కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సేవల అందుబాటు (వైర్‌లెస్ & వైర్‌లైన్), బ్రాడ్ బ్యాండ్ (వైర్‌లెస్ & వైర్‌లైన్) సేవల నాణ్యత ప్రమాణాల సమీక్ష పై సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసిన ట్రాయ్
Posted On:
18 AUG 2023 6:20PM by PIB Hyderabad
సౌలభ్య సేవలు (క్వాలిటీ ఆఫ్ సర్వీస్ స్టాండర్డ్స్ ఫర్ యాక్సెస్ సర్వీసెస్) (వైర్‌లెస్ & వైర్‌లైన్), బ్రాడ్‌బ్యాండ్ (వైర్‌లెస్ & వైర్‌లైన్) సేవలకు నాణ్యతా ప్రమాణాలపై సమీక్ష అన్న అంశంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( టిఆర్ఎఐ- ట్రాయ్) గురువారం సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది.
టెలికమ్యూనికేషన్ సేవల వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి సేవా నాణ్యతను నిర్ధారించడాన్ని ట్రాయ్ చట్టం, 1997 తప్పనిసరి చేసింది. ఇందుకు అనుగుణంగా, టెలికాం సేవల కోసం ట్రాయ్ దిగువన పేర్కొన్న నాణ్యమైన సేవా ప్రమాణాలు (క్యూఒఎస్) నిబంధనలను నోటిఫై చేసింది.
ప్రాథమిక టెలిఫోన్ సేవ (వైర్‌లెస్), సెల్యులార్ మొబైల్ టెలిఫోన్ సేవ నిబంధనల నాణ్యతా ప్రమాణాలు, 2009 బ్రాడ్‌బ్యాండ్ సేవ నిబంధనలు 2006, వైర్‌లెస్ డేటా సేవల నిబంధనలు 2012 కోసం సేవా నాణ్యత ప్రమాణాలు. ఈ నిబంధనలను 4జి వంటి నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టడం ఆధారంగా ఎప్పటికప్పుడు సవరించారు.
ట్రాయ్ ముఖ్యంగా 5జి సేవలను ప్రవేశపెట్టిన తర్వాత నుంచి కాల్‌డ్రాప్స్, నెట్‌వర్క్ సంబంధ అంశాలకు సంబంధించి వినియోగదారుల నుంచి లెక్కలేనన్ని ఫిర్యాదులను అందుకుంటోంది. త్రైమాసిక క్యూఒసి పనితీరు నివేదికల పై వివరణాత్మక విశ్లేషణపై ఎల్ఎస్ఎ వంటి పెద్ద ప్రాంతంలో త్రైమాసిక పనితీరు అంచనా వ్యవధి కారణంగా, సేవలను అందించేవారు (సర్వీస్ ప్రొవైడర్లు) ఎల్ఎస్ఎ స్థాయిలో మొత్తం క్యూఒఎస్ ప్రమాణాలను నెరవేరుస్తుండగా, సగటు ప్రభావం కారణంగా, కొన్ని ప్రాంతాలలో పేలవమైన సేవల నాణ్యత అనుభవంలోకి వస్తోందని, అథారిటీ పేర్కొంది.
ఇందుకు అనుగుణంగా, క్యూఒఎస్ స్థితిగతులను సన్నిహితంగా వీక్షించేందుకు, ముసాయిదా నిబంధనలు ఎల్ఎస్ఎ స్థాయికి అదనంగా రాష్ట్ర, యుటి స్థాయిలో నెలవారీ క్యూఒఎస్ పనితీరును నివేదించాలని ప్రతిపాదించడం జరిగింది.
వాయిస్, డేటా సేవల కోసం క్యూఒఎస్ పారామితులు, ప్రమాణాలు ప్రస్తుత నిబంధనలలో సాంకేతికంగా సంశయాత్మకంగా ఉన్నాయి. 5జి క్యూఒఎస్ పనితీరును పర్యవేక్షించేందుకు ముసాయిదా నిబంధనలలో 5జి సేవలకు సంబంధించి సహేతుక పదజాలాన్ని కూడా నవీకరించారు.
దేశంలో 2జి & 3 జి నెట్‌వర్క్‌లతో పోలిస్తే 4జి & 5జి నెట్‌వర్క్‌లు విస్త్రత కవరేజిని అందిస్తుండడంతో, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు 4జి & 5జి సేవలకు, ముఖ్యంగా కాల్‌డ్రాప్స్‌కు సంబంధించి కఠినమైన పనితీరు ప్రమాణాలను రూపొందించారు.
మంచి క్యూఒఎస్ కోసం నెట్‌వర్క్ అందుబాటు అనేది ముఖ్యమైన అవసరం. కనుక, వినియోగదారులకు అంతరాయం లేని సేవలు అందేలా చూసేందుకు సేవలు అందించే (సర్వీస్ ప్రొవైడర్) నెట్‌వర్క్ లభ్యత పనితీరును రాష్ట్ర, యుటి స్థాయిలో పర్యవేక్షించాలని ప్రతిపాదించారు.
క్యూఒఎస్ నిబంధనా చట్రాన్ని సరళీకృతం చేసేందుకు, అన్ని వాయిస్, డేటా సేవలకు వాటి అందుబాటు మాధ్యమంతో అంటే, వైర్‌లైన్, వైర్‌లెస్ సేవలు రెండింటితో సంబంధం లేకుండా క్యూఒఎస్ ప్రమాణాలతో వ్యవహరించే ఒకే నియంత్రణను కలిగి ఉండాలని ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా, ప్రస్తుతం ఉన్న మూడు నిబంధనలను విలీనం చేసి ఒకటే నిబంధనగా చేయాలని ప్రతిపాదించారు.
పైన పేర్కొన్న నేపథ్యంలో, క్యూఒఎస్ సంబంధిత సహేతుక అంశాలను పరిపూర్ణ రీతిలో పరిష్కరించేందుకు, వాటాదారుల నుంచి వ్యాఖ్యలను కోరేందుకు ప్రాధికార సంస్థ సంప్రదింపుల పత్రాన్ని జారీ చేసింది. ఈ సంప్రదింపుల పత్రంపై వాటాదారుల నుంచి లిఖితపూర్వక వ్యాఖ్యలను 20 సెప్టెంబర్ 2023 నాటికి పంపాలని ఆహ్వానించింది. ఏవైనా ప్రతివ్యాఖ్యలు ఉంటే, వాటిని 05 అక్టోబర్ 2023 నాటికి సమర్పించాలని కోరింది. వ్యాఖ్యలను, ప్రతివ్యాఖ్యలను ప్రధానంగా ఎలక్ట్రానిక్ రూపంలో adv-qos1@trai.gov.in అన్న ఇమెయిల్ చిరునామాకు పంపవచ్చు.
సంప్రదింపుల పత్రాన్ని ట్రాయ్ వెబ్‌సైట్ www.trai.gov.inలో ఉంచడం జరిగింది. ఏదైనా స్పష్టీకరణ/ సమాచారం కోసం ట్రాయ్ సలహాదారు (క్యూఒఎస్-1) శ్రీ తేజ్‌పాల్ సింగ్ ను టెలిఫోన్ నెం. +91-11-2323516లో సంప్రదింవచ్చు.
***
(Release ID: 1950376)
Visitor Counter : 117