీన దక్షిణాఫ్రికాలోని డర్బన్ నౌకాశ్రయంలోకి ప్రవేశించిన ఐఎన్‌ఎస్‌ సునయన, దక్షిణాఫ్రికా నౌకాదళానికి చెందిన ఎస్‌ఏఎస్‌ కింగ్ సెఖుఖునే-Iతో కలిసి సముద్ర ప్రయాణ విన్యాసం చేపట్టింది. డర్బన్ నౌకాశ్రయంలో, సీడీఆర్ కెన్నెత్ సింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ నేవల్ బేస్ డర్బన్, హెచ్‌సీఐ ప్రిటోరియా అధికారులు ఐఎన్‌ఎస్‌ సునయనకు స్వాగతం పలికారు.

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య 30 సంవత్సరాల దౌత్య సంబంధాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు, భారత నౌకాదళం-దక్షిణాఫ్రికా నౌకాదళం మధ్య ఉమ్మడి సహకారాన్ని పెంచుకోవడం ఈ పర్యటన లక్ష్యం. నౌకాశ్రయంలో జరిగే కార్యక్రమాల్లో భాగంగా, రెండు నౌకాదళాల సిబ్బంది నౌకలను పరస్పరం సందర్శిస్తారు. తద్వారా ఉత్తమ నౌకాదళ పద్ధతులు, అనుభవాలను పంచుకుంటారు. దీంతోపాటు, సీనియర్ సైనిక అధికారులు, పౌర ప్రముఖులతో సామాజిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.

_____(Release ID: 1951249) Visitor Counter : 91


Read this release in: English , Urdu , Hindi , Tamil