విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లేలో ప్రయోగాత్మక ప్రాతిపదికన ఇంట్రాసిటీ హైడ్రోజెన్ బస్సులు ప్రారంభం

प्रविष्टि तिथि: 18 AUG 2023 6:26PM by PIB Hyderabad

లదాఖ్  ను కర్బన వ్యర్థాల రహితంగా చేయడం లక్ష్యంగా ఎన్ టిపిసి హైడ్రోజెన్  ఇంధనం స్టేషన్లు, సోలార్ ప్లాంట్  ప్రారంభించడంతో పాటు లేలో ఐదు ఇంట్రా సిటీ రూట్లలో ఫ్యుయెల్  సెల్  బస్సులు  అందుబాటులోకి తెస్తోంది.

మూడు నెలల పాటు జరిగే క్షేత్రస్థాయి పరీక్షలు, ఇతర చట్టపరమైన విధానాల కోసం 2023 ఆగస్టు 17వ తేదీన తొలి హైడ్రోజెన్  బస్సు లే చేరింది. ప్రజలు తిరిగే రోడ్లపై హైడ్రోజెన్  బస్సులు ప్రవేశపెట్టడం దేశంలో ఇదే ప్రథమం.

11,562 అడుగుల ఎత్తులో గ్రీన్  హైడ్రోజెన్  మొబిలిటీ  ప్రాజెక్టు చేపట్టడం కూడా ఇదే ప్రథమం. దీనికి అవసరం అయిన పునరుత్పాదక ఇంధనం అందించడం కోసం 1.7 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్  ప్లాంట్  కూడా ఏర్పాటు చేశారు. కొండప్రాంతాల్లోని అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉండే సబ్  జీరో ఉష్ణోగ్రతలో కూడా పని చేయగల విధంగా ఫ్యుయెల్  సెల్  బస్సులు డిజైన్  చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.

2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యం సాధించే దిశగా ఎన్  టిపిసి ముందుకు సాగుతోంది. తద్వారా గ్రీన్  హైడ్రోజెన్  టెక్నాలజీ, ఇంధన నిల్వ విభాగంలో ప్రధాన కంపెనీగా మారాలనుకుంటోంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా హైడ్రెజెన్  మిశ్రమం, కర్బన్  కాప్చర్, ఇవి బస్సులు, స్మార్ట్  ఎన్  టిపిసి టౌన్  షిప్ ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటోంది.  

***

 


(रिलीज़ आईडी: 1950389) आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi