సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
తమిళనాడులో పలు కెవిఐ కార్యకలాపాలను ప్రారంభించిన కెవిఐసి చైర్మన్
Posted On:
20 AUG 2023 11:52AM by PIB Hyderabad
తన తమిళనాడు పర్యటన సందర్భంగా పలు కెవిఐ కార్యకలాపాలను ప్రారంభించడమే కాక తన ఈ పర్యటన సందర్భంగా ఖాదీ కార్మికులతో కెవిఐసి చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ ముచ్చటించారు. కోయంబత్తూరులోసి సిట్రాలో 19 ఆగస్టు 2023న జరిగిన ఖాదీ కారిగార్ సమ్మేళానికి అధ్యక్షత వహించిన ఆయన గత రెండు రోజులగా తమిళనాడు ప్రజలు అందించిన ప్రేమకు, సంరక్షణకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం ఖాదీ కారిగార్ సమ్మేళనమే కాక తనకు, గ్రామీణ చేతివృత్తుల వారికీ మధ్య జరిగిన మనసులో మాటలు (మన్ కీ బాత్) అంటూ ఆయన నొక్కి చెప్పారు. ఖాదీ అన్నది దారిద్య్రం, ఆకలితో అలమటించడం, నిరుద్యోగతకు వ్యతిరేకంగా ఉపయోగించగల ఆయుధంగా ఉపయోగపడుతుందని, అదే సమయంలో అది గ్రామాలలో అభివృద్ధికి దోహదం చేస్తూ, మహిళా సాధికారతను కూడా అది ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.
దాదాపు 400మంది వ్యర్ధ చెక్కతో హస్తకళలలో శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకున్న వారికి టూల్ కిట్‌లను, పరికరాలను అందించడమే కాక అత్యుత్తమంగా రాణించిన చేనేత పనివారికి సర్టిఫికెట్లను, మొమెంటోలను అందించారు. చెక్క పనిలో శిక్షణకు 800 గ్రామీణ చేతివృత్తుల కళాకారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా, పిఎంఇజిపి లబ్ధిదారుల విజయగాథలను వివరించే బుక్‌లెట్‌ను చైర్మన్ ఆవిష్కరించారు.
నీతీ ఆయోగ్ విడుదల చేసిన డేటా ప్రకారం 13.05 కోట్లమంది ప్రజలను దారిద్య్ర రేఖ నుంచి పైకి తీసుకురావడం జరిగిందని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వం కింద ప్రజలల స్వప్నాలు సాకారమవుతున్నాయని, వాస్తవరూపం దాలుస్తున్నాయని శ్రీ కుమార్ తన ఉపన్యాసంలో తెలిపారు.
మహాత్మాగాంధీ నాయకత్వం కింద జాతీయోద్యమంలో ఖాదీ ఆత్మగౌరవానికి సంకేతం కాగా, ప్రస్తుతం ప్రధానమంత్రి మార్గదర్శనంలో ఆత్మనిర్భర్ భారత్‌కు తార్కాణంగా నిలుస్తోందని శ్రీ కుమార్ అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఖాదీని ఒక శక్తిమంతమైన ఆయుధంగా గాంధీజీ ఉపయోగించినట్టు, ప్రధానమంత్రి మోడీ దారిద్య్ర నిర్మూలనకు, హస్తకళాకారులను సాధికారం చేసేందుకు, ఆహార భద్రతకు హామీ ఇచ్చేందుకు, మహిళల సామాజిక హోదాను పెంచేందుకు, నిరుద్యోగతను అధిగమించేందుకు ఖాదీని ఒక బలమైన, విజయవంతమైన ఆయుధంగా మార్చరని ఆయన పేర్కొన్నారు.
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఖాదీని, గ్రామీణ పరిశ్రమలను కొనుగోలు చేయవలసిందిగా పిలుపివ్వడంతో పాటు ఈ రంగాన్ని ప్రోత్సహించాలని ప్రస్తావించారని చైర్మన్ అన్నారు. ఈ పరిశ్రమ 2014 నుంచి అద్భుతమైన వృద్ధిని చవి చూస్తోందన్నారు. గత 9 ఏళ్ళలో, ఖాదీ ఉత్పాదన 260% పెరుగగా, ఖదీ అమ్మకాలు 450% పెరిగాయని అన్నారు. తమిళనాడులోని ఖాదీ సంస్థలు 2022-23వ సంవత్సరంలో రూ.262.55 కోట్ల ఉత్పత్తిని, రూ. 466.77 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది14,396 చేతివృత్తుల వారికి నిరంతర ఉపాధి కల్పించడానికి తోడ్పడిందని తెలిపారు. ఇంకా, ఉత్పత్తిని రూ. 03.39 కోట్లకు, అమ్మకాలను 477.02 కోట్లకు పెంచాలని ప్రతిపాదించినట్టు తెలిపారు. ఖాదీ వికాస్ యోజన, గ్రామోద్యోగ్ వికాస యోజన, పిఎంఇజిపి, స్కీం ఆఫ్ ఫండ్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ (ఎస్ఎఫ్‌యుఆర్‌టిఐ -సంప్రదాయ పరిశ్రమలకు నిధుల పునరుద్ధరణ పథకం) వంటి వివిధ పథకాల ద్వారా 9.5 లక్షలకు పైగా ఉద్యోగాలను కెవిఐసి కల్పించిందని చైర్మన్ తెలిపారు.
అంతకుముందు, తన పర్యటన సందర్భంగా కెవిఐసి చైర్మన్ కాలాపేట్‌లో పిఎంఇజిపి యూనిట్‌ను, గాంధీ గ్రామ్, దిండిగల్లో కొత్తగా పునరుద్ధరించి ఖాదీ గ్రామ్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ చారిటబుల్ ట్రస్టును,కెవిఐసికి చెందిన కెఆర్‌డిపి పథకం కింద నూతనంగా నిర్మించిన వర్క్‌షెడ్‌లో నూలు డైయింగ్ యూనిట్ కు చెందిన కామన్ ఫెసిలిటీ సెంటర్ (సిఎఫ్‌సి)ని శ్రీవిల్లిపుత్తూర్‌లో రామనాథపురం జిల్లా సర్వోదయ సంఘ్‌లో చైర్మన్ ప్రారంభించారు.
గ్రామోద్యోగ వికాస్ యోజన కింద 17 ఆగస్టు 2023న, 18 ఆగస్టు 2023న 25 మంది వ్యర్ధ చెక్క కళాకారులకు టూల్ కిట్‌లను, పరికరాలను, 10మంది చేతివృత్తుల వారికి పెడల్‌తో పని చేసే అగరబత్తి యంత్రాలను పంపిణీ చేశారు. ఖాదీ నేతగాళ్ళ సమావేశంలో ఆయన ఖాదీ వడికే వారితోనూ, నేసేవారితో ముచ్చటించి, ముధురై ఖాదీ గ్రామోద్యోగ భవన్‌ను, సర్వోదయ సంఘ్‌ను సందర్శించారు.
ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మక పథకమైన ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సూక్ష్మ, చిన్నతరహా యూనిట్ల ఏర్పాటు చేయడం ద్వారా నిలకడైన ఉపాధిని కల్పిస్తోంది. దరఖాస్తుదారు సామాజిక వర్గం, యూనిట్ ఉన్న స్థానం ఆధారంగా ఉత్పత్తి కార్యకలాపాల కోసం మొత్తం రూ. 50.00 లక్షలకు, సేవా కార్యకలాపాల కోసం రూ. 20.00 లక్షలకు మించని ప్రాజెక్టుల వ్యయం గల యూనిట్లకు 15% నుంచి 35% వరకు సబ్సిడీని ఈ పథకం అందచేస్తుంది.
***
(Release ID: 1950672)
Visitor Counter : 149