విద్యుత్తు మంత్రిత్వ శాఖ
బీహార్‌లోని బార్హ్‌లో ఎన్‌టిపిసి 660 మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన కేంద్ర విద్యుత్ మంత్రి
Posted On:
18 AUG 2023 5:11PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కే.సింగ్ బీహార్‌లోని బార్హ్‌లో ఆగస్టు 18న 660మెగావాట్ల యూనిట్ బార్హ్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు.ఇది రెండో దేశ ప్రాజెక్టు. దేశానికి విశ్వసనీయమైన, సరసమైన విద్యుత్‌ను అందించాలనే ప్రభుత్వ ప్రయత్నంలో ఈ యూనిట్‌ను ప్రారంభించడం మరో మైలురాయి.
సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, యూనిట్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రాజెక్ట్‌లో పాల్గొన్న అందరు ఇంజనీర్లు, కార్మికులతో సహా ఎన్‌టిపిసి బృందాన్ని అభినందించారు. ప్రాజెక్టులో మిగిలిన మూడో యూనిట్ కూడా విజయవంతంగా పూర్తవుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. బీహార్‌లో 90 శాతం కంటే ఎక్కువ విద్యుత్తు అవసరాలను తీర్చినందుకు ఎన్‌టిపిసిని విద్యుత్ మంత్రి అభినందించారు.
గత తొమ్మిదేళ్లలో దేశాన్ని విద్యుత్ లోటు నుంచి విద్యుత్ మిగులు దేశంగా ప్రభుత్వం మార్చిందని మంత్రి తెలియజేశారు. దేశం మొత్తం ఒకే పౌనఃపున్యంతో ఒకే ఇంటిగ్రేటెడ్ గ్రిడ్‌గా అనుసంధానించబడిందని మంత్రి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంపిణీ వ్యవస్థలను పటిష్టపరిచామని, అన్ని రాష్ట్రాల్లో పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు 2 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో పథకాలు అమలుచేశామని మంత్రి తెలిపారు. . గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు సగటున ఇరవైన్నర గంటలు, పట్టణ ప్రాంతాల్లో సగటున ఇరవై మూడున్నర గంటలు విద్యుత్ లభ్యత ఉందని శ్రీ సింగ్ తెలియజేశారు.
విద్యుత్ మంత్రిత్వ శాఖ విద్యుత్ చట్టం, 2003 కింద విద్యుత్ (వినియోగదారుల హక్కులు) రూల్స్, 2020ని నోటిఫై చేసిందని మంత్రి తెలియజేసారు. ఈ నిబంధనలను అమలు చేయడం వల్ల కొత్త విద్యుత్ కనెక్షన్లు, రీఫండ్‌లు, ఇతర సేవలు సకాలంలో అందించగలుగుతామని ఆయన తెలిపారు.
అనంతరం, బర్హ్ ప్రాజెక్ట్ యూనిట్-2 (660మెగావాట్లు) పూర్తి చేసినందుకు సంబంధించి ఇంజనీర్లు, కార్మికులను కేంద్ర మంత్రి సత్కరించారు. బార్హ్ ఎమ్మెల్యే శ్రీ జ్ఞానేంద్ర కుమార్ సింగ్ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. అంతకుముందు, ఎన్‌టిపిసి సీఎండీ శ్రీ గురుదీప్ సింగ్ మంత్రి, ఇతర ప్రముఖులకు స్వాగతం పలికారు. పవర్ గ్రిడ్ సీఎండీ శ్రీ కే. శ్రీకాంత్; ఎన్‌టిపిసి డైరెక్టర్ (హెచ్ఆర్) శ్రీ దిల్లీప్ కుమార్ పటేల్; ఎన్‌టిపిసి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) శ్రీ ఉజ్వల్ కాంతి భట్టాచార్య; బీహార్ ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఎన్‌టిపిసి ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి క్లిక్ చేయండి... here.
***
(Release ID: 1950387)
Visitor Counter : 143