శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
పార్లమెంట్ గత వారం ఆమోదించిన జాతీయ అనుసంధాన్ పరిశోధనా సంస్థ (ANRF) పరిశోధన, విద్యావేత్తలు /సంస్థలకు న్యాయబద్ధంగా నిధులు , వనరులు ప్రజాస్వామ్యీకరణ లక్ష్యంగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
సాంకేతికత నేతృత్వంలో సాగే భారతదేశం అభివృద్ధి కోసం ప్రభుత్వ వైజ్ఞానిక విభాగాలతో మరిన్ని ప్రైవేటు పరిశోధనా సంస్థలను కలుపుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు
అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ శాస్త్రీయ పరిశోధనలకు నిష్పక్షపాతంగా నిధులు సమకూర్చడం, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి వెల్లడించారు.
శాస్త్ర సాంకేతిక రంగాలలో సామర్ధ్యం పెంపు పై న్యూఢిల్లీలో జరిగిన కార్యగోష్ఠిలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, సాంకేతికతతో కూడిన సంపన్న భారతదేశాన్ని నిర్మించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ ప్రయోగశాలలు మధ్య ఆలోచనల పరస్పర మార్పిడి జరగాలని ఉద్ఘాటించారు.
Posted On:
18 AUG 2023 5:15PM by PIB Hyderabad
పార్లమెంట్ గత వారం ఆమోదించిన "జాతీయ అనుసంధాన్ పరిశోధనా సంస్థ" (ANRF) పరిశోధన, విద్యావేత్తలు /సంస్థలకు న్యాయబద్ధంగా నిధులు , వనరుల ప్రజాస్వామ్యీకరణ లక్ష్యంగా పనిచేస్తుంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర); ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్లు, రోదసి & అణుశక్తి శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ శాస్త్ర సాంకేతిక రంగాలలో సామర్ధ్యం పెంపు పై న్యూఢిల్లీలో జరిగిన కార్యగోష్ఠిలో కీలకోపన్యాసం చేస్తూ ఈ విషయం తెలిపారు.
దేశంలో సాంకేతికత ఆధారిత అభివృద్ధి కోసం ప్రభుత్వ వైజ్ఞానిక విభాగాలతో పాటు మరిన్ని ప్రైవేటు పరిశోధనా సంస్థలను కలుపుకోవాలని మంత్రి పిలుపు ఇచ్చారు. శాస్త్రీయ పరిశోధనల కోసం అన్ని సంస్థలకు సమానమైన రీతిలో నిధులు సమకూర్చాలని మరియు అధికంగా ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ యోచనతో రూపొందించిన ANRF సరికొత్త పరిశోధనలతో నూతన తీరాలకు చేరగలదని,
అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ ను చేర్చగలదని మంత్రి ఉద్ఘాటించారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, పరిశోధనాభివృద్ధిలో పెట్టుబడుల కోసం కంపెనీలను ANRF ప్రోత్సహించవలసి ఉంటుందని మంత్రి అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో (PPP) పనిచేసే ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోందని, పరిశోధన నిధులలో ₹36,000 కోట్లు ప్రైవేటు రంగం నుండి రావాలని, పారిశ్రామిక రంగం నుంచి ఎక్కువ భాగస్వామ్యాన్ని నిశ్చయం చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ₹14,000 కోట్లు వెచ్చిస్తుందని ఆయన తెలిపారు.
సత్వర వేగంగా మార్పులు సంభవిస్తున్నాయని, భారత్ మరింత కాలం వేచి ఉండలేదని, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య హద్దులు చెరిపేయాల్సిన తరుణం ఆసన్నమైందని మంత్రి అన్నారు. సాంకేతికతతో కూడిన సంపన్న భారతదేశాన్ని నిర్మించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ ప్రయోగశాలలు మధ్య ఆలోచనల్లో పరస్పరం అర్ధవంతమైన మార్పిడి జరగాలని డాక్టర్ జితేంద్ర సింగ్ ఉద్ఘాటించారు.
సమస్య పరిష్కారం మరియు ఉత్పత్తి పెంపు కోసం వ్యక్తిగత విధానం కంటే బృంద/సమూహ విధానాన్ని అవలంబించాలని మంత్రి అన్నారు.
సామర్ధ్యం పెంపుపై జరిగిన సమావేశానికి శాస్త్రీయ విభాగం అధిపతులందరూ హాజరు కావడంతో పాటు అధిక సంఖ్యలో శాస్త్రవేత్తలు ఆన్‌లైన్‌లో వచ్చి చేరడం పట్ల డాక్టర్ జితేంద్ర సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. కార్పొరేట్ రంగంలో మంచి విషయాలు, ఉత్తమ ఆచరణ/ అభ్యాసాలను అలవరచుకోవాలని శాస్త్రీయ సమాజాన్ని మంత్రి ఉద్బోధించారు. "సామర్ధ్యం పెంపు విలీనం / గ్రహించడం ప్రభావసీమ తప్పనిసరిగా నిర్వచించండి" అని ఆయన నొక్కి చెప్పారు.
అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలతో కలిసి భారత్ ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పురోగతి ముందడుగు వేస్తోందని / ఆరంభిస్తోందని చెప్తూ, ఇందుకు నేషనల్ క్వాంటం మిషన్ (NQM) , అంతరిక్ష రంగంలో అంతర్జాతీయ పురస్కారం ఉదాహరణ పేర్కొన్నారు.
కృత్రిమ మేధ, పరిమాణ టెక్నాలజీలో పెట్టుబడులు మన దైనందిన జీవితంలో పరివర్తనాత్మక పురోగతికి దారితీస్తాయని మరియు ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాతావరణ మార్పు తదితర క్షేత్రాలలో ప్రభావం చూపడం ద్వారా మన సామాజిక శ్రేయస్సుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని మంత్రి అన్నారు. ధర్మనిధి పరివర్తన సామర్థ్యాన్ని ఆయన స్వాగతించారు.
కెపాసిటీ బిల్డింగ్ కమీషన్ (CBC) చైర్మన్ శ్రీ ఆదిల్ జైనుల్ భాయ్, భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు అజయ్ సూద్, శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే, DBT కార్యదర్శి శ్రీ ప్రవీణ్ పరదేశి, CBC సభ్యుడు (అడ్మిన్), పలువురు సీనియర్ శాస్త్రవేత్తలు మరియు అధికారులు కార్యగోష్ఠిలో పాల్గొన్నారు.
కెపాసిటీ బిల్డింగ్ కమీషన్ గురించి
మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల సామర్ధ్యం పెంపొందించడానికి అవసరమైన వ్యూహాత్మక చట్రాన్ని అందించడానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సిబిసి) ఏర్పాటుచేశారు. ఈ వ్యూహాత్మక చట్రం వార్షిక కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ (ACBP)గా రూపొందించడ మైనది. ఇది గుర్తించబడిన సామర్థ్యాలను క్యాలెండరైజ్డ్ ఫార్మాట్‌లో అందిస్తుంది. ఈ లక్ష్యానికి మద్దతుగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది, వాటితో సహా:
సామర్ధ్య పెంపు కోసం యోగ్యత-ఆధారిత చట్రం
ఆన్‌లైన్ లో జ్ఞానార్జన వేదిక
పనితీరు నిర్వహణ వ్యవస్థ
నిరంతర అభ్యాస సంస్కృతి
వివిధ రంగాలలో విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి శాస్త్రీయ సామర్థ్యం పెంపుదల అవసరం. పరిశోధనా అవస్థాపన, శిక్షణ మరియు విద్యలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారతదేశం ప్రపంచ శాస్త్రీయ పురోగతికి గణనీయంగా దోహదపడుతుంది. బలమైన శాస్త్రీయ శ్రామికశక్తి స్థానిక మరియు ప్రపంచ సవాళ్లను పరిష్కరించే కొత్త సాంకేతికతలు, ఉత్పత్తులు మరియు పరిష్కారాల సృష్టిని ప్రేరేపించగలదు. దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందగలదు , తద్వారా శాస్త్రీయ సామర్ధ్యం పెంపొంది ఆర్థిక వృద్ధికి మరింత వేగిరం చేస్తుంది. వృద్ధిపొందుతున్న శాస్త్రీయ పర్యావరణ వ్యవస్థ ఆర్థిక వృద్ధిని మరియు ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించగలదు. పరిశోధన మరియు వినూత్న కల్పనలు కొత్త పరిశ్రమలు, అంకుర సంస్థలు మరియు వ్యాపారాల అభివృద్ధికి దారితీస్తాయి, తద్వారా ఉపాధి అవకాశాల సృష్టికి దారితీస్తాయి.
***
(Release ID: 1950938)
Visitor Counter : 182